ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పునరుద్ధరించిన జలియన్‌వాలా బాగ్‌ స్మారక ప్రాంగణాన్ని ఆగస్టు 28న జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి


స్మారకం వద్ద మ్యూజియం గ్యాలరీలు కూడా ప్రధాని చేతులమీదుగా ప్రారంభం

Posted On: 26 AUG 2021 6:36PM by PIB Hyderabad

   పునరుద్ధరించిన జలియన్‌వాలా బాగ్‌ స్మారక ప్రాంగణాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 ఆగస్టు 28న సాయంత్రం 6:25 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జాతికి అంకితం చేస్తారు. దీంతోపాటు స్మారకం వద్ద నిర్మించిన మ్