ప్రధాన మంత్రి కార్యాలయం

జలియాఁవాలా బాగ్‌ స్మారకం తాలూకు నవీకరించిన  ప్రాంగణాన్ని దేశ ప్రజల కు అంకితం చేసిన తరువాతప్రధాన మంత్రి ఇచ్చిన ప్రసంగం పాఠం

Posted On: 28 AUG 2021 8:59PM by PIB Hyderabad

పంజాబ్ గవర్నర్ శ్రీ విపి సింగ్ బద్ నోర్ గారు, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింహ్ గారు, కేంద్ర మంత్రివర్గం లో నా సహచరులు శ్రీ జి. కిశన్ రెడ్డి గారు, శ్రీ అర్జున్ రామ్ మేఘ్ వాల్ గారు , శ్రీ సోమ్ ప్రకాష్ గారు, పార్లమెంటు లో నా సహచరులు శ్రీ శ్వైత్ మలిక్ గారు,కార్యక్రమం తో జతపడ్డ గౌరవనీయులైన ముఖ్యమంత్రులు అందరూ, ప్రజా ప్రతినిధులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, సోదరులు మరియు సోదరీమణులారా!

 

పంజాబ్ తాలూకు వీర భూమి కి, జలియాఁవాలా బాగ్ తాలూకు పవిత్రమైన నేల కు ఇవే నా అనేకానేక ప్రణామాలు. ఏ భరత మాత బిడ్డల లో రగులుతున్న స్వేచ్ఛాజ్వాలల ను ఆర్పివేయడం కోసం అమానవీయత తాలూకు అన్ని హద్దుల ను ఉల్లంఘించడం జరిగిందో అటువంటి వారి కి కూడా నమస్కారాలు. అమాయక బాలుర బాలికల, సోదరీమణుల, సోదరుల ఎవరి స్వప్నాలయితే నేటికీ జలియాఁవాలా బాగ్‌ తాలూకు గోడల లో దిగబడిన తుపాకి గుళ్ల ఆనవాళ్ల లో కనుపిస్తూ ఉంటాయో, ఆ అమరవీరుల బావి (శహీదీకువాఁ) లోకి లెక్కలేనంత మంది తల్లుల, సోదరీమణుల మమత ను గుంజేసుకోవడం జరిగిందో, వారి ప్రాణాల ను తోడేయడం జరిగిందో, వారి కలల ను తుంగ లో తొక్కివేయడమైందో, ఆ వ్యక్తులందరి ని ఇవాళ మనం స్మరించుకొంటున్నాం.

 

సోదర సోదరీమణులారా,

 

సర్ దార్ ఉధమ్ సింహ్, సర్ దార్ భగత్ సింహ్ ల వంటి అసంఖ్యాక క్రాంతివీరులు, ఆత్మసమర్పణం చేసినటువంటి వారు, సేనానుల ను స్వాతంత్ర్యం కోసం ప్రాణాల ను బలి ఇవ్వగల ధైర్యాన్ని అందించినటువంటి గడ్డ జలియాఁవాలా బాగ్. మన స్వాతంత్ర్య సమరం లో 1919 ఏప్రిల్‌ 13నాటి ఆ 10 నిమిషాలే సత్య గాథ గాను, శాశ్వత కథ గాను మారాయి. ఆ కారణం గానే మనం స్వాతంత్ర్యం తాలూకు అమృత మహోత్సవాన్ని నిర్వహించుకో గలుగుతున్నాం. ఇటువంటి సందర్భం లో స్వాతంత్ర్యం 75వ వార్షికోత్సవం లో భాగం గా జలియాఁవాలా బాగ్‌ స్మారకాన్ని ఆధునిక రూపంలో జాతి కి అంకితం చేయడం మనందరికీ గొప్ప స్ఫూర్తిదాయకమైన సందర్భం. జలియాఁవాలా బాగ్ లోని ఈ పవిత్ర భూమి ని అనేక సార్లు సందర్శించి, అక్కడి పవిత్ర మట్టి ని నా నుదుటి పై రాసుకోవడం నాకు కలిగిన అదృష్టం. త్యాగం తాలూకు అమర గాథ ను మరింత శాశ్వతం గా ఈ పునర్నిర్మాణం చేసింది. వివిధ గ్యాలరీ లు, గోడల లో చెక్కబడిన అమరవీరుల చిత్రాలు, శహీద్ ఉధమ్ సింహ్ గారి విగ్రహం మనల్ని ఆ కాలాని కి తీసుకు పోతాయి. జలియాఁవాలా బాగ్ నరసంహారానికి ముందు ఆ ప్రదేశం లో పవిత్ర వైశాఖీ ఉత్సవాలు జరిగేవి. ఈ రోజే గురు గోబింద్ సింహ్ గారు సర్ బత్ దా భలా’ (అందరి సంక్షేమం అని అర్థం) తాలూకు భఆవన తో ఖాల్ సా పంథ్ ను స్థాపించారు. స్వాతంత్ర్యం 75వ సంవత్సరం లో జలియాఁవాలా బాగ్ ఈ నూతన రూపం ఈ పవిత్ర ప్రదేశం చరిత్ర గురించి, దాని గతం గురించి చాలా తెలుసుకోవడానికి దేశ ప్రజల కు ప్రేరణ ఇస్తుంది. ఈ ప్రదేశం ఎల్లప్పుడూ మన స్వాతంత్ర్య ప్రయాణం గురించి, మన పూర్వికులు ఇక్కడ కు చేరుకోవడానికి ఏమి చేశారనే దాని గురించి, వారి త్యాగాన్ని, లెక్కలేనన్ని పోరాటాల ను నవ తరాని కి గుర్తు చేస్తుంది. దేశం పట్ల మన విధుల కు సంబంధించి పునరుద్ధరణ జరిగిన శక్తి తో మనం చేసే పనుల లో దేశం ప్రయోజనాల ను ప్రధానమైంది గా ఉంచడానికి కూడా మనం ప్రేరణ ను పొందగలం.

 

మిత్రులారా,

 

ప్రతి దేశం తన చరిత్ర ను పరిరక్షించుకొనే బాధ్యత ను కలిగి ఉంటుంది. చారిత్రిక సంఘటన లు మనకు చాలా నేర్పుతాయి, ముందుకు సాగడానికి దిశానిర్దేశం చేస్తాయి. భారతదేశం విభజన కాలం లో జలియాఁవాలా బాగ్ వంటి మరో భయానక పరిస్థితి ని కూడా మనం చూశాం. పంజాబ్ లోని కష్టపడి పనిచేసే ప్రజలు, వివేచన కలిగిన ప్రజలు విభజన తాలూకు బాధితులు గా ఉన్నారు. విభజన సమయం లో భారతదేశం లోని ప్రతి మూలలో, ముఖ్యంగా పంజాబ్ కుటుంబాల కు కలిగిన కష్ట నష్టాల ను మనం ఇప్పటికి కూడా అనుభవిస్తున్నాం. అలాగే ఏ దేశం అయినప్పటికీ గతం తాలూకు భయానక అనుభవాల ను విస్మరించడం సముచితం కాదు. అందుకే ఏటా ఆగస్టు 14 ను విభాజన విభీషికా స్మృతి దివస్’(భయానక విభజన సంస్మరణ దినం అని అర్థ) గా నిర్వహించుకోవాలి అని భారతదేశం నిర్ణయించింది. భయానక విభజన సంస్మరణ దినం మనకు, ఎంత గొప్ప ధర తో మన స్వాతంత్ర్యాన్ని పొందామో రాబోయే తరాల కు కూడా గుర్తు చేస్తుంది. విభజన సమయం లో కోట్ల కొద్దీ భారతీయులు పడ్డ ఇబ్బంది ని, బాధ ను వారు అర్థం చేసుకోగలుగుతారు.

