రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

గుజరాత్‌లోని ఆంకలేశ్వర్‌లో తయారు చేసిన కొవాక్సిన్ మొదటి కమర్షియల్ బ్యాచ్‌ను విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయనాలు, ఎరువుల శాఖల మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ


అంకలేశ్వర్ ప్లాంట్ ఈ రోజు నుండి నెలకు ఒక కోటి కంటే ఎక్కువ మోతాదుల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది: శ్రీ మన్సుఖ్ మాండవీయ

గౌరవనీయులైన ప్రధాన మంత్రి దార్శనికత వల్ల భారతదేశం తన మొదటి స్వదేశీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయగలిగింది: కేంద్ర ఆరోగ్య మంత్రి

హైదరాబాద్, మాలూరు, అంకలేశ్వర్, పూణేలలో ప్రత్యేక బయోసెఫ్టీ కంటైన్మెంట్ సదుపాయాలతో భారత్ బయోటెక్ క్రమం తప్పకుండా
ఒక బిలియన్ డోస్ వార్షిక సామర్థ్యంతో తన లక్ష్యం వైపు వెళ్తోంది

Posted On: 29 AUG 2021 1:09PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయన, ఎరువుల శాఖల మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవియా ఈ రోజు గుజరాత్‌లోని ఆంకలేశ్వర్‌లోని భారత్ బయోటెక్ చిరాన్ బెహ్రింగ్ వ్యాక్సిన్‌ల సౌకర్యం నుండి కోవాక్సిన్ మొదటి కమర్షియల్ బ్యాచ్‌ను విడుదల చేశారు. నవసారి  ఎంపి శ్రీ సి ఆర్ పాటిల్,  ఆంకలేశ్వర్ ఎమ్మెల్యే శ్రీ ఈశ్వర్సింహ్ పటేల్,  ఎమ్మెల్యే దుష్యంత్ పటేల్, భారత్ బయోటెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్ల ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

 

గౌరవనీయులైన ప్రధాన మంత్రి దార్శనికత వల్ల  భారతదేశం మొట్టమొదటి స్వదేశీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయగలిగిందని శ్రీ మన్సుఖ్ మాండవ్య అన్నారు. భారతదేశం, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌లలో ఒకటిగా నడుస్తోందని, ఈ స్వదేశీ వ్యాక్సిన్‌ల అభివృద్ధి కారణంగా ఇది సాధ్యమైందని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ కోవిడ్ -19 టీకా కార్యక్రమం 16 జనవరి 2021 నుండి అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో విజయవంతంగా కొనసాగుతోందని ఆయన తెలిపారు. 

అంకళేశ్వర్ సౌకర్యాల నుండి దేశానికి మొదటి బ్యాచ్ కోవాక్సిన్ అంకితం కేంద్ర ఆరోగ్య మంత్రి అంకితం చేశారు. కోవిడ్ -19 పై భారత పోరాట ప్రయాణంలో ఇది ఒక మైలురాయి అని అన్నారు. కోవిడ్ -19 వ్యాక్సిన్‌ల ఉత్పత్తి సామర్థ్యం పెరగడం వల్ల భారతదేశంలో టీకాల వేగానికి మరింత ఊపునిస్తుంది. భారత్ బయోటెక్, జైడస్ కాడిలా అనే రెండు కంపెనీల టీకాల పరిశోధన, ఉత్పత్తి భారతదేశంలో జరగడం మనకు గర్వకారణమని ఆయన అన్నారు. ఈరోజు నుండి నెలకు ఒక కోటి కంటే ఎక్కువ మోతాదుల ఉత్పాదక సామర్థ్యాన్ని అంకలేశ్వర్ ప్లాంట్ కలిగి ఉంటుందని ఆయన తెలియజేశారు. 

ప్రపంచ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో భారతదేశ సహకారం గురించి మాట్లాడుతూ, కోవిడ్ పరిస్థితిని ఎదుర్కోవటానికి అవసరమైన ఔషధాలను ఇతర దేశాలకు సహాయం చేయడంలో భారతదేశం ఎల్లప్పుడూ ముందంజలో ఉందని పేర్కొన్నారు.

భారతదేశంలో కోవాక్సిన్ ఉత్పత్తి స్థితి గురించి మాట్లాడుతూ, హైదరాబాద్, మలూర్, బెంగళూరు, పూణే క్యాంపస్‌లలో భారత్ బయోటెక్ ఇప్పటికే అనేక ఉత్పత్తి మార్గాలను ఏర్పాటు చేసిందని అన్నారు. చిరోన్ బెహ్రింగ్, అంకలేశ్వర్ దాని కొవాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని కేంద్ర మంత్రి తెలియజేశారు. . 2020 సమయంలో నిర్మించిన కొత్త ఫైలింగ్ సౌకర్యం ఇప్పుడు కోవాక్సిన్ ఉత్పత్తికి ఉపయోగించపడుతోంది. కొవాక్సిన్  ఉత్పత్తి జూన్ లో ప్రారంభమైంది, దీనికి ముందు బృందం ఫెసిలిటీలో పరికరాల పనితీరును అధ్యయనం చేయడానికి ఇంజనీరింగ్ బ్యాచ్‌లను అమలు చేసింది. అంకళేశ్వర్ సదుపాయాల నుంచి తయారు చేసిన ఉత్పత్తులు సెప్టెంబర్ 2021 నుండి సరఫరా కోసం అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు..

భారత్ బయోటెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ, "ప్రపంచ భద్రత, సమర్థత ప్రమాణాలతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయాలనే మా లక్ష్యం ఇప్పుడు నెరవేరింది, మేము ఇప్పుడు వార్షిక సామర్థ్యం 1.0 బిలియన్ డోస్‌ల లక్ష్యం వైపు కదులుతున్నాము." అని అన్నారు. 

భారత్ బయోటెక్ ఇతర దేశాలలో తన భాగస్వాములతో తయారీ భాగస్వామ్యాన్ని కూడా అన్వేషిస్తోంది, మరింత బలోపేతం కోసం జీవ భద్రత నియంత్రణలో క్రియారహిత వైరల్ వ్యాక్సిన్‌ల వాణిజ్య-స్థాయి తయారీలో ముందస్తు నైపుణ్యాన్ని కలిగి ఉంది.

***

 



(Release ID: 1750177) Visitor Counter : 236