ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రపంచం లోఅతి పెద్ద ఖాదీ జాతీయ పతాకాన్ని రూపొందించిన కెవిఐసి ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
పండుగ ల కాలం లో ఖాదీఉత్పత్తుల ను, చేతి పని ఉత్పత్తుల ను తీసుకోవాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు
Posted On:
03 OCT 2021 5:24PM by PIB Hyderabad
ప్రపంచంలోకెల్లా అతి పెద్దది అయినటువంటి ఖాదీ జాతీయ పతాకాన్ని (225 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు కలిగినటువంటిది) మహాత్మ గాంధీ కి ఒక ప్రశంస గా లద్దాఖ్ లోని లేహ్ లో ప్రదర్శించిన ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిశన్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘ఇది మాన్య బాపు గారి కి ఒక అద్వితీయమైనటువంటి ప్రశంస గా ఉంది. ఖాదీ అంటే బాపు గారి కి ఎంతటి మక్కువో చాలా మందికి తెలిసిందే. ఖాదీ ఉత్పత్తుల ను మరియు చేతి పని తో తయారైన ఉత్పత్తుల ను ఈ పండుగ ల కాలం లో మీ జీవనం లో ఓ భాగం గా చేసుకోవడాన్ని గురించి ఆలోచించండి, అలాగే ఆత్మనిర్భర్ భారత్ ను నిర్మించాలన్న సంకల్పాన్ని బలపరచండి.’’ అని పేర్కొన్నారు.
DS
(Release ID: 1760773)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam