మంత్రిమండలి

స్థిరమైన ఫలితాల కోసం 2025-26 వరకు స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) [ఎస్‌బిఎం యు] కొనసాగించడానికి కేబినెట్ ఆమోదం




ఎస్‌బిఎం-యు 2.0 కొరకు రూ.1,41,600 కోట్ల ఆర్థిక వ్యయం. మొదటి దశ మిషన్ కంటే ఇది 2.5 రెట్లు ఎక్కువ



1 లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న అన్ని నగరాల్లో బహిరంగ మల విసర్జనను పూర్తిగా నిర్మూలించాలని ఎస్‌బిఎం-యు 2.0 లక్ష్యంగా పెట్టుకుంది



మురుగు కాలువలు మరియు సెప్టిక్ ట్యాంకుల్లోకి ప్రమాదకరమైన ప్రవేశాన్ని నిర్మూలించడం



నీటి వనరులను కలుషితం చేసే శుద్ధి చేయని మురుగునీటిని అరికట్టడం



అన్ని నగరాలు కనీసం 3-స్టార్ గార్బేజ్ ఫ్రీ సర్టిఫికేషన్ సాధించాలి

Posted On: 12 OCT 2021 8:37PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం నేడు 2025-26 వరకూ స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) కొనసాగింపునకు  ఆమోదం తెలిపింది. బహిరంగ మల విసర్జన రహిత (ఓడిఎఫ్‌) ఫలితాల సుస్థిరతపై దృష్టి పెట్టి అన్ని నగరాల్లో ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేయడం మరియు 2011 జనగణన ప్రకారం 1 లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల్లో [అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్‌) పరిధిలో లేని నగరాలు] మురుగునీటి నిర్వహణ.

 

ఎస్‌బిఎం-అర్బన్ 2.0 కింద ఆర్థిక వ్యయం:

 

ఎస్‌బిఎం-యు 2.0 అమలు కోసం  రూ.1,41,600 కోట్ల ఆర్ధిక వ్యయం ఖరారు చేయబడింది. ఇందులో కేంద్ర వాటా 2021-22 నుండి 2025-26 వరకు ₹ 36,465 ఉంటుంది. ఇది మునిపటి దశలోని మిషన్‌కు కేటాయించిన రూ.62,009 కోట్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ.

 

కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య నిధుల భాగస్వామ్య నమూనా క్రింది విధంగా ఉంది:

మిలియన్ ప్లస్ జనాభా కలిగిన నగరాలు: 25:75

1-10 లక్షల మధ్య జనాభా ఉన్న నగరాలు: 33:67

లక్ష జనాభా కంటే తక్కువ ఉన్న నగరాలు: 50:50

శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాలు: 100: 0

శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలు: 80:20

 

స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 కింద ఆశించిన ఫలితాలు

 

పారిశుధ్యం:

 

1.      అన్ని చట్టబద్ధమైన పట్టణాలు కనీసం ఓడిఎఫ్‌+ గా మారాలి

2.      <1 లక్ష జనాభా ఉన్న అన్ని నగరాలు ఓడిఎఫ్‌++ చేయబడాలి

3.      అన్ని వ్యర్థ జలాలను సురక్షితంగా శుద్ధి చేయడానికి మరియు ఉత్తమంగా పునర్వినియోగించడానికి మరియు శుద్ధి చేయని వ్యర్థజలాలు నీటి వనరులను కలుషితం చేయని విధంగా వ్యవస్థలు మరియు ప్రక్రియలను ఏర్పాటు చేయడం

 

ఘన వ్యర్థాల నిర్వహణ:

·        అన్ని నగరాలు కనీసం 3-స్టార్ గార్బేజ్ ఫ్రీ సర్టిఫికేషన్ సాధించాలి

 

స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0: ముఖ్య లక్షణాలు

 

గౌరవనీయులైన ప్రధాన మంత్రి 1 అక్టోబర్ 2021 న ప్రారంభించిన ఎస్‌బిఎం-యు 2.0 యొక్క సంకల్పంపారిశుధ్యం మరియు ఘన వ్యర్థాల నిర్వహణ ఫలితాలను రాబోయే 5 సంవత్సరాలలో సాధించడం మరియు ఉత్పత్తి వేగాన్ని వేగవంతం చేయడంతద్వారా అర్బన్ ఇండియా మిషన్ యొక్క "చెత్త రహిత" విజన్ సాధించడం.

