ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 కల్పనలు- వాస్తవాలు
ఇన్‌శాకాగ్ శాంపిల్ నమూనా క్రమం గణనీయంగా పెంపు
తొలిదశలో ఈ నమూనా క్రమాన్ని మన దేశానికి వచ్చే అంతర్జాతీయ పర్యాటకుల నుంచి సంబంధిత వేరియంట్ క్రమాన్ని గుర్తించడానికి (విఒసి) పరిమితం చేయడం జరిగింది.
నమూనా క్రమానికి సంబంధించి తగినన్ని నమూనాలు పంపాల్సిందిగా రాష్ట్రాలను కోరడం జరిగింది.
Posted On:
06 SEP 2021 11:18AM by PIB Hyderabad
కోవిడ్ -19 కేసులు పెరుగుతుండగా మరో పక్క కోవిడ్ -19 కు సంబంధించి జినో మ్ క్రమం, విశ్లేషణ ఇండియాలో గణనీయంగా తగ్గిపోయినట్టు ఆరోపిస్తూ కొన్ని మీడియాసంస్థలలో వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు దేశంలో తక్కువ సంఖ్యలో నమూనాలను సేకరించినట్టు కూడా ఆ నివేదికలలో ఆరోపించారు.
అయితే ఆ వార్తలలో పేర్కొన్న జన్యు క్రమాల నమూనాల సంఖ్య భారత జెనోమ్ సర్వైలెన్స్ పోర్టల్(http://clingen.igib.res.in/covid19genomes/ ) నుంచి తీసుకున్నట్టు అనిపిస్తోంది. ఐజిఐబి ఎస్ఎఫ్ టిపి లో విశ్లేషించే జన్యు క్రమాలు శాంపిల్ కలెక్షన్ తేదీని బట్టి ఉంటాయి. ఇవి సంబంధిత నెలకు సంబంధించి ఎన్ని నమూనాలు సేకరించారన్నదానిని తెలియజేయదు. ఐఎన్ ఎస్ ఎ సిఒజి కన్సార్టియం లేబరెటరీలు విశ్లేషించే జన్యుక్రమాలు కూడా సంబంధిత రాష్ట్రాలు పంపే నమూనాలపై ఆధారపడి ఉంటాయి.
జన్యు క్రమాన్ని విశ్లేషించిన నమూనాలు నెల వారీగా కింది విధంగా ఉన్నాయి.
మరోవైపు, ఐఎన్ ఎస్ఎ సిఒజి ల్యాబ్‌లు తొలుత ప్రాథమిక వైరస్ క్రమాన్ని విశ్లేషించే కార్యక్రమం , అంతర్జాతీయ పర్యాటకులలో సంబంధిత ఉత్పరివర్తనాలను గుర్తించేందుకు ఉద్దేశించినది. అలాగే ఏ వ్యక్తి అయినా గత నెల రోజులలలో దేశంలో ఆందోళనకర వేరియంట్ తో ఏమైనా ప్రవేశించారా అనేది గుర్తించేందుకు సంబంధించినది. ఐఎన్ఎస్ ఎ సిఒజి ని ఏర్పాటు చేసిన 26 డిసెంబర్ 2020 నుంచి ( ఇంక్యుబేషన్ సమయం కన్న రెట్టింపు సమయంలో అంటే 28 రోజులలో) నెలరోజులలో ఎవరైనా విఓసితో ప్రవేశించారా అనేది పరిశీలించడం దీని పని.దేశంలో విఒసి ఉందా లేదా అనేది గుర్తించేందుకు ,పాజిటివ్‌కేసులలో 5 శాతం (ఆర్‌టి-పిసిఆర్) కేసులను సీక్వెన్సింగ్‌కు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ రెండు లక్ష్యాలు 2021 జనవరి నాటికి సాధించడం జరిగింది.
మహారాష్ట్ర,పంజాబ్, డిల్లీ వంటి ఎన్నో రాష్ట్రాలలో ఫిబ్రవరి నెలలో పెంపు కనిపించడంతో విదర్భలోని నాలుగు జిల్లాలు, మహారాష్ట్రలోని పది జిల్లాలలు, పంజాబ్‌లోని 10 జిల్లాలలో సీక్వెన్సింగ్ పెంచడం జరిగింది.
అంతేకాదు, ఆయా రాష్ట్రాలనుంచి నెలకు 300 నమూనాలు మాత్రమే పంపాలని వ్యాధిగల పది ప్రాంతాలకు మాత్రమే దీనిని పరిమితం చేయాలని ఏదీ నిర్ణయించలేదు. ఇవి కేవలం సూచనప్రాయమైన అంకెలు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వాటికి అనువైన విధంగా వ్యాధికల ప్రాంతాలనుంచి , అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనుంచి మరిన్ని నమూనాలు పంపేందుకు వాటికి స్వేచ్ఛనివ్వడం జరిగింది.
వ్యాధిగల ప్రాంతాలతోపాటు,రాష్ట్రాలు వాక్సిన్ వేసినప్పటికీ వ్యాధిసోకిన ప్రాంతాలనుంచి, తిరిగి ఇన్‌ఫెక్షన్ సోకిన వారి నుంచి, లేదా అసాధారణ నమూనాలను ఐఎన్ఎస్ ఎ సిఒజి ల్యాబ్‌కు జన్యుక్రమాన్ని విశ్లేషించేందకు పంపించే అవకాశం ఉంది.
దీనికితొడు, వివిధ ప్రాంతాలలో వ్యాధి తీవ్రతకు సంబంధించి ప్రతి రాష్రంనుంచి వచ్చే నమూనాలు భౌగోళికంగా అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించేట్టు ఉండేలా చూడాల్సిందిగా కోరడం జరిగింది. 5 శాతం ర్యాండమ్ శాంప్లింగ్ వల్ల కొన్ని జిల్లాలకు అధిక ప్రాతినిధ్యం లభించడం, కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం లభించకపోవడం జరుగుతొంది. పాజిటివిటీ బాగా తగ్గడంతో వ్యాధిగల ప్రాంతాలనుంచి నమూనాల సేకరణ కూడా పలు జిల్లాలనుంచి జీరోకు లేదా ఒక అంకెకు తగ్గాయి. ప్రస్తుతం దేశంలోని 86 జిల్లాలలో వారపు కొత్త కేసులు జీరోగా ఉన్నాయి.
గత నెల రోజులుగా మెజారిటీ కొత్త కేసులు ప్రధానంగా రెండు రాష్ట్రాలలోనే ఎక్కువగా ఉన్నాయి. అవి కేరళ , మహారాష్ట్రలు. ప్రస్తుతం 45 వేల కొత్త కేసులు నమోదు అయితే అందులో 32 వేల కు పైగా కొత్త కేసులు కేరళ నుంచి ఉండగా నాలుగు వేలకు పైగా కేసులు మహారాష్ట్ర నుంచి ఉన్నాయి. అంటే 80 శాతానికి మించి కొత్తకేసులు ఈ రెండు రాష్ట్రాలనుంచే ఉన్నాయి. మిగిలిన 9 వేల కేసులు అంటే 20 శాతం కేసులు మిగిలిన దేశం మొత్తంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నాయి. ఇది కూడా వివిధ రాష్ట్రాలనుంచి వచ్చే నమూనాల విషయంలో ప్రతిబింబిస్తుంది.
ఈ ఏడాది జూలై నుంచి , నమూనా వివరాలు, సరైన సమయానికి డబ్ల్యుజిఎస్ ఫలితాలు పంపించడం, డబ్ల్యుజిఎస్‌కు నమూనాలను వ్యాధఙగల ప్రాంతాలనుంచి సేకరణ వంటి వివరాలను ఐహెచ్ఐపి పోర్టల్‌లో చేర్చడం జరుగుతోంది, ఇది రియల్‌టైమ్ సమచారాన్ని ఎప్పటికప్పుడు అందించడానికి, ఫలితాలు తెలియజేయడానికి వీలు కల్పిస్తుంది. ఇందుకు అనుగుణంగా 9066 నమూనాలను వ్యాధిగల ప్రాంతాలనుంచి జూలైలో పంపడం జరిగింది. అలాగే 6969 నమూనాలను ఆగస్టులో పంపడం జరిగింది.
పాంగో లీనేజ్‌తో ఎన్‌సిడిసి అందుకున్న నెలావారీ నమూనాలు )వివిధ ఐఎన్ఎస్ఎసిఒజి ల్యాబ్‌లనుంచి)
***
(Release ID: 1752595)
Visitor Counter : 196