ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో భేటీ అయిన కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా విదేశీవ్యవహారాల శాఖ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ హర్హాన్ అల్ సౌద్
Posted On:
20 SEP 2021 9:59PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ హర్హాన్ అల్ సౌద్ ఈ రోజు న సమావేశమయ్యారు.
ఉభయ దేశాల మధ్య ఏర్పాటైన వ్యూహాత్మక భాగస్వామ్య మండలి (ఎస్ పిసి) ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు సహా ప్రస్తుతం అమలవుతున్న వివిధ ద్వైపాక్షిక కార్యక్రమాల పురోగతి ని వీరి సమావేశం సమీక్షించింది. శక్తి, ఐటి, రక్షణ సంబంధి తయారీ వంటి కీలక రంగాలతో పాటు మరిన్ని రంగాల లో సౌదీ అరేబియా నుంచి ఇతోధిక పెట్టుబడి ని అందుకోవాలని భారతదేశం ఆసక్తి తో ఉందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
అఫ్ గానిస్తాన్ లో స్థితి సహా ప్రాంతీయ పరిణామాల విషయం లో పరస్పర దృష్టికోణాల ను కూడా ఈ సమావేశం లో వెల్లడి చేసుకోవడం జరిగింది.
కోవిడ్-19 మహమ్మారి కాలం లో భారతీయ ప్రవాసి కుటుంబాల సంక్షేమాన్ని పట్టించుకొన్నందుకు గాను కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ను ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, తన ప్రత్యేక ధన్యవాదాలను వ్యక్తం చేశారు.
సౌదీ అరేబియా రాజు కు, సౌదీ అరేబియా యువరాజు కు ప్రధాన మంత్రి తన నమస్కారాలందజేస్తూ, ఆత్మీయ అభినందనల ను కూడా వ్యక్తం చేశారు.
***
(Release ID: 1756672)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam