ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యుఎస్ఎ ఉపాధ్య‌క్షురాలు శ్రేష్ఠురాలు క‌మ‌లా హారిస్ గారి తో తన సమావేశం లో ప్రధాన మంత్రి ప్రారంభిక వ్యాఖ్యలు

Posted On: 24 SEP 2021 9:14AM by PIB Hyderabad

ఎక్స్ లన్సి,

అన్నింటికంటే ముందు, నాకు మరియు నా ప్రతినిధి వర్గాని కి ఆత్మీయ స్వాగతం పలికినందుకు నేను మీకు హృద‌య‌పూర్వక కృతజ్ఞత ను వ్యక్తం చేయదలచాను. కొన్ని నెలల క్రితం మీ తో టెలిఫోన్ ద్వారా విపులమైన, చాలా ఆత్మీయత నిండిన, ఎంతో స్వాభావికమైన పద్ధతి లో మీతో చర్చ ను జరిపేందుకు నాకు అవకాశం దొరికింది. మరి ఆ ఘటన నాకు ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోతుంది. దీనికి గాను మీకు చాలా ధన్యవాదాలు. అది, ఎక్స్ లన్సి, మీకు గుర్తు ఉండే ఉంటుంది.. అప్పట్లో ఎంతో క్లిష్టమైన కాలం. భారతదేశం కోవిడ్-19 మహమ్మారి తాలూకు సెకండ్ వేవ్ తో బాగా బాధ కు గురైంది. అది పెద్ద సంకటం గా ఉండింది. కానీ ఆ సమయం లో ఏ విధమైన ఆత్మీయత తో మీరు భారతదేశం గురించి ఆలోచించారో, ఎలాంటి మాటల ను వ్యక్తం చేశారో, మరి ఏ తీరు న సాయం చేయడానికి చేతి ని చాచారో..దానికి గాను నేను మళ్లీ ఒక సారి హృదయ పూర్వకం గా మీకు కృత‌జ్ఞ‌త‌లు వ్యక్తం చేస్తున్నాను. మీరు ఒక సిసలైన నేస్తం లాగా ఎంతో సానుభూతిపూర్ణమైన సహకార సందేశాన్ని అందించారు. ఆ కాలం లో యుఎస్ ప్రభుత్వం, యుఎస్ కార్పొరేట్ సెక్టర్, ప్రవాసీ భారతీయులు.. అందరు కలసి.. భారతదేశాని కి సాయపడేందుకు ఒక్కటై ముందంజ వేశారు.


ఎక్స్ లన్సి,

అధ్యక్షుడు శ్రీ బైడెన్ తో కలసి మీరు అత్యంత సవాళ్ళ తో కూడుకొన్నటువంటి వాతావరణం లో యునైటెడ్ స్టేట్స్ నాయకత్వాన్ని సంబాళించారు. చాలా తక్కువ సమయం లోనే అనేక కార్య సిద్ధుల ను చేజిక్కించుకొన్నారు. కోవిడ్ కావచ్చు, క్లైమేట్ కావచ్చు, లేదా క్వాడ్.. అన్నింటి లో యునైటెడ్ స్టేట్స్ చాలా ముఖ్యమైన కార్యక్రమాల ను చేపట్టింది.

 

ఎక్స్ లన్సి,

ప్రపంచం లో అన్నింటి కంటే పెద్ద, అన్నింటి కంటే పాత ప్రజాస్వామ్యాలైన భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ స్వాభావిక భాగస్తులు గా ఉన్నాయి. మన విలువల లో సమానత ఉంది, మన భౌగోళిక, రాజకీయ ప్రయోజనాల లో సమానత ఉంది. మన మధ్య సహకారం, సమన్వయం కూడా నిరంతరం గా పెరుగుతూ పోతున్నాయి. సప్లయ్ చైన్ ను పటిష్ట పరచడం, కొత్త కొత్త సాంకేతికత లు, అంతరిక్షం వంటి రంగాల లోనూ మీ దేశం మాదిరి గానే మా దేశాని కి కూడా ప్రత్యేకమైన ఆసక్తి, ప్రత్యేకమైన ప్రాథమ్యాలు ఉన్నాయి. ఈ రంగాల లో మన మధ్య సహకారం చాలా ముఖ్యమైనటువంటిది.

ఎక్స్ లన్సి,

భారతదేశాని కి, అమెరికా కు మధ్య ప్రజల పరంగా ఉన్న బలమైనటువంటి, చైతన్యశీలమైనటువంటి సంబంధాలు నెలకొన్నాయన్న విషయం మీకు తెలిసిందే. 4 మిలియన్ కు పైగా భారతీయ ప్రవాసులు మన దేశాల మధ్య ఒక స్నేహ సేతువు గా ఉన్నారు. అమెరికా, భారత దేశం ల ఆర్థిక వ్యవస్థ ల కు, మన రెండు దేశాల సమాజాల కు వారు అందిస్తున్న తోడ్పాటు చాలా ప్రశంసనీయం.

ఎక్స్ లన్సి,

మీరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉపాధ్యక్ష పదవి కి ఎన్నిక కావడం దానంతట అదే ఒక చాలా మహత్వపూర్ణమైనటువంటి, చారిత్రిక ఘట్టం. మీరు ప్రపంచవ్యాప్తం గా ఎంతో మంది ప్రజల కు ప్రేరణ ను ఇస్తున్నారు. అధ్యక్షుడు శ్రీ బైడెన్ నాయకత్వం లో, అలాగే మీ నేతృత్వం లో మన రెండు దేశాల సంబంధాలు కొత్త శిఖరాల కు చేరుకొంటాయని నాకు పూర్తి నమ్మకం ఉంది.


ఎక్స్ లన్సి,

మీ ఈ విజయ ప్రస్థానం చారిత్రికం. మీరు భారతదేశం లో కూడా మీరు ఈ చారిత్రిక విజయ యాత్ర ను కొనసాగిస్తారని భారతీయులు కూడా కోరుకొంటున్నారు. ఈ కారణం గా వారు మీకు స్వాగతం పలకాలని వేచి ఉన్నారు. అందువల్ల మీరు భారతదేశానికి రండి అంటూ మిమ్మల్ని నేను ప్రత్యేకం గా ఆహ్వానిస్తున్నాను. మరో సారి, ఈ ఆప్యాయ భరితమైనటువంటి స్వాగతానికి గాను నేను గుండె నిండు గా చాలా చాలా కృతజ్ఞత ను వ్యక్తం చేస్తున్నాను.

అస్వీకరణ: ప్రధాన మంత్రి ప్ర‌సంగానికి ఇది దాదాపు గా చేసిన అనువాదం. అసలు ప్రసంగం హిందీ భాష‌ లో సాగింది.

 

***


(Release ID: 1757702) Visitor Counter : 219