కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

ప్రారంభించినప్పటి నుంచి ఇ–శ్రమ్ పోర్టల్లో 27 లక్షల మంది అసంఘటిత కార్మికులు నమోదు చేసుకున్నారు


అసంఘటిత కార్మికులు తమ వివరాలను పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి రాష్ట్రప్రభుత్వాలకు, ఇతర స్టేక్హోల్డర్లకు భారత ప్రభుత్వం అన్నిరకాలుగా సహకరిస్తుంది. అవసరమైన సహాయం చేస్తుంది: రామేశ్వర్ తెలి

Posted On: 09 SEP 2021 2:05PM by PIB Hyderabad

కార్మిక సంక్షేమం మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఇశ్రమ్ పోర్టల్‌లో అసంఘటిత కార్మికుల నమోదు కోసం వివిధ శిబిరాలు నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా న్యూఢిల్లీలోని శ్రమ శక్తి భవన్లో గురువారం ఓ  శిబిరం ఏర్పాటు చేయబడింది. శ్రమ శక్తి భవన్లో విధులు నిర్వర్తిస్తున్న వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన 80 మందికిపైగా అసంఘటిత కార్మికులు ఈ క్యాంపులో తమ పేర్లను పోర్టల్లో నమోదు చేసుకుంటారు.

NKP_0187.JPG

ఈ శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా కేంద్ర కార్మిక మరియు ఉపాధి, పెట్రోలియం, సహజవాయువుల శాఖల సహాయ మంత్రి రామేశ్వర్ తెలి మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ఈ పోర్టల్గురించి ప్రచారం చేయాలని, పోర్టల్లో పేరు నమోదు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని కోరారు.

NKP_0144.JPG

అసంఘటిత కార్మికులందరికీ సంబంధించిన ఈ డేటా బేస్ తయారుచేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అసంఘటిత రంగంలోని చివరి కార్మికుడి వరకు అందుతాయన్నారు.

NKP_0162.JPG

గత నెలలో ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ  ఆదేశాల మేరకు ఇశ్రమ్ గేమ్ ఛేంజర్ పోర్టల్‌గా ప్రారంభించారు. ఇప్పటివరకు 27 లక్షల మంది అసంఘటిత కార్మికులుపేర్లు నమోదు చేసుకున్నారని మరియు భారత ప్రభుత్వం పోర్టల్‌లో కార్మికులను నమోదు చేయడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఇతర వాటాదారులకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తోందన్నారు.

శ్రమ్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవడం వల్ల రూ.2 లక్షల ప్రమాద బీమా సదుపాయం లభిస్తుందని కేంద్ర కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖ మంత్రి తెలిపారు.  ఇశ్రమ్ పోర్టల్లో పేరు నమోదు చేయబడిన కార్మికుడు ప్రమాదానికి గురైనా, శాశ్వత వైకల్యానికి గురైనా రూ.2 లక్షల ప్రమాద బీమా పరిహారం లభిస్తుందన్నారు. పాక్షిక వైకల్యానికి గురైతే లక్ష రూపాయల పరిహారం అందుతుందన్నారు. పోర్టల్లో పేరు నమోదు చేసుకున్న కార్మికులకు ఓ యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఇస్తారనిదీనివల్ల వలస కార్మికుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక భద్రతా పథకాలు, రేషన్ కార్డులు మొదలైనవాటి పోర్టబిలిటీ సులభమవుతుందని మంత్రి పేర్కొన్నారు.

*****



(Release ID: 1753977) Visitor Counter : 181