 

మిషన్ కాంపోనెంట్‌ల అమలు నిర్మాణాత్మక మరియు సమయానికి అనుగుణంగా నెరవేర్చడంఅవసరమైన మౌలిక సదుపాయాల సమగ్ర విశ్లేషణవివరణాత్మక 5 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళికలు మరియు టైమ్‌లైన్‌లతో వార్షిక కార్యాచరణ ప్రణాళికలతో జరుగుతుంది. మిషన్ పూర్తిగా కాగిత రహితండిజిటల్డిజిటల్ టెక్నాలజీని పూర్తి పారదర్శకత మరియు జవాబుదారీతనం కోసం జిఐఎస్-మ్యాప్డ్ వ్యర్థాల నిర్వహణ మౌలిక సదుపాయాలుబలమైన వినియోగదారు ఇంటర్‌ఫేస్ఆన్‌లైన్ ఫిర్యాదు పరిష్కార వ్యవస్థప్రాజెక్ట్ సృష్టి నుండి నిధుల విడుదల వరకు ప్రాజెక్టుల ఎండ్-టు-ఎండ్ ఆన్‌లైన్ పర్యవేక్షణ. మరియు ఇంటిగ్రేటెడ్ జిఐఎస్‌- ఆధారిత ప్లాట్‌ఫామ్‌పై ప్రాజెక్ట్ పురోగతి పర్యవేక్షణ జరుగుతుంది.

 

ఫలితాల ఆధారంగా నిధుల విడుదలచిన్న యూఎల్‌బిలకు ఎక్కువ నిధుల మద్దతు మరియు అదనపు నిధుల మద్దతు కోసం 15 వ ఎఫ్‌సి నిధులతో కన్వర్జెన్స్ప్రతి భాగం కోసం నిర్మాణాత్మక అమలు ప్రణాళికస్థిరమైన ప్రవర్తన మార్పు కోసం బలమైన సామర్థ్య నిర్మాణంకమ్యూనికేషన్ మరియు న్యాయపరమైనప్రైవేట్ రంగం మరియు విస్తృతమైన పరిశ్రమ సహకారం మిషన్ లక్ష్యాలను నిర్దేశిత కాలక్రమంలో సాధించడానికి సహాయపడతాయి.

 

స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 కింద కీలక ఆంశాలు

 

ఎస్‌బిఎం-యు 2.0 కింద అమలు చేయడానికి కింది అంశాలు కీలకం:

 

స్థిరమైన పారిశుధ్యం:

 

రాబోయే 5 సంవత్సరాలలో ఉపాధి మరియు మెరుగైన అవకాశాల కోసం గ్రామీణ నుండి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్న అదనపు జనాభాకు సేవ చేయడానికి అందుకు అనుగుణంగా పారిశుద్ధ్య సౌకర్యాలను విస్తరించడంపై  మిషన్ దృష్టి సారించింది. 3.5 లక్షలకు పైగా వ్యక్తిగతకమ్యూనిటీ మరియు పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం ద్వారా ఇది జరుగుతుంది.

1 లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న నగరాలలో పూర్తి ద్రవ వ్యర్థాల నిర్వహణ-ఎస్‌బిఎం-Urban 2.0 లో ప్రవేశపెట్టిన కొత్త ఆంశం. ప్రతి నగరంలో వ్యవస్థలు మరియు ప్రక్రియలు ఏర్పాటు చేయబడిందని ఇది నిర్ధారిస్తుంది. తద్వారా మురుగునీరంతా సురక్షితంగా ఉంటుందిసేకరించబడుతుందిరవాణా చేయబడుతుంది మరియు శుద్ధి చేయబడుతుంది. తద్వారా నీటి వనరులను కలుషితం చేసే మురుగు నీరు ఉండదు.

 

స్థిరమైన ఘన వ్యర్థాల నిర్వహణ:

 

ప్రతి నగరంలో ఫంక్షనల్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్ (ఎంఆర్‌ఎఫ్‌లు) తో పాటు 100 శాతం మూల వ్యర్థాల విభజన, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ని దశలవారీగా తొలగించడంపై దృష్టి సారించింది.

నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్‌సిఎపి) నగరాల్లో మరియు 5 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో నిర్మాణం కూల్చివేత (సి అండ్ డి) వ్యర్థాల ప్రాసెసింగ్ సౌకర్యాల ఏర్పాటు మరియు యాంత్రిక స్వీపర్‌ల ఏర్పాటు

అన్ని లెగసీ డంప్‌సైట్‌ల పునరుద్ధరణతద్వారా 15 కోట్ల టన్నుల లెగసీ వ్యర్థాల కింద ఉన్న 14,000 ఎకరాల లాక్ చేయబడిన భూమి విముక్తి పొందుతుంది.

