గనుల మంత్రిత్వ శాఖ
అందుబాటులోకి 'నాల్కో నమస్యా' మొబైల్ యాప్
- ఎంఎస్ఈలకు మద్దతు ఇవ్వడానికి వినూత్న వేదిక అందుబాటులోకి
Posted On:
06 SEP 2021 4:40PM by PIB Hyderabad
కేంద్ర గనుల మంత్రిత్వ శాఖకు చెందిన మినీరత్న అయిన ప్రభుత్వ రంగం సంస్థ 'నేషనల్ అల్యూమినియం కంపెనీ' (నాల్కో) లిమిటెడ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్ఈలను) శక్తిమంతం చేయడంలో కీలక పాత్రను పోషిస్తోంది. సంస్థ ఈ చోరవనలో భాగంగా వినూత్నమైన 'నాల్కో మైక్రో మరియు స్మాల్ ఎంటర్‌ప్రైజ్ యోగయోగ్ అప్లికేషన్' (నమస్యా) మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కంపెనీకి చెందిన ఎంఎస్ఈ వెండార్ల ప్రయోజనార్థం ఈ యాప్‌ను సంస్థ రెండు భాషల్లో
అందుబాటులోకి తెచ్చింది. దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వారికి, దేశంలోని మైనింగ్ ఖనిజ రంగంలో తగిన అనుకూల పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి గాను నాల్కో సంస్థ చేసిన కృషిని కేంద్ర బొగ్గు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి, అభినందించారు. ఎంఎస్ఈల అభివృద్ధికి కంపెనీ ప్రయత్నాల్ని ప్రధానంగా వెలుగులోకి తేచ్చేందుకు 'నమస్యా' యాప్ ఒక వేదికను అందిస్తుంది. ఈ యాప్ ద్వారా నాల్కో విక్రేత నమోదు ప్రక్రియ, వారు ఎలాంటి వస్తువులను సరఫరా చేసేందుకు వీలుంది.. వాటి సాంకేతిక వివరణ, విక్రేత అభివృద్ధి తో పాటుగానాల్కోశిక్షణా కార్యక్రమాలతో వారికి సరఫరా చేయగల అంశాల గురించి అవసరమైన సమాచారాన్ని ఎంఎస్ఈలకు ఈ యాప్ ద్వారా అందించబడుతుంది. మొత్తం భారత దేశంలో బాధ్యతాయుతమైన కార్పొరేట్ సంస్థగాను ప్రధాన అల్యూమినియం ఉత్పత్తి, ఎగుమతి సంస్థగా కంపెనీ వ్యాపారం చేసే ప్రక్రియను సులభతరం చేయడానికి, ముఖ్యంగా మైనింగ్ మరియు మెటల్ వ్యాపారంలో పాల్గొన్న ఎంఎస్ఈ సెక్టార్ కోసం అనేక రకాల కార్యక్రమాలను చేపట్టింది. తన ఎకోసిస్టమ్ ద్వారా సమ్మళిత వృద్ధి, స్థిరమైన అభివృద్ధి దిశగా నాల్కో వివిధ రకాల చొరవను చేపడుతూ వస్తోంది.
***
(Release ID: 1752745)
Visitor Counter : 253