ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

97.65 కోట్ల డోసులను దాటిన భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


98.10 శాతానికి చేరిన రికవరీ రేటు; 2020 మార్చి నుంచి గరిష్ట స్థాయి

గత 24 గంటల్లో 14,146 కొత్త కేసులు నమోదు

220 రోజుల కనిష్ట స్థాయికి క్రియాశీల కేసులు (1,95,846)

వారపు పాజిటివిటీ రేటు ‍(1.42 శాతం) గత 114 రోజులుగా 3 శాతం కంటే తక్కువ

Posted On: 17 OCT 2021 9:57AM by PIB Hyderabad

భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం నిన్నటితో 97.65 కోట్ల డోసులను దాటింది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 41,20,772 డోసులతో కలిపి, 97.65 కోట్ల డోసులను (97,65,89,540) టీకా కార్యక్రమం అధిగమించింది. 96,46,485 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,75,835

రెండో డోసు

90,75,869

 

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,61,737

రెండో డోసు

1,55,14,198

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

39,26,91,878

రెండో డోసు

11,02,63,827

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

16,76,26,429

రెండో డోసు

8,58,84,392

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

10,56,78,041

రెండో డోసు

6,11,17,334

మొత్తం

97,65,89,540

 

గత 24 గంటల్లో 19,788 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,34,19,749 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.10 శాతానికి చేరింది. 2020 మార్చి నుంచి ఇదే గరిష్ట స్థాయి.

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 112వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 14,146 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది 229 రోజుల కనిష్ట స్థాయి.

 

ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 1,95,846. ఇది 220 రోజుల కనిష్ట స్థాయి. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో ఈ సంఖ్య 0.57 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 11,00,123 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 59 కోట్లకు పైగా (59,09,35,381) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.42 శాతంగా ఉంది. గత 114 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.29 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 48 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా, 131 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. 

 

****



(Release ID: 1764518) Visitor Counter : 141