 

పైన పేర్కొన్నది యుఎల్‌బిలు మరియు సంబంధిత వాటాదారుల యొక్క బలమైన సామర్థ్య బిల్డింగ్ ద్వారా సాధించబడుతుంది మరియు జన్ ఆందోళన్‌ను మరింత పెంచడం కోసం కమ్యూనికేషన్ మరియు అడ్వకేసీ ద్వారా పౌరుల భాగస్వామ్యంపై దృష్టి సారించింది.

 

వ్యక్తిగత రక్షణ పరికరాలు మరియు భద్రతా వస్తు సామగ్రిని అందించడం ద్వారా పారిశుధ్యం మరియు అనధికారిక వ్యర్థ కార్మికుల శ్రేయస్సుపై ప్రత్యేక దృష్టి ఉంటుందివారి సామర్థ్య నిర్మాణంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అనుసంధానం ఉంటుంది.

 

స్వచ్ఛ భారత్ మిషన్- అర్బన్ లక్ష్యాలు

 

2014 లో ప్రధాన మంత్రి యొక్క దూరదృష్టిగల నాయకత్వంలో భారతదేశం పట్టణ ప్రణాళిక కోసం ఒక సంపూర్ణ బాధ్యతను స్వీకరించింది. మరియు నీరు మరియు పారిశుధ్య రంగంలో పరివర్తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఎస్‌బిఎం ప్రారంభానికి సంబంధించిన ప్రకటనను 15 ఆగస్టు 2014 న ప్రధానమంత్రి ప్రకటించారు. ఆ మిషన్ ఈ క్రింది లక్ష్యాలతో 2 అక్టోబర్ 2014 న లాంఛనంగా ప్రారంభించబడింది:

 

·        అన్ని చట్టబద్ధమైన పట్టణాలలో బహిరంగ మల విసర్జన నిర్మూలన

·        అన్ని చట్టబద్ధమైన పట్టణాలలో మున్సిపల్ ఘన వ్యర్థాల 100% శాస్త్రీయ నిర్వహణ

·        జన్ ఆందోళన్ ద్వారా పౌరుల ప్రవర్తనలో మార్పు ప్రభావం

 

స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ యొక్క విజయాలు

 

గత ఏడు సంవత్సరాలలో ఈ మిషన్ దేశం నలుమూలలకు చేరుకుంది మరియు దాని 'పీపుల్ ఫస్ట్‌లక్ష్యంతో లెక్కలేనన్ని పౌరుల జీవితాలను మార్చింది. ఎస్‌బిఎం- అర్బన్ కింద కీలక మైలురాళ్లువిజయాలు మరియు ప్రభావం:

 

·        పట్టణ భారతదేశంలో పారిశుధ్య సౌకర్యాలకు 100% ప్రాముఖ్యతను అందించడం ద్వారా పట్టణ భారతదేశంలో పారిశుద్ధ్య ప్రదేశంలో మిషన్ విప్లవాత్మక మార్పులు చేసింది. ఎస్‌బిఎం- అర్బన్ కింద, 70 లక్షలకు పైగా గృహకమ్యూనిటీ మరియు పబ్లిక్ టాయిలెట్‌లు నిర్మించబడ్డాయి. తద్వారా అందరికీ సురక్షితమైన మరియు గౌరవప్రదమైన పారిశుధ్య పరిష్కారాలను అందిస్తుంది. మహిళలులింగమార్పిడి సమూహలు మరియు వికలాంగుల (దివ్యాంగులు) అవసరాలకు ఈ మిషన్ ప్రాధాన్యతనిచ్చింది.

 

·        3,300పైగా నగరాల్లో ఉన్న 65,000 పైగా పబ్లిక్ టాయిలెట్‌లు గూగుల్ మ్యాప్స్‌ లో రూట్‌ చేయబడ్డాయి. ఇటువంటి డిజిటల్ ఆవిష్కరణల ద్వారా పారిశుధ్య సౌకర్యాల యాక్సెస్ మరింత మెరుగుపరచబడింది.

·        అర్బన్ ఇండియా 2019 లో బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా ప్రకటించబడిందితరువాత మిషన్ పట్టణ భారతదేశాన్ని 3,300 నగరాలు మరియు 960 కి పైగా నగరాలు వరుసగా ఓడిఎఫ్ [1]+మరియు ఓడిఎఫ్‌++ [2] ధృవీకరించబడిన స్థిరమైన పరిశుభ్రత మార్గంలో నడిపించాయి.

 

·        వాటర్ + ప్రోటోకాల్ [3]  ధృవీకరణ వైపు నగరాలు పురోగమిస్తున్నాయి. ఇది మురుగునీటి శుద్ధి మరియు దాని వాంఛనీయ పునర్వినియోగంపై దృష్టి పెడుతుంది.

·        శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణలోభారతదేశంలో వ్యర్థాల ప్రాసెసింగ్ 2014 లో 18% నుండి నేడు 70% కి నాలుగు రెట్లు పెరిగింది.

·        97% వార్డులలో 100% ఇంటింటికీ చెత్త సేకరణ మరియు 85% వార్డులలో పౌరుల స్ఫూర్తితో ఆచరించే వ్యర్థాల మూల విభజన ద్వారా ఇది సహాయపడింది.

·        సామాజిక సంక్షేమ పథకాలతో ముడిపడి ఉన్న 5.5 లక్షల మంది పారిశుధ్య కార్మికులతో అనధికారిక వ్యర్థ కార్మికుల జీవితాలలో మిషన్ గణనీయమైన వ్యత్యాసాన్ని తీసుకురాగలిగింది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో పట్టణ భారతదేశ భద్రతకు భరోసా ఇవ్వడంలో ముందు వరుసలో పారిశుధ్య కార్మికుల నిరంతర సేవలు కీలక పాత్ర పోషించాయి.

·        కార్యక్రమంలో 20 కోట్ల మంది పౌరులు (భారతదేశ పట్టణ జనాభాలో 50% కంటే ఎక్కువ మంది) చురుకుగా పాల్గొనడం మిషన్‌ను విజయవంతంగా ప్రజా ఉద్యమంగా మార్చిందినిజమైన జన ఆందోళన కొనసాగిస్తూ  భారీ ఐఈసీ మరియు ప్రవర్తన మార్పు ప్రచారాలు దోహదం చేశాయి.

·        స్వచ్ఛత యాప్ వంటి డిజిటల్ ఎనేబుల్‌మెంట్‌లు, 2016 లో ఎంఓహెచ్‌యుఎ ప్రవేశపెట్టిన డిజిటల్ ఫిర్యాదుల పరిష్కార వేదికపౌరుల ఫిర్యాదుల పరిష్కారానికి నిర్వహించే విధానాన్ని తిరిగి ఆవిష్కరించింది. ఈ యాప్ పౌరుల నుండి చురుకుగా పాల్గొనడంతో ఇప్పటి వరకు 2 కోట్ల పౌరుల ఫిర్యాదులను పరిష్కరించింది. ఎంఓహెచ్‌యుఎ ఇటీవల స్వచ్ఛత యాప్ 2.0 యొక్క పునరుద్ధరించిన సంస్కరణను ప్రారంభించింది

·        స్వచ్ఛ్ సర్వేక్షన్ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణ పరిశుభ్రత సర్వే, 4,000 అర్బన్ లోకల్ బాడీస్ (యుఎల్‌బిలు) 2016 లో ఎస్‌బిఎం- అర్బన్ కింద ప్రారంభించబడింది. సర్వేక్షణ్ ఫ్రేమ్‌వర్క్ కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి చెందింది మరియు నేడు పరిశుభ్రత ఫలితాలను సాధించడానికి గ్రౌండ్ లెవల్ అమలును వేగవంతం చేసే ప్రత్యేక నిర్వహణ సాధనంగా మారింది . మహమ్మారి కారణంగా సవాళ్లు ఎదురైనప్పటికీ స్వచ్ఛ సర్వేక్షన్ 2021 రికార్డు సమయంలో నిర్వహించబడింది. ఈ సర్వే 7 కోట్లకు పైగా పౌరుల అభిప్రాయాలను సేకరించింది.

·        వివిధ మిషన్ భాగాలపై శిక్షణ పొందిన 10 లక్షల మంది మునిసిపల్ అధికారులు మరియు సిబ్బందితో రాష్ట్ర మరియు నగర స్థాయి అధికారుల నిరంతర సామర్థ్య నిర్మాణం కొనసాగుతోంది.

***********



(Release ID: 1764346) Visitor Counter : 212