సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

సమాచారం, ప్రజాస్వామ్యం అంశాలపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ శిఖరాగ్ర సమావేశంలో ప్రసగించారు.


ఇన్ఫోడెమిక్ సమస్యపై అత్యున్నతస్థాయిలో చర్చించడం ఎంతో ముఖ్యం: అనురాగ్ ఠాకూర్

తప్పుడు వార్తలు, కథనాలను బట్టబయలు చేయడంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చురుకుగా వ్యవహరించింది: అనురాగ్ ఠాకూర్

Posted On: 25 SEP 2021 11:08AM by PIB Hyderabad

న్యూయార్క్లో కాన్సులేట్ జనరల్ ఆఫ్ఫ్రాన్స్ శుక్రవారంనిర్వహించిన ఐక్యరాజ్యసమతి జనరల్ అసెంబ్లీ శిఖరాగ్ర సమావేశంలో భారత సమాచార ప్రసారశాఖ మంత్రి  అనురాగ్ ఠాకూర్ పాల్గొని.. సమాచారం, ప్రజాస్వామం అంశాలపై ప్రసంగించారు. లడక్లోని లేహ్ నుంచి నేరుగా న్యూయార్క్ చేరుకున్న మంత్రి ఈ రౌండ్ టేబుల్ చర్చలో పాల్గొన్నారు.

చర్చల ముగింపు సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... “కరోనా మహమ్మారి సమయంలో కోవిడ్ను ఎదుర్కోవడంతోపాటు ‘ఇన్ఫోడెమిక్’ను దెబ్బతీసేలా విసిరిన సవాళ్లను కూడా సభ్యదేశాలు సమానంగా ఎదుర్కొన్నాయి. ‘ఇన్ఫోడెమిక్’పై అత్యున్నతస్థాయిలో చర్చించాల్సిన అవసరం ఎంతో ఉంది. ‘ సమాచారం, ప్రజాస్వామ్యం కోసం అంతర్జాతీయ భాగస్వామ్యం’లో వ్యవస్థాపక సభ్యులు చేరి, సంతకం చేసినందుకు ఎంతో సంతోషిస్తున్నామ’ని మంత్రి అన్నారు.

 కోవిడ్ మహమ్మారి సమయంలో భారతదేశం ఎదుర్కొన్న తప్పుడు సమాచార దాడిపై మంత్రి సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘మహమ్మారి సమయంలో భారతదేశం దేశీయంగా ద్వంద్వ సమాచార సవాళ్లను ఎదుర్కొంది. ఓవైపు సోషల్ మీడియా, స్మార్ట్ఫోన్ అప్లికేషన్ల ద్వారా తప్పుడు సమాచారం, నకిలీ సమాచారాన్ని వేగంగా వ్యాప్తిచేస్తున్న సవాలును పట్టణ ప్రజలు ఎదుర్కొన్నారు. మరోవైపు ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మధ్య అనేక భాషలున్న దేశం కావడంతో గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలకు సమాచారాన్ని చేరవేసే సవాలును కూడా ఎదుర్కొన్నాము.

ఈ ఇన్ఫోడెమిక్ పట్ల భారతదేశం వేగవంతమైన ప్రతిస్పందన గురించి మంత్రి సమావేశంలో మాట్లాడుతూ... ‘భారత్ ప్రభుత్వం ఈ సవాళ్లపై వేగంగా ప్రతిస్పందించింది. శాస్త్రీయ వాస్తవాల  ఆధారంగా భారత ప్రభుత్వం ఈ సవాళ్లకు వేగంగా, స్పష్టమైన కమ్యూనికేషన్ ద్వారా ప్రతిస్పందించింది.  ప్రామాణికమైన సమాచారాన్ని ప్రజలకు అందేలా చేయడం కోసం తప్పుడు సమాచారం, నకిలీ వార్తలకు వ్యతిరేకంగా స్పందించడం భారతదేశ విధానాల్లో ముఖ్యమైనది. టీవీ న్యూస్, ప్రింట్, రేడియో మరియు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా వ్యాప్తి చెందే కోవిడ్ సమాచారంపై మేము ప్రతిరోజూ విలేకరుల సమావేశాలను నిర్వహించామ’న్నారు.

"భారతదేశ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తన వివిధ వేదికల ద్వారా నకిలీ కథనాలు మరియు వార్తలను బట్టబయలు చేయడంలో చురుకుగా పాలుపంచుకుందని మంత్రి పేర్కొన్నారు. వివిధ సమస్యలపై భారతీయ ప్రజలకు తెలియజేయడానికి మేము హాస్య శక్తిని కూడా ఉపయోగించామన్నారు.


