ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
87 కోట్ల డోసుల మైలురాయిని దాటిన భారతదేశ కొవిడ్-19 టీకా కార్యక్రమం
గత 24 గంటల్లో 1.02 కోట్లకుపైగా డోసులు నిర్వహణ
97.81 శాతానికి చేరిన రికవరీ రేటు; 2020 మార్చి తర్వాత గరిష్ట స్థాయి
గత 24 గంటల్లో 18,795 కొత్త కేసులు; 201 రోజుల తర్వాత 20,000 దిగువకు రోజువారీ కొత్త కేసులు
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు (2,92,206) 0.87 శాతం
వారపు పాజిటివిటీ రేటు (1.88 శాతం) గత 95 రోజులుగా 3 శాతం కంటే తక్కువ
Posted On:
28 SEP 2021 9:58AM by PIB Hyderabad
దేశంలో కొవిడ్-19 టీకా కార్యక్రమంలో, మారోమారు, ఒక్కరోజులోనే కోటికిపైగా డోసులను సుసాధ్యం చేశారు. దీంతో, నిన్నటితో 87 కోట్ల డోసుల మైలురాయిని దాటింది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 1,02,22,525 డోసులతో కలిపి, మొత్తంగా 87 కోట్ల డోసులను (87,07,08,636) టీకా కార్యక్రమం అధిగమించింది. 84,62,957 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.
ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోసు
|
1,03,72,006
|
రెండో డోసు
|
88,53,567
|
ఫ్రంట్లైన్ వర్కర్లు
|
మొదటి డోసు
|
1,83,50,151
|
రెండో డోసు
|
1,48,83,125
|
18-44 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
35,28,56,642
|
రెండో డోసు
|
7,71,77,130
|
45-59 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
15,76,57,008
|
రెండో డోసు
|
7,49,24,270
|
60 ఏళ్లు పైబడినవారు
|
మొదటి డోసు
|
10,03,78,855
|
రెండో డోసు
|
5,52,55,882
|
మొత్తం
|
87,07,08,636
|
గత 24 గంటల్లో 26,030 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,29,58,002 కు పెరిగింది.
దేశవ్యాప్త రికవరీ రేటు 97.81 శాతానికి చేరింది. 2020 మార్చి తర్వాత ఇది గరిష్ట స్థాయి.
కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 93వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.
201 రోజుల తర్వాత 20,000 దిగువకు రోజువారీ కేసులు దిగివచ్చాయి. గత 24 గంటల్లో 18,795 కొత్త కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 2,92,206. ఇది 192 రోజుల కనిష్ట స్థాయి. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.87 శాతం.
దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 13,21,780 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 56.57 కోట్లకుపైగా (56,57,30,031) పరీక్షలు నిర్వహించారు.
వారపు పాజిటివిటీ రేటు 1.88 శాతంగా ఉంది. గత 95 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.42 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 29 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా, 112 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది.
****
(Release ID: 1758903)
Visitor Counter : 139