బొగ్గు మంత్రిత్వ శాఖ
'ఆజాది కా అమృత్ మహోత్సవ్' వేడుకల్లో భాగంగా పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన బీసీసీఎల్
Posted On:
04 SEP 2021 3:00PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా జరుగుతున్న 'ఆజాది కా అమృత్ మహోత్సవ్' (ఏకేఏఎం) వేడుకలలో భాగంగా
బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన మినీరత్న కంపెనీ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్),
పారిశుధ్యం, కోవిడ్-19 సంబంధిత జాగ్రత్తల గురించి అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. డ్రైవ్‌లో భాగంగా బీసీసీఎల్ సంస్థకు చెందిన సీఎస్ఆర్ విభాగం.. జార్ఖండ్ రాష్ట్రం పూటికా బలిహారి ఏరియా ఆఫ్ ధన్‌బాద్ గ్రామంలోని ఎస్‌సీ/ ఎస్‌టీ/ ఓబీసీలు వంటి ప్రజల జనాభా అత్యధికంగా ఉండే అల్గోరియా బస్తీ ప్రాంతంలో 125 హ్యాండ్ శానిటైజర్‌లను, ముఖ మాస్క్‌లను పంపిణీ చేశారు. దీనికి తోడు జవహర్ నగర్ దివ్యాంగులైన పిల్లలకు ప్రత్యేకమైన అభ్యాస కేంద్రమైన పెహలా కదమ్ స్కూల్ విద్యార్థులకు, సంరక్షకులకు కూడా హ్యాండ్ శానిటైజర్‌లను, ఫేస్ మాస్క్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమ నిర్వాహకులు కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు నిత్యం చేతులు కడుక్కోవడం, మాస్క్‌లు ధరించడాన్ని తగిన విధంగా అలవాటు చేసుకోవడంపై అవగాహన కల్పించారు. దేశంలో జరుగుతున్న'ఆజాది కా అమృత్ మహోత్సవ్' (ఏకేఏఎం) వేడుకలకు అనుగుణంగా ఇక్కడి విద్యార్థులు వివిధ రకాలైన పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.
***
(Release ID: 1752059)
Visitor Counter : 287