బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విద్యుత్ ప్లాంట్ డిమాండ్లను తీర్చేలా బొగ్గు లభ్యత సరిపోతుందిః బొగ్గు మంత్రిత్వ శాఖ


- విద్యుత్ సరఫరాలో అంతరాయాలు క‌లుగొచ్చ‌న్న భయం నిరాధారమైనది

- బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ఈ సంవత్సరం 24 శాతం మేర‌ పెరిగింది

- భారీ వర్షాలు ఉన్నప్పటికీ విద్యుత్ రంగానికి 225 ఎంటీల‌ బొగ్గును సరఫరా చేసిన కోల్ ఇండియా లిమిటెడ్

Posted On: 10 OCT 2021 1:50PM by PIB Hyderabad

 

విద్యుత్ ప్లాంట్ల డిమాండ్‌ను తీర్చేలా దేశంలో పుష్కలంగా బొగ్గు అందుబాటులో ఉందని బొగ్గు మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు క‌లుగొచ్చ‌ని భయాలు పూర్తిగా నిరాధార‌మైంది అని ప్ర‌భుత్వం తెలిపింది. ప‌వ‌ర్ ప్లాంట్ల ద‌గ్గ‌ర దాదాపు 72 ల‌క్ష‌ల ట‌న్నుల బొగ్గు అందుబాటులో ఉంద‌ని  ఇది నాలుగు రోజుల అవ‌స‌రాల‌కు సరిపోతుంద‌ని తెలిపింది. కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్‌)  సంస్థ వ‌ద్ద  400 లక్షల టన్నుల కంటే ఎక్కువ,గా బొగ్గు నిల్వ‌ను క‌లిగి ఉంది. ఇది విద్యుత్ ప్లాంట్లకు త్వ‌ర‌లోనే సరఫరా చేయబడుతుంది. బొగ్గు కంపెనీల నుండి బలమైన సరఫరా ల‌భించ‌డంతో  ఈ సంవత్సరం (సెప్టెంబర్ 2021 వరకు) దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి దాదాపు 24 శాతం మేర‌ పెరిగింది. విద్యుత్ ప్లాంట్లలో రోజువారీ సగటు బొగ్గు అవసరం రోజుకు 18.5 లక్షల టన్నుల బొగ్గు కాగా,  రోజువారీ బొగ్గు సరఫరా రోజుకు 17.5 లక్షల టన్నులుగా ఉంది. వ‌ర్షాలుప‌డే కాలం పెర‌గ‌డంతో గ‌నుల నుంచి బొగ్గు స‌ర‌ఫ‌రా చాలా వ‌ర‌కు   ప‌రిమితం చేయ‌బ‌డ్డాయి.  పవర్ ప్లాంట్ల వద్ద లభ్యమయ్యే బొగ్గు రోలింగ్ స్టాక్ మేర‌కు .. ఇది రోజువారీ ప్రాతిప‌దిక‌న‌ బొగ్గు కంపెనీల నుండి సరఫరా చేయబడుతోంది. అందువల్ల, విద్యుత్‌ ప్లాంట్ల వ‌ద్ద‌ బొగ్గు నిల్వలు తగ్గిపోతాయనే భయం పూర్తిగా నిరాధార‌మైంది. వాస్తవానికి ఈ సంవత్సరం, దేశీయ బొగ్గు సరఫరా గణనీయమైన దిగుమతుల ద్వారా భర్తీ చేయ‌బ‌డింది.  బొగ్గు క్షేత్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ,. సీఐఎల్‌ ఈ సంవత్సరంలో విద్యుత్ రంగానికి 255 ఎంటీల‌ బొగ్గును సరఫరా చేసింది, ఇది సీఐఎల్‌ నుండి విద్యుత్ రంగానికి అందించిన అత్యధిక హెచ్‌-1 సరఫరా. అన్ని వనరుల నుండి వ‌స్తున్న మొత్తం బొగ్గు సరఫరాలో సీఐఎల్‌ నుండి విద్యుత్ రంగానికి ప్రస్తుతం ఉన్న బొగ్గు సరఫరా రోజుకు 14 లక్షల టన్నులకు పైగా ఉంది. తగ్గుతున్న వర్షాలతో సరఫరా ఇప్పటికే 15 లక్షల టన్నుల వ‌ర‌కు పెరిగింది. 16 ల‌క్ష‌ల ట‌న్నుల‌కు  పైగా పెంచడానికి సిద్ధంగా ఉంది. అక్టోబర్ 2021 చివరి నాటికి రోజుకు లక్ష టన్నుల‌కు చేరే అవ‌కాశం ఉంది.  ఎస్‌సీసీఎల్ మరియు క్యాప్టివ్ బొగ్గు బ్లాకుల నుండి సరఫరా ప్రతిరోజూ మరో 3 లక్షల ప్లస్ టన్నుల బొగ్గుకు దోహదం చేస్తుంది. అధిక వ‌ర్ష‌పాతం, తక్కువ బొగ్గు దిగుమతులు, ఆర్థిక రికవరీ కారణంగా విద్యుత్ డిమాండ్ బాగా పెరిగినప్పటికీ దేశీయ బొగ్గు సరఫరా దేశీయ విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన మార్గంగా మద్దతునిచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు సరఫరా రికార్డు స్థాయిలో ఉంటుందని అంచనా. బొగ్గు యొక్క అంతర్జాతీయ ధరల కారణంగా, దిగుమతి ఆధారిత విద్యుత్ ప్లాంట్ల ద్వారా పీపీఏల‌ కింద విద్యుత్ సరఫరా దాదాపు 30 శాతం మేర‌ తగ్గింది, ఈ ఏడాది హెచ్‌1 లో దేశీయ ఆధారిత విద్యుత్ సరఫరా దాదాపు 24 శాతం పెరిగింది. దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్ప‌త్తి ప్లాంట్లు 45.7 బీయు కార్యక్రమానికి.. వ్యతిరేకంగా 25.6 బీయుల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయి. అల్యూమినియం, సిమెంట్, స్టీల్ మొదలైన విద్యుత్ యేతర పరిశ్రమల డిమాండ్‌ను తీర్చడానికి సీఐఎల్‌ ప్రతిరోజూ 2.5 లక్షల టన్నులకు పైగా విద్యుత్ సరఫరా చేస్తున్నందున దేశంలోని థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాతో సౌకర్యవంతమైన  స్థానాన్ని ప్రతిబింబిస్తుంది.
                                                                                   

****


(Release ID: 1762788) Visitor Counter : 290