 

సహచరులారా,

 

గురు బాణీ మనకు బోధిస్తుంది ఏమిటి అంటే అది .. సుఖ్ హోవై సేవ్ కమాణీఆ అని. ఈ మాటల కు.. మనం సుఖంగా ఎప్పుడు ఉంటాం అని అంటే ఎప్పుడైతే మన తో పాటు మన వారి బాధ ను కూడా మనం అనుభవం లోకి తెచ్చుకొంటామో.. అని భావం. ఈ కారణం గా ఇవాళ ప్రపంచం లో ఎక్కడైనా భారతీయుడు ఇబ్బందుల లో ఉంటే, భారతదేశం తన పూర్తి శక్తి తో అతని కి సహాయం చేయడానికి నిలబడుతుంది. ఇది కరోనా కాలం లో గాని, లేదా అఫ్ గానిస్తాన్‌ లో వర్తమాన సంకటం గాని.. ప్రపంచం దీనిని నిరంతరం గా అనుభవం లోకి తెచ్చుకొన్నది. అఫ్ గానిస్తాన్ నుంచి వందల కొద్దీ సహచరులను ఆపరేనశన్ దేవీ శక్తిలో భాగం గా భారతదేశాని కి తీసుకురావడం జరుగుతోంది. సవాళ్లు అనేకం ఉన్నాయి, పరిస్థితులు కష్టంగా ఉన్నాయి, కానీ గురుకృప కూడా మనతోనే ఉంది. మనం వ్యక్తులతో పాటు పవిత్ర గురుగ్రంథ్ సాహిబ్ యొక్క స్వరూప్ను కూడా శిరస్సు పైన పెట్టుకొని భారతదేశాని కి తీసుకు వచ్చాం.

 

సహచరులారా,

 

గత కొన్నేళ్లు గా దేశం తన ఈ యొక్క బాధ్యత ను నెరవేర్చడానికి శాయశక్తుల ప్రయత్నాలు చేసింది. గురువులు మనకు బోధించిన మానవత తాలూకు బోధనల ను దృష్టి లో పెట్టుకొని, దేశం ఇటువంటి పరిస్థితుల ద్వారా పీడన కు లోనవుతున్న వారి కోసం కొత్త చట్టాల ను కూడా రూపొందించింది.

 

సహచరులారా,

 

ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు ఒకే భారతం-శ్రేష్ఠ భారతం’ (వన్ ఇండియా, సుప్రీం ఇండియా) నినాద ప్రాముఖ్యాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి. ఈ సంఘటనలు ఒక దేశంగా ఆత్మనిర్భరత , ఆత్మవిశ్వాసం అవసరాన్ని గుర్తు చేస్తాయి. అందువల్ల, ఈ రోజు, మనం 75 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని జరుపుకొంటున్నప్పుడు, మన దేశం పునాదుల ను పటిష్ఠం చేయడం, ఈ పరిణామాల పట్ల గర్వపడడం ముఖ్యం. అమృత మహోత్సవాల్లో భాగం గా దేశం లోని ప్రతి గ్రామం లో స్వాతంత్ర్య యోధులను స్మరించుకోవడం సహా వారి ని సత్కరించడం తో స్వాతంత్ర్య అమృత్ మహోత్సవం ఈ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. దేశ స్వాతంత్ర్య పోరాటం లో ముఖ్యమైన మైలురాళ్ల ను తెర పైకి తీసుకు రావడానికి అంకితభావం తో ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్వాతంత్ర్య సమరం లో కీలక దశలు.. జాతీయ వీరుల తో ముడిపడిన ప్రదేశాల పరిరక్షణ సహా వాటిని వెలుగులోకి తీసుకురావడానికి ఒక ప్రత్యేక ఆలోచన తో ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