 "పారదర్శకమైన, సకాలంలో మరియు విశ్వసనీయమైన సమాచార ప్రవాహం ప్రజాస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది. మరియు మన పౌరులు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. భారతదేశం దీనిని గట్టిగా నమ్ముతుంద’ని మంత్రి పేర్కొన్నారు.
 ‘‘విపరీతంగా వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారం, నకిలీ వార్తల సమస్యను పరిష్కరించడానికి అక్షరాస్యత నైపుణ్యాలను ప్రదర్శించడం ద్వారా మీడియా కీలక పాత్ర పోషించాలనే అభిప్రాయంతో జనరల్ అసెంబ్లీ ఈ సంవత్సరం అక్టోబర్ 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వారంరోజులను ‘గ్లోబల్ మీడియా అండ్ ఇన్ఫర్మేషన్ లిటరసీ వీక్’గా ప్రకటించింది.  ఈ తీర్మానాన్ని ఆమోదించిన దేశాల సమూహంలో భారతదేశం కూడా భాగస్వామిగా ఉందని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. యునెస్కో చేసిన ఇదే తరహా తీర్మానాల్లో కూడా మేము కోస్పాన్సర్స్గా ఉన్నామ’ని మంత్రి పేర్కొన్నారు.

కోవిడ్ -19 సందర్భంలో "ఇన్ఫోడెమిక్" పై మొట్టమొదటి క్రాస్- రీజనల్ స్టేట్‌మెంట్ యొక్క సహ రచయితలలో భారతదేశం కూడా ఉంది. ఐక్యారాజ్యసమితి డిపార్ట్మెంట్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్ యొక్క "వెరిఫైడ్" మరియు "ప్లెడ్జ్ టూ పాజ్" కార్యక్రమాలకు కూడా మేము పూర్తిగా మద్దతు ఇచ్చాము.

 ఇన్ఫోడెమిక్ సమయంలో తప్పుడు సమాచారాన్ని పరిష్కరించడానికి మరియు పరస్పరం నేర్చుకోవడం ద్వారా సభ్య దేశాలతో కలిసి సమస్యలను అర్థం చేసుకోవడానికి మరియు సవాళ్లను పరిష్కరించడానికి తగిన పరిష్కారాలను కనుగొనడం కోసం సుదూర ప్రయాణాన్ని కొనసాగిస్తాం.

నేపథ్యం..
సమాచారం మరియు ప్రజాస్వామ్యం కోసం ప్రపంచ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో  2019, సెప్టెంబర్ 26వ తేదీన అలయెన్స్ ఫర్ మల్టీలాటరిజం ఫ్రేమ్వర్క్ ప్రారంభించబడింది.
వ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రోత్సహించడం, బహుముఖ, విశ్వసనీయ సమాచారాన్ని పొందడాన్ని 43 రాష్ట్రాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

భాగస్వామ్య సూత్రాలను అమలు చేయడానికి నవంబర్10,  2019 న రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ మరియు 10 స్వతంత్ర పౌర సమాజ సంస్థలు ఫోరమ్ ఇన్ఫర్మేషన్ అండ్ డెమోక్రసీని రూపొందించాయి. 2020, నవంబర్ 12న  ఇన్ఫోడెమిక్స్‌పై  పోరాటంపై ఫోరమ్ తన మొదటి నివేదికను ప్రచురించింది. ఆ తర్వాత 2021, జూన్ 16న  జర్నలిజం యొక్క ఆర్థిక స్థిరత్వంపై ‘ఎ న్యూ డీల్ ఆఫ్ జర్నలిజం’ పేరుతో  రెండవ నివేదికను ప్రచురించింది.

 

లక్ష్యాలు
ఈ క్రింద ప్రాధాన్యతలపై శిఖరాగ్ర సమావేశం దృష్టి సారించే అవకాశం ఉంది.
1. వ్యక్తీకరణ స్వేచ్ఛను పరిరక్షించడం, ప్రోత్సహించడం కోసం ఉచిత, బహుముఖ, విశ్వసనీయ సమాచారాన్ని పొందడం అత్యంత అవసరమైన అంశం.

2. ఫోరమ్ సిఫార్సులను చర్చించడం, వాటి అమలును ప్రోత్సహించడం మరియు చేపట్టబోయే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం.

3. ప్రపంచ సమాచార పోకడలను విశ్లేషించడానికి మరియు భాగస్వామ్య సంతకం చేసిన రాష్ట్రాలు మరియు పౌర సమాజం కోసం ఒక సాధారణ నివేదికను ప్రచురించడానికి బాధ్యత వహించే సమాచారం మరియు ప్రజాస్వామ్యంపై అంతర్జాతీయ అబ్జర్వేటరీ ఏర్పాటు చేయడాన్ని పరిగణనలోకి తీసుకోవడం;

4. కనీసం 50 స్వచ్ఛంద సంస్థలతో  కలిసి ఓ సివిల్ సొసైటీని ప్రారంభించడం, దానిని ఫోరమ్తో అనుసంధానించడం.. తద్వారా రాష్ట్రాలు, ప్రజల్లోకి భాగస్వామ్య సూత్రాలను తీసుకెళ్లడం, అవగాహన కల్పించడం.

5. సమాచారం మరియు ప్రజాస్వామ్యం కోసం అంతర్జాతీయ భాగస్వామ్యం మధ్య సంబంధాలను పెంపొందించడం.

***



(Release ID: 1758351) Visitor Counter : 160