మంత్రిమండలి

ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్ట‌ర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) కి, చాంబర్ ఆఫ్ ఆడిటర్స్ ఆఫ్ ది రిపబ్లిక్ అజర్ బైజాన్ (సిఎఎఆర్) కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రాని కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి  

Posted On: 08 SEP 2021 2:41PM by PIB Hyderabad

ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్ట‌ర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) కి, చాంబర్ ఆఫ్ ఆడిటర్స్ ఆఫ్ ది రిపబ్లిక్ అజర్ బైజాన్ (సిఎఎఆర్) కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎంఒయు)పై సంతకాల కు ప్రధాన మంత్రి  శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

వివరాలు:

ఈ ఎంఒయు పై సంతకాలు జరగడం వల్ల సభ్యుల నిర్వహణ, ప్రొఫెశనల్ ఎథిక్స్, సాంకేతిక పరిశోధన, సిపిడి, ప్రొఫెశనల్ అకౌంటెన్సీ ట్రైనింగ్, ఆడిట్ క్వాలిటీ మానిటరింగ్, అడ్వాన్స్ మెంట్ ఆఫ్ అకౌంటింగ్ నాలెడ్జ్, ప్రొఫెశనల్ ఎండ్ ఇంటెలెక్చువల్ డెవలప్ మెంట్ రంగాల లో పరస్పర సహకారాన్ని ఏర్పరచుకోవడానికి తోడ్పాటు లభిస్తుంది.

అమలు వ్యూహం మరియు లక్ష్యాలు:

ఐసిఎఐ తో పాటు సిఎఎఆర్.. ఈ రెండు సంస్థలు లెక్కల తనిఖీ, ఫైనాన్స్ మరియు అకౌంటింగ్ వృత్తి నిపుణుల శిక్షణ రంగం లో సహకారాన్ని పటిష్ట పరచుకోవాలని కోరుకొంటున్నాయి.  అలాగే, వృత్తి నైపుణ్యం కలిగిన సంస్థలు ప్రచురించే పుస్తకాలు, పత్రికలు, ఇతర ప్రచురణల ను ఒక పక్షానికి మరొక పక్షం అందజేసుకోవడం, ఆడిట్ కు, అకౌంటింగ్ కు సంబంధించిన వ్యాసాల ను ఇరు పక్షాలకు చెందిన ప్రచురణల లో అచ్చు వేయడం, వెబ్ సైట్ లలో పొందుపరచడం, సంయుక్తం గా సమావేశాల ను, చర్చా గోష్టులను, రౌండ్ టేబుల్ సమావేశాల ను నిర్వహించడం, అలాగే ఆడిట్, ఫైనాన్స్, ఇంకా అకౌంటింగ్ ల అభివృద్ధి అనే అంశం పై శిక్షణ కార్యక్రమాల ను నిర్వహించడం చేయాలని ఐసిఎఐ,  సిఎఎఆర్  లు అభిలషిస్తున్నాయి.  అంతేకాకుండా, ఆడిట్, అకౌంటింగ్ రంగం లో కొత్త ఆవిష్కరణ పద్ధతుల వినియోగం పై అధ్యయనం చేపట్టాలి అనేది కూడా ఈ సంస్థల ఉద్దేశ్యం గా ఉంది.  బ్లాక్ చైన్, స్మార్ట్ కాంట్రాక్ట్ సిస్టమ్, సాంప్రదాయక ఖాతాల నిర్వహణ నుంచి క్లౌడ్ అకౌంటింగ్ కు మళ్ళడం, అవినీతికి, మనీలాండరింగ్ కు వ్యతిరేకం గా పోరాటం జరపడం లో సంయుక్త సహకారం కూడా ఈ రెండు పక్షాల ఉద్దేశ్యం గా ఉంది.

ప్రభావం:

ఐసిఎఐ సభ్యులు అనేక దేశాల లో వేరు వేరు సంస్థల లో మధ్య స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు గల పదవుల ను నిర్వహిస్తున్నారు.  వారు ఒక దేశం లో సంబంధిత సంస్థల విధానాల రూపకల్పన వ్యూహాల ను/నిర్ణయాల ను ప్రభావితం చేయగలుగుతారు.  ఈ ఎంఒయు జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, ఉభయ న్యాయాధికార పరిధిల లో ఉత్తమ అభ్యాసాల ను బలోపేతం చేయడం, అలాగే అకౌంటెన్సీ రంగం లో సరికొత్త పద్ధతుల ను, సాంకేతికతల ను వినియోగించడం అనే అంశాల పై దృష్టి ని సారించడానికి తోడ్పడనుంది.

ప్రపంచం లో 45 దేశాల లో 69 నగరాల  లో ఐసిఎఐ కి విశాలమైన నెట్ వర్క్ ఉంది.  ఐసిఎఐ ఆయా దేశాల లో ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న అభ్యాసాల ను పంచుకోవడం లో ఒక ముఖ్యమైన పాత్ర ను పోషించాల ని కంకణం కట్టుకొంది.  తత్ఫలితం గా భారత ప్రభుత్వం ఆయా దేశాల లో అమలవుతున్న ఉత్తమ అభ్యాసాల ను తాను స్వీకరించగలుగుతుంది.  విదేశీ పెట్టుబడిని ఆకర్షించడానికి అక్కడి సంస్థలు భారతదేశం లో వాటి కార్యకలాపాల ను కొనసాగించేలా ప్రోత్సహించడానికి ఇది ఎంతైనా దోహదపడుతుంది.  ఈ ఎంఒయు ద్వారా అకౌంటెన్సీ వృత్తి లో సేవల ఎగుమతి కి రంగాన్ని సిద్ధం చేస్తూ అజర్ బైజాన్ తో భాగస్వామ్యాన్ని ఐసిఎఐ పటిష్ట పరచగలుగుతుంది.

పూర్వరంగం:

ఐసిఎఐ అనేది చార్టర్డ్ అకౌంటెన్స్ యాక్ట్, 1949 పరిధి లో ఏర్పాటు చేసిన ఒక చట్టబద్ధ సంస్థ.  భారతదేశం లో చార్టర్డ్ అకౌంటెంట్ ల వృత్తి ని క్రమబద్దీకరించేందుకు ఐసిఎఐ ని స్థాపించడమైంది.  విద్య, వృత్తి పరమైన అభివృద్ధి, ఉన్నత స్థాయి అకౌంటింగ్, ఆడిటింగ్, ప్రమాణాల ను పరిరక్షించడం, చార్టర్డ్ అకౌంటెన్స్ వృత్తి లో నైతిక ప్రమాణాల ను పెంచడం, వాటికి ప్రపంచవ్యాప్తం గా గుర్తింపు లభించేటట్లు చూడటం కోసం ఐసిఎఐ ఎంతగానో కృషి చేసింది.   సిఎఎఆర్ ను  అజర్ బైజాన్ గణతంత్రం లో లా ఆన్  ఆడిట్ ఆఫ్ 1994 కు అనుగుణం గా స్థాపించడం జరిగింది.  



 

**** 



(Release ID: 1753208) Visitor Counter : 132