యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో క్రీడల అభివృద్ధికి అమలు చేయాల్సిన కార్యచరణపై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల క్రీడల మంత్రులతో చర్చించనున్న కేంద్ర క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్

Posted On: 19 SEP 2021 4:51PM by PIB Hyderabad

ముఖ్య అంశాలు:

చర్చకు రానున్న కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తూ అమలు చేస్తున్న ఖేలో ఇండియాఫిట్ ఇండియా కార్యక్రమాలు 

సమావేశంలో పాల్గొనున్న క్రీడలుయువజన సర్వీసుల శాఖ సహాయ మంత్రి శ్రీ  నిషిత్ ప్రమాణిక్ 

దేశంలో క్రీడలను మరింతగా ప్రోత్సహించడానికి అమలు చేయవలసి ఉన్న కార్యాచరణ కార్యక్రమంపై  రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల క్రీడల శాఖల మంత్రులతో కేంద్ర క్రీడలుయువజన సర్వీసుల  మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ సోమవారం చర్చించనున్నారు. వర్చువల్ విధానంలో ఈ సమావేశం జరుగుతుంది. ఇటీవల   టోక్యోలో జరిగిన  ఒలింపిక్స్ మరియు పారాలింపిక్స్ క్రీడల్లో దేశం ఘన విజయాలను సాధించిన నేపథ్యంలో ఈ సమావేశం జరగనున్నది. దేశాన్ని అత్యున్నత క్రీడా దేశంగా అభివృద్ధి చేయడానికి, క్రీడలను మరింతగా ప్రోత్సహించడానికి  జరుగుతున్న ప్రయత్నాలకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఈ విధంగా సహకరించాలన్న అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. సమావేశంలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీ నిషిత్ ప్రామాణిక్ కూడా పాల్గొంటారు. 

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అమలు చేస్తున్న ఖేలో ఇండియాఫిట్ ఇండియా కార్యక్రమాలు కూడా చర్చకు రానున్నాయి. 

దేశంలో క్రీడలు రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని క్రీడలను ప్రోత్సహించిఅభివృద్ధి చేయడానికి పట్టణ,గ్రామీణ ప్రాంతాలలో క్రీడల పోటీలను ఎక్కువగా నిర్వహించి ప్రతిభ కలిగిన క్రీడాకారులు మరియు పారా అథ్లెట్లను గుర్తించడానికి చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం తరఫున శ్రీ ఠాగూర్ కోరనున్నారు. దీనివల్ల క్షేత్ర స్థాయిలో క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించడానికి అవకాశం కలుగుతుంది. పాఠశాల స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడం,  స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సహకారం అందించే అంశాలు కూడా సమేవేశంలో చర్చకు వస్తాయి. నిధుల సమీకరణ అంశాన్ని కూడా సమావేశంలో చర్చిస్తారు. క్రీడాకారులకు నగదు పురస్కారాలను అందించడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు నిధులను సమకూర్చాలని, వీటిని కేంద్రం అందిస్తున్న నిధులతో కలిపి అందించాలన్న ప్రతిపాదనపై కేంద్ర మంత్రి చర్చిస్తారు. 

తొలిసారిగా 2018లో నిర్వహించిన ఖేలో ఇండియా క్రీడల పోటీలతో క్షేత్ర స్థాయిలో క్రీడల పోటీలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా యువతవిశ్వవిద్యాలయవింటర్ పోటీలను నిర్వహించడం జరిగింది. ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో  క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరచి  ఖేలో ఇండియా రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ,  ఖేలో ఇండియా కేంద్రాలను నెలకొల్పడం జరిగింది. ప్రస్తుతం దేశంలో 23 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 24 ఖేలో ఇండియా రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు పనిచేస్తున్నాయి. క్రీడల అభివృద్ధికి కేంద్రం అమలు చేస్తున్న కార్యక్రమాలను శ్రీ ఠాకూర్ వివరించి వీటికి పూర్తి సహాయ సహకారాలను అందించాలని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలను కోరనున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించి, అత్యుత్తమ శిక్షణా కార్యక్రమాలువైద్య సౌకర్యాలతో భావి ఛాంపియన్‌లను తీర్చి దిద్దడానికి సహకరించాలని ఆయన కోరనున్నారు. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లా బ్లాకు స్థాయిలో విద్యా సంస్థల్లో క్రీడల పోటీలను నిర్వహించి ప్రతిభ కనబరిచే క్రీడాకారులను గుర్తించే కార్యక్రమం అమలు చేసే అంశం సమావేశంలో ప్రధాన అంశంగా చర్చకు రానున్నది. 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019 లో ప్రారంభించిన ఫిట్ ఇండియా కార్యక్రమం దేశంలో ఫిట్నెస్ పై ప్రజల ఆలోచనా దృక్పథంలో మార్పు తీసుకుని వచ్చింది. ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ఫిట్ ఇండియా మొబైల్ యాప్ఫిట్ వంటి వివిధ కార్యక్రమాల  ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో మరింత ఎక్కువగా పాల్గోవాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు శ్రీ ఠాకూర్ సోమవారం జరిగే సమావేశంలో కోరనున్నారు. 

దేశంలో క్రీడల రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ,  ఖేలో ఇండియా కేంద్రాలను నెలకొల్పడానికి ప్రతిపాదనలు పంపాలని  రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను శ్రీ ఠాగూర్ కోరుతారు.   

 

 ***


(Release ID: 1756304) Visitor Counter : 168