దేశం లోని జాతీయ వీరుల తో సంబంధం ఉన్న ప్రదేశాలు సంరక్షించబడటమే కాకుండా కొత్త కోణాలు కూడా జోడించబడుతున్నాయి. జలియాఁవాలా బాగ్ వంటి స్వాతంత్ర్యం తో సంబంధం ఉన్న ఇతర జాతీయ స్మారక చిహ్నాలు కూడా నవీకరింపబడుతున్నాయి. 1857 నుండి 1947 వరకు ప్రతి విప్లవాన్ని ప్రదర్శించే అహ్మదాబాద్‌ మ్యూజియం లోని మొదటి పరస్పర ప్రభావశీల గ్యాలరీ నిర్మాణం త్వరలో పూర్తి అవుతుంది. క్రాంతివీర్ చంద్ర శేఖర్ ఆజాద్ కు అంకితం చేయబడిన ఈ ఆజాద్ గ్యాలరీఆ సమయం లో సాయుధ విప్లవాని కి సంబంధించిన పత్రాల డిజిటల్ అనుభవాన్ని అందిస్తుంది. అదేవిధం గా కోల్‌కాతా లోని విప్లవ (బిప్లబీ) భారత్ గ్యాలరీ ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భవిష్యత్ తరానికి ఆకర్షణీయం గా తీర్చిదిద్దడం జరుగుతోంది. ఇంతకు ముందు, ఆజాద్ హింద్ ఫౌజ్ తాలూకు తోడ్పాటు ను చరిత్ర పుట ల నుండి తీసి ముందుకు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసింది. నేతాజీ తొలి సారి జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అండమాన్‌ లోని ప్రదేశానికి సైతం సరికొత్త గుర్తింపు ను ఇవ్వడం జరిగింది. దీనితో పాటు అండమాన్‌ లోని దీవుల పేరులను కూడా స్వాతంత్ర్య సంగ్రామానికి అంకితం చేయడమైంది.

 

సోదర సోదరీమణులారా,

 

స్వాతంత్ర్యం తాలూకు మహా యజ్ఞ‌ం లో మన ఆదివాసీ సమాజం చాలా పెద్ద తోడ్పాటు ను అందించింది. జనజాతీయ సమూహాల త్యాగం, ఆత్మసమర్పణం తాలూకు అమర గాథ లు ఈనాటి కి కూడా మనకు ప్రేరణ ను ఇస్తాయి. చరిత్ర గ్రంథాల లో వారికి హక్కు గా దక్కవలసినంత స్థానం దక్కలేదు. దేశం లోని 9 రాష్ట్రాల లో ఆదివాసీ స్వాతంత్ర్య యోధుల ను, వారి సంఘర్షణ ను కళ్ల కు కట్టే మ్యూజియమ్ ల పనులు కూడా సాగుతున్నాయి.

 

సహచరులారా,

 

దేశం కోసం ఎనలేని త్యాగాలు చేసిన మన వీరసైనికుల జాతీయ స్మారకాన్ని దేశం కోరుకుంటున్నది. ఆ మేరకు జాతీయ యుద్ధ స్మారకంనేటి యువత లో దేశరక్షణ స్ఫూర్తి ని నింపడం తో పాటు దేశం కోసం సర్వస్వం త్యాగం చేయాలి అనే భావన ను మేల్కొలుపుతున్నందుకు నాకు సంతోషం గా ఉంది.

 

సహచరులారా,

 

దేశ భద్రత కోసం అమరులైన పంజాబ్ తో సహా దేశంలోని ప్రతి మూల నుంచి మన వీర సైనికుల కు తగిన గౌరవం లభించింది. అదేవిధం గా, మన పోలీసు సిబ్బంది కి, పారామిలటరీ దళాల కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇన్ని దశాబ్దాల పాటు దేశం లో ఎలాంటి జాతీయ స్మారక చిహ్నమూ లేదు. ఇవాళ పోలీసులు, పారామిలటరీ దళాల కు అంకితం చేయబడిన జాతీయ స్మారక చిహ్నం కూడా దేశం లోని కొత్త తరాని కి స్ఫూర్తి ని ఇస్తున్నది.

 

మిత్రులారా,

 

పంజాబ్‌ లో ధైర్యసాహసాలు, శౌర్యం అనే కథ లేని గ్రామం కానీ వీధి కానీ లేదు. దేశానికి ఎదురైన అనేక సవాళ్లను ఎదుర్కోవడం లో పంజాబ్‌ నేల పై జన్మించిన పుత్రులు, పుత్రికలు వారి గురువుల అడుగుజాడల్లో నిలిచి మొక్కవోని పోరాటం చేశారు. ఈ సుసంపన్న వారసత్వాన్ని పరిరక్షించడానికి అన్నివిధాలు గాను కృషి చేస్తున్నాం. గడచిన ఏడేళ్లలో అదృష్టవశాత్తూ శ్రీ గురునానక్‌ దేవ్‌ 550వ ప్రకాశోత్సవ్, శ్రీ గురు గోబింద్ సింహ్ 350వ ప్రకాశోత్సవ్, శ్రీ గురు తేగ్‌ బహాదుర్‌ 400వ ప్రకాశోత్సవ్ ల వంటి ప్రత్యేక సందర్భాలు వచ్చాయి. ఆయా పవిత్ర వేడుకల ను పురస్కరించుకొని దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన గురువుల ప్రబోధాల వ్యాప్తి కి కేంద్ర ప్రభుత్వం తన వంతు కృషి చేస్తున్నది. ఈ సుసంపన్న వారసత్వాన్ని యువత కు చేర్చడానికి చర్యలు చేపట్టడం జరిగింది. సుల్తాన్ పూర్ లోధి ని వారసత్వ పట్టణం గా మార్చడం లేదా కర్ తార్ పుర్ కారిడోర్ నిర్మాణం కావచ్చు.. ఈ గొప్ప వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి నిరంతరం పనులు జరుగుతున్నాయి. ప్రపంచం లోని వివిధ దేశాల విమానమార్గాల తో అనుసంధానం లేదా దేశ వ్యాప్తంగా మన గురువుల మత ప్రస్థానాల అనుసంధానం బలోపేతం అయింది. స్వదేశీ దర్శన్ పథకం లో భాగం గా ఆనంద్ పుర్ సాహిబ్-ఫతేహ్ గఢ్ సాహిబ్-ఫిరోజ్ పుర్-అమృత్ సర్-ఖట్ కడ్ కలా-కలానౌర్-పటియాలా హెరిటేజ్ సర్క్యూట్ ను అభివృద్ధి చేయడం జరుగుతోంది. మన సమృద్ధ వారసత్వం భవిష్యత్ తరాల కు ప్రేరణ ను అందించడం తో పాటు పర్యటన రూపం లో ఉపాధి సాధనం గా మారాలి అన్నదే మా ప్రయత్నం గా ఉంది.

 

సహచరులారా,

 

స్వాతంత్ర్యానికి సంబంధించిన అమృత కాలందేశం మొత్తానికీ ఎంతో ప్రాముఖ్యం కలిగినది. అమృత కాలంలో మన వారసత్వాన్ని, ప్రగతి ని ముందుకు తీసుకు పోయే బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉంది. పంజాబ్‌ నేల మనకు సదా స్ఫూర్తిదాయకం గా నిలుస్తున్నదని, ఈ నేపథ్యంలో నేడు ప్రతి స్థాయి లో, ప్రతి దిశ లో పంజాబ్‌ ముందడుగు వేసే విధంగా చూడవలసిన అవసరం ఉంది. ఇందుకోసం సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, ఇంకా సబ్ కా ప్రయాస్భావన తో మనలో ప్రతి ఒక్కరం సమష్టి గా కృషి చేస్తూ ఉండాలి. జలియాఁవాలా బాగ్‌ తాలూకు ఈ గడ్డ మనకు మన సంకల్పాల కోసం నిరంతర శక్తి ని అందిస్తూ ఉంటుంది, మరి దేశం తన లక్ష్యాల ను తర్వగా పూర్తి చేసుకొంటుంది అని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇదే ఆకాంక్ష తో మరో సారి ఈ ఈ ఆధునిక స్మారకాని కి చాలా- చాలా అభినందనలు! చాలా- చాలా ధన్యవాదాలు!

 

 

***

 

 



(Release ID: 1752429) Visitor Counter : 201