ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యూరోపియ‌న్ కౌన్సిల్ అధ్య‌క్షుడు శ్రీ చార్ల్‌స్‌ మిశెల్ కు మరియు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ కి మ‌ధ్య టెలిఫోన్ ద్వారా జ‌రిగిన‌ సంభాష‌ణ‌

Posted On: 31 AUG 2021 8:46PM by PIB Hyderabad

యూరోపియ‌న్ కౌన్సిల్ అధ్య‌క్షుడు శ్రీ చార్ల్‌స్‌ మిశెల్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.

నేత‌ లు అఫ్ గానిస్తాన్ లో ఇటీవ‌లి ప‌రిణామాలను గురించి, ఆ పరిణామాల ద్వారా ఆ ప్రాంతం తో పాటు ప్ర‌పంచం లో కూడాను ప్ర‌స‌రించే ప్ర‌భావాన్ని గురించి చ‌ర్చించారు.  కాబుల్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం లో ఉగ్ర‌వాదులు జ‌రిపిన భ‌యాన‌క‌మైన‌టువంటి  దాడి ని నిర్ద్వందం గా ఖండించారు.  ఆ దాడి లో అనేక మంది చ‌నిపోయారు.  ఒక స్థిర‌మైన‌టువంటి, సురక్షితమైన‌టువంటి అఫ్ గానిస్తాన్ మ‌నుగ‌డ ఎంతయినా ముఖ్యం అని వారు నొక్కిచెప్పారు.  అంతేకాకుండా, ఈ సంద‌ర్భం లో భార‌త‌దేశం, యూరోపియన్ యూనియన్ (ఇయు) లు పోషించ‌గ‌లిగే పాత్ర ను గురించి కూడా వారు చ‌ర్చించారు.

ఇద్ద‌రు నేత‌ లు ద్వైపాక్షిక అంశాల తో పాటు ప్ర‌పంచ అంశాల పై, మరీ ముఖ్యం గా అఫ్ గానిస్తాన్ లో స్థితి పై త‌ర‌చు గా సంప్ర‌దింపులు జ‌రుపుకొంటూ ఉండాలి అనే విషయం లో స‌మ్మ‌తి ని వ్యక్తం చేశారు.
 



 

***


(Release ID: 1751099) Visitor Counter : 171