రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
వెహికల్ స్క్రాపింగ్ పాలసీ కింద రాయితీలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయబడింది
Posted On:
07 OCT 2021 10:32AM by PIB Hyderabad
అధిక నిర్వహణ మరియు ఇంధన వినియోగాన్ని కలిగి ఉన్న పాత మరియు కాలుష్యం కలిగించే వాహనాలను నిర్మూలించడానికి ఆ మేరకు వాహన యజమానులకు ప్రోత్సాహకాల వ్యవస్థను వెహికల్ స్క్రాపింగ్ పాలసీలో ప్రతిపాదించారు.
పైన పేర్కొన్న వాటికి అనుగుణంగా, రోడ్డు రవాణా &జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ 05.10.2021 తేదీన జీఎస్ఆర్ నోటిఫికేషన్ 720 (ఈ) ను భారత గెజిట్‌లో జారీ చేసింది. ఇది ఏప్రిల్ 1, 2022 తేదీ నుండి అమలులోకి వస్తుంది.
స్క్రాప్ చేయడానికి ప్రోత్సాహకంగా రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ ద్వారా జారీ చేయబడిన "డిపాజిట్ సర్టిఫికేట్" సమర్పణ ద్వారా నమోదు చేయబడిన వాహనం కోసం మోటార్ వాహన పన్నులో రాయితీ ఇవ్వబడుతుంది. ఈ రాయితీ క్రింది విధంగా ఉంది:
(i) రవాణా కాని (వ్యక్తిగత) వాహనాల విషయంలో ఇరవై ఐదు శాతం వరకు, మరియు
(ii) రవాణా (వాణిజ్య) వాహనాల విషయంలో పదిహేను శాతం వరకు:
రవాణా వాహనాల విషయంలో ఎనిమిది సంవత్సరాల వరకు, రవాణా కాని వాహనాల విషయంలో పదిహేను సంవత్సరాల వరకు ఈ రాయితీ అందుబాటులో ఉంటుంది.
***
(Release ID: 1761717)
Visitor Counter : 207