ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అబూదభీ రాజు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ మధ్య టెలిఫోన్ సంభాషణ
Posted On:
03 SEP 2021 10:34PM by PIB Hyderabad
అబూదభీ రాజు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం టెలిఫోన్‌లో సంభాషించారు. భారత్-యుఏఇ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కింద వివిధ వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారం నిరంతర పురోగతి తీరును ఉభయ నాయకులు సమీక్షించారు. కోవిడ్-19 మహమ్మారి కాలంలో భారత సంతతి ప్రజలకు యుఏఇ అందించిన మద్దతును ప్రధానమంత్రి ప్రశంసించారు. 2021 అక్టోబర్ 1వ తేదీ నుంచి దుబాయ్ లో ఎక్స్ పో-2020 జరుగనున్న సందర్భంగా శుభాభినందనలు అందచేశారు.
ఉభయ దేశాలకు ఉమ్మడిగా అందోళన కలిగించే పలు అంశాలపై ఉభయులు చర్చించారు. ప్రపంచంలో ఉగ్రవాదం, తీవ్రవాదానికి తావు లేదని వారు అంగీకరించారు. అలాంటి శక్తులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం దృఢంగా నిలవాల్సిన అవసరాన్ని వారు నొక్కి వక్కాణించారు.
***
(Release ID: 1751991)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam