జల శక్తి మంత్రిత్వ శాఖ

2021 సెప్టెంబర్ 9 న ప్రారంభం కానున్న స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2021


దేశవ్యాప్తంగా ఓడీఎఫ్ ప్లస్ యూ ని వేగవంతం చేయడానికి సహకరించనున్న స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2021 పరిధిలోకి 698 జిల్లాల్లోని 17,475 గ్రామాలు

Posted On: 08 SEP 2021 1:19PM by PIB Hyderabad

స్వచ్ఛ భారత్ మిషన్ ఫేజ్ -కింద రేపు అంటే సెప్టెంబర్, 2021 న స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్, 2021ప్రారంభం కానున్నది.   'ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా ఓడీఎఫ్  ప్లస్ యూ ని వేగంగా అమలు చేసి లక్ష్యాలను సాధించాలన్న ఉద్దేశంతో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్  2021 ను అమలు చేయనున్నారు. సర్వేక్షన్ 2021 నిర్వహించే బాధ్యతను  నిపుణులతో కూడిన కమిటీకి అప్పగించడం జరిగింది. ప్రామాణికాలను ఆధారంగా చేసుకుని దేశంలో గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇస్తారు. 

స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్  2021 కార్యక్రమాన్ని దేశం వివిధ ప్రాంతాలకు చెందిన 698 జిల్లాలలోని  17,475 గ్రామాల్లో నిర్వహిస్తారు. సర్వేను  పాఠశాలలుఅంగన్‌వాడీలుపబ్లిక్ హెల్త్ సెంటర్లుహాట్/బజార్లు/మత ప్రదేశాలు లాంటి 87,250 ప్రభుత్వ స్థలలలో నిర్వహిస్తారు. 1,74,750 గృహాల నుంచి స్వచ్ఛ భారత్ మిషన్   సంబంధిత అంశాలపై అభిప్రాయాలను సేకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా పారిశుధ్య సంబంధిత అంశాలపై అభిప్రాయాలను తెలియజేయడానికి ప్రజలను చైతన్యవంతులను చేయడం జరుగుతుంది. 

స్వచ్ఛ సర్వేక్షణ్  గ్రామీణ్ ను  2018, 2019 లో తాగునీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ నిర్వహించింది. ర్యాంకింగ్ ఇవ్వడానికి కాకుండా ప్రజా ఉద్యమాన్ని రూపొందించాలన్న ఉద్దేశ్యంతో స్వచ్ఛ సర్వేక్షణ్  గ్రామీణ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. 

కీలక నాణ్యత మరియు పరిమాణాత్మక పారామితులపై వారి పనితీరు ఆధారంగా జిల్లాల ర్యాంకింగ్‌కు మార్గనిర్దేశం చేయడానికి వివరణాత్మక ప్రోటోకాల్ అభివృద్ధి చేయబడింది. కీలక నాణ్యత మరియు పరిమాణాత్మక  ప్రామాణికాలను  ఆధారంగా చేసుకుని జిల్లాలకు ర్యాంకింగ్‌ఇవ్వడానికి  వివరణాత్మక మార్గదర్శకాలను సిద్ధం చేశారు. 

స్వచ్ఛ సర్వేక్షణ్  గ్రామీణ్  2021లో వివిధ  అంశాలకు ఇచ్చే ప్రాధాన్యత 

·         బహిరంగ ప్రదేశాల్లో పారిశుధ్యం  ప్రత్యక్ష పరిశీలన -30%

·         ప్రజల అభిప్రాయంసాధారణ పౌరులుగ్రామ స్థాయిలో కీలక ప్రభావం చూపే వారు మరియు మొబైల్ యాప్ ఉపయోగించి ప్రజల నుంచి   అభిప్రాయ సేకరణ   -35%

·         పారిశుధ్య సంబంధిత అంశాలలో సాధించిన  సేవా స్థాయి పురోగతి -35%

 

****



(Release ID: 1753167) Visitor Counter : 424