ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
టెక్నాలజీ ఎంబెడెడ్ గవర్నెన్స్ అభివృద్ధి విషయంలో భావ సారూప్యతగల దేశాలతో కలిసి పనిచేయడానికి భారతదేశం సిద్ధంగా ఉంది: ఎంఓఎస్ ఐటీ శ్రీ రాజీవ్ చంద్రశేఖర్
Posted On:
02 SEP 2021 12:58PM by PIB Hyderabad
యుఎన్‌సిటిఎడి అత్యున్నత స్థాయి సమావేశంలో ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ భారతదేశ డిజిటలైజేషన్ విజయగాథను పంచుకున్నారు. భారతదేశం, ఇండోనేషియా మరియు శ్రీలంక దేశాలకు చెందిన మంత్రులు ఈ సమావేశంలో డిజిటల్ ఇన్‌క్లూజన్ & సామాజిక సాధికారత వంటి ఆంశాలపై విధాన అనుభవాలను పంచుకున్నారు. యుఎన్‌సిటిఎడి మంత్రివర్గ సమావేశం యొక్క పదిహేనవ సెషన్‌కు ముందు నిర్వహించబడిన ఒక ముందస్తు కార్యక్రమం ఈ వెబ్‌నార్.
భారతదేశ డిజిటలైజేషన్ కార్యక్రమం మాట్లాడుతూ "ప్రపంచానికి వినూత్న పరిష్కారాలను అందించే విషయంలో గ్లోబల్ టెక్నాలజీ ఎకో-సిస్టమ్‌లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగం ద్వారా భారతదేశం యొక్క డిజిటలైజేషన్ విజయగాథ నడుస్తుందని" శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఆన్‌లైన్‌లో దాదాపు 80 కోట్ల మంది ఇంటర్నెట్ కనెక్టివిటీ మరియు ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ చేయబడిన దేశాలలో ఒకటిగా భారతదేశం నిలిచిందని మంత్రి తెలిపారు. డిజిటల్ గుర్తింపు, డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు మరియు డిజిటల్ అక్షరాస్యతతో సహా సాంకేతిక పరిజ్ఞానం మరియు పబ్లిక్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను మెరుగుపరచడం ద్వారా మరియు సామాజిక సబ్సిడీల లీకేజీని నిరోధించడం ద్వారా గత 6 సంవత్సరాలుగా పౌరుడికి మరియు ప్రభుత్వానికి మధ్య దూరం చాలా వరకు తగ్గించబడింది. ఈ క్రమంలో సాంకేతికత ప్రాముఖ్యతను మంత్రి వివరించారు. సాధారణ పౌరుడు మరియు చిన్న వ్యాపారాలకు ఉపయోగపడే సాంకేతిక శక్తిని భారతదేశం ప్రదర్శించిందని తెలిపారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించడంతో పాటు దాని ద్వారా ప్రజల జీవితాలను మార్చగలిగే నమూనాను విజయవంతంగా అమలు చేసింది. మరియు టెక్నాలజీ ఎంబెడెడ్ గవర్నెన్స్‌లో అభివృద్ధి కోసం అన్ని సారూప్య దేశాలతో భాగస్వామి కావడానికి భారతదేశం సిద్ధంగా ఉందని శ్రీ చంద్రశేఖర్ తెలిపారు.
యుఎన్‌సిటిఎడి హై-లెవల్ పాలసీ డైలాగ్‌లో టెక్నాలజీ ఎంబెడెడ్ గవర్నెన్స్ మరియు సోషల్ ఇన్‌క్లూజన్ వైపు డిజిటల్ టెక్నాలజీలు మరియు పబ్లిక్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకోవాలని భారతదేశం తెలిపింది.
****
(Release ID: 1751428)
Visitor Counter : 201