ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆగష్ట్ 2021 జిఎస్టి రెవిన్యూ వసూళ్లు
ఆగస్టులో రూ.1,12,020 కోట్ల స్థూల జిఎస్‌టి ఆదాయం వసూళ్లు
Posted On:
01 SEP 2021 1:18PM by PIB Hyderabad
ఆగష్టు 2021 నెలలో స్థూల జిఎస్‌టి ఆదాయం రూ.1,12,020 కోట్లు వసూలు అయింది. ఇందులో సిజిఎస్‌టి రూ.20,522 కోట్లు, ఎస్జిఎస్‌టి రూ.26,605 కోట్లు, ఐజిఎస్‌టి రూ.56,247 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.26,884 కోట్లు సహా), సెస్ కింద రూ.8,646 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.6 646 కోట్లతో సహా) ఉంది.
ఐజిఎస్‌టి నుండి ప్రభుత్వం సిజిఎస్‌టికి రూ.23,043 కోట్లు,ఎస్జిఎస్‌టికి రూ.19,139 కోట్లు రెగ్యులర్ సెటిల్‌మెంట్‌గా సెటిల్ చేసింది. అదనంగా, కేంద్రం, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మధ్య 50:50 నిష్పత్తిలో ఐజిఎస్‌టి అడ్-హాక్ సెటిల్‌మెంట్‌గా రూ. 24,000 కోట్లను కూడా కేంద్రం పరిష్కరించింది. ఆగస్టు 2021 నెలలో రెగ్యులర్, తాత్కాలిక పరిష్కారాల తర్వాత కేంద్రం, రాష్ట్రాల మొత్తం ఆదాయం సి జిఎస్‌టి రూ.55,565 కోట్లు, ఎ జిఎస్‌టి 57,744 కోట్లు గా నమోదయింది.
2021 ఆగస్టు నెల ఆదాయం గత సంవత్సరం ఇదే నెలలో జిఎస్‌టి ఆదాయాల కంటే 30% ఎక్కువ. నెలలో, దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయం (సేవల దిగుమతితో సహా) గత సంవత్సరం ఇదే నెలలో ఈ వనరుల నుండి వచ్చిన ఆదాయాల కంటే 27% ఎక్కువ. 2019-20లో రూ.98,202 కోట్ల ఆగస్టు ఆదాయాలతో పోలిస్తే, ఇది 14%వృద్ధి.
జిఎస్‌టి వసూలు వరుసగా తొమ్మిది నెలలకు లక్ష కోట్ల రూపాయలు పైగా నమోదయితే, కోవిడ్ రెండవ వేవ్ కారణంగా జూన్ 2021 లో లక్ష కోట్లుకంటే దిగువకు పడిపోయింది. కోవిడ్ ఆంక్షలను సడలించడంతో, జూలై, ఆగస్టు 2021న జిఎస్‌టి సేకరణ మళ్లీ లక్ష కోట్ల రూపాయలు దాటింది, ఇది ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని స్పష్టంగా సూచిస్తుంది. ఆర్థిక వృద్ధి, ఎగవేత నిరోధక కార్యకలాపాలు, ముఖ్యంగా నకిలీ బిల్లర్‌లపై చర్య కూడా జిఎస్‌టి వసూళ్లకు దోహదం చేస్తున్నాయి. రాబోయే నెలల్లో కూడా అధిక జిఎస్‌టి ఆదాయాలు కొనసాగే అవకాశం ఉంది.
ఆగష్టు 2020 తో పోలిస్తే ప్రతి రాష్ట్రంలో ఆగస్టు 2021 నెలలో సేకరించిన రాష్ట్రాల వారీగా జిఎస్‌టి గణాంకాలను పట్టిక చూపుతుంది.
ఆగష్టు 2021 లో జిఎస్‌టి వారీగా రాష్ట్రాల వారీగా వృద్ధి
|
రాష్ట్రం
|
ఆగష్టు -20
|
ఆగష్టు 21
|
% వృద్ధి
|
1
|
జమ్ము కశ్మీర్
|
326
|
392
|
20%
|
2
|
హిమాచల్ ప్రదేశ్
|
597
|
704
|
18%
|
3
|
పంజాబ్
|
1,139
|
1,414
|
24%
|
4
|
చండీగఢ్
|
139
|
144
|
4%
|
5
|
ఉత్తరాఖండ్
|
1,006
|
1,089
|
8%
|
6
|
హర్యానా
|
4,373
|
5,618
|
28%
|
7
|
ఢిల్లీ
|
2,880
|
3,605
|
25%
|
8
|
రాజస్థాన్
|
2,582
|
3,049
|
18%
|
9
|
ఉత్తరప్రదేశ్ |
5,098
|
5,946
|
17%
|
10
|
బీహార్
|
967
|
1,037
|
7%
|
11
|
సిక్కిం
|
147
|
219
|
49%
|
12
|
అరుణాచల్ ప్రదేశ్
|
35
|
53
|
52%
|
13
|
నాగాలాండ్ |
31
|
32
|
2%
|
14
|
మణిపూర్
|
26
|
45
|
71%
|
15
|
మిజోరాం
|
12
|
16
|
31%
|
16
|
త్రిపుర
|
43
|
56
|
30%
|
17
|
మేఘాలయ
|
108
|
119
|
10%
|
18
|
అస్సాం
|
709
|
959
|
35%
|
19
|
పశ్చిమ బెంగాల్
|
3,053
|
3,678
|
20%
|
20
|
ఝార్ఖండ్
|
1,498
|
2,166
|
45%
|
21
|
ఒడిశా
|
2,348
|
3,317
|
41%
|
22
|
ఛత్తీస్గఢ్
|
1,994
|
2,391
|
20%
|
23
|
మధ్యప్రదేశ్
|
2,209
|
2,438
|
10%
|
24
|
గుజరాత్
|
6,030
|
7,556
|
25%
|
25
|
దమన్ అండ్ డయ్యు
|
70
|
1
|
-99%
|
26
|
దాద్రా, నగర్ హవేలీ
|
145
|
254
|
74%
|
27
|
మహారాష్ట్ర
|
11,602
|
15,175
|
31%
|
29
|
కర్ణాటక
|
5,502
|
7,429
|
35%
|
30
|
గోవా
|
213
|
285
|
34%
|
31
|
లక్షద్వీప్
|
0
|
1
|
220%
|
32
|
కేరళ
|
1,229
|
1,612
|
31%
|
33
|
తమిళనాడు
|
5,243
|
7,060
|
35%
|
34
|
పుదుచ్చేరి
|
137
|
156
|
14%
|
35
|
అండమాన్ నికోబర్ దీవులు
|
13
|
20
|
58%
|
36
|
తెలంగాణ
|
2,793
|
3,526
|
26%
|
37
|
ఆంధ్రప్రదేశ్
|
1,955
|
2,591
|
33%
|
38
|
లడఖ్
|
5
|
14
|
213%
|
97
|
ఇతర ప్రాంతాలు
|
180
|
109
|
-40%
|
99
|
కేంద్ర పరిధి
|
161
|
214
|
33%
|
|
మొత్తం
|
66,598
|
84,490
|
27%
|
* వస్తువుల దిగుమతిపై జిఎస్టి చేర్చబడలేదు
*********
(Release ID: 1751151)
Visitor Counter : 275
Read this release in:
Tamil
,
Malayalam
,
Kannada
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati