ఆయుష్
అఖిల భారత ఆయుర్వేద సంస్థలో న్యూట్రి గార్డెన్ ను ప్రారంభించిన కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి
దేశ పౌష్టికాహార అవసరాలను తీర్చగల శక్తి ఆయర్వేదానికి ఉంది : స్మృతి జుబిన్ ఇరాని
Posted On:
01 SEP 2021 2:52PM by PIB Hyderabad
నెలరోజులపాటు సాగే పోషణ్ మాహ్ 2021లో భాగంగా కేంద్ర మహిళా , శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరాని పలు కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె, దేశ పౌష్టికాహార అవసరాలను తీర్చేందుకు ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానాన్ని ఎంత మెరుగుగా ఉపయోగించుకోవచ్చునన్నదానిని తెలియజెప్పడమే ప్రస్తుత అవసరమని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరాని అన్నారు. 2021 పోషణ్ మాహ్‌ను ఈరోజు ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆప్ ఆయుర్వేద (ఎఐఐఎ) వద్ద ప్రారంభిస్తూ ఆమె న్యూట్రి గార్డెన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయష్ శాఖ సహాయమంత్రి డాక్టర్ ముంజపర మహేంద్ర భాయ్ , మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయమంత్రి కూడా పాల్గొన్నారు. మునగ, ఉసిరి మొక్కలను కూడా ఇరువురు మంత్రులు నాటారు. న్యూఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎఐఐఎ) ఆయుష్ మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు పోషణ్ మాహ్ 2021 ఉత్సవాలను ప్రారంభించింది.
దేశంలో రక్తహీనత కేసులను తగ్గించేందుకు ఐసిఎంఆర్ సమష్టి సహకారంతో ఆయుష్ మంత్రిత్వశాఖ కృషిని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తమ ప్రసంగంలో ప్రశంసించారు. ఆయుర్వేదకు సంబంధించిన శాస్త్రీయ సమాచారాన్ని ప్రచురించాల్సిన అవసరం ఎంతైనా ఉందని దీనివల్ల ఆయుర్వేద రంగం కృషిని ప్రపంచం గుర్తించడానికి వీలుంటుందని అన్నారు.పౌష్టికాహారానికి సంబంధించి రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయని అంటూ ఆమె, అందులో ఒకటి అందుబాటు ధరలో ఉండడం అయితే , మరొకటి వెంటనే అందుబాటులో ఉండడం అని అన్నారు. ఈవిషయంలో ఆయుర్వేదం ఎంతో ప్రయోజనకరమని ఆమె అన్నారు. ఆరోగ్యకరమైన సంతానానికి ఆయుష్ రూపొందించిన కాలెండర్‌ను , ప్రాచీన వంటకాలను మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ద్వారా బహుళ ప్రచారంలోకి తీసుకువస్తున్నట్టు ఆమె తెలిపారు.
ఆయుర్వేద వనమూలికలైన షిగురు, శతావరి, అశ్వగంధ,ఆమ్లా, తులసి , హాల్ది వంటి వాటి లోని పోషక విలువలను డాక్టర్ ముంజ పర మహేంద్ర భాయి ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే తల్లీ , పిల్లల ఆరోగ్యానికి సంబంధించి తగిన ఆధారాలు కలిగిన ఆయుర్వేదకు చెందిన పోషకాహార అలవాట్లను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత గురించి ఆయన ప్రముఖంగా తెలిపారు. గర్భిణులు ఆరోగ్యకరంగా ఉండేందుకు పోషకాహారం ఎంతటి ప్రాధాన్యత కలిగిఉంటుందో ఆయన తెలియజేశారు. ఇందులో ఆయుర్వేద ఉపయోగంగురించి వివరించారు.
మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ ఇందీవర్ పాండే, ఆయుష్ మంత్రిత్వశాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటెచ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల రోజులపాటు సాగే పౌష్టికాహార మాసోత్సవంలో పేషెంట్లకు అవగాహన కల్పించే ఉపన్యాసాలు,క్విజ్ పోటీలు, వ్యాసరచన పోటీలు, అతిథి ప్రసంగాలు, వర్క్‌షాపులను ఎఐఐఎ నిర్వహించనుంది.
ఆరోగ్యానికి సంబంధించిన, పౌషక విలువలు కలిగిన మొక్కలను పేషెంట్లకు, ఆరోగ్య కార్యకర్తలకు పంచే కార్యక్రమాన్ని
చేపట్టారు. శతావరి, అశ్వగంధ, ముస్లి, యష్టిమధు వంటి మొక్కలను పంపిణీ చేశారు. పోషక విలువలు కలిగిన ఎంపిక చేసిన మొక్కలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు పంపిణీ చేశారు. ప్రాచీన ఆయుర్వేద వంటకాలు అలాగే వివిధ పానీయాలైన సత్తు పానీయం, నువ్వు ఉండలు, ఊదల ఖీరా, ఒడిసల విత్తనాలతో లడ్డు, ఉసిరి పానక తదితరాలను ఈ కార్యక్రమం సందర్భంగా ప్రదర్శించారు.
***
(Release ID: 1751143)
Visitor Counter : 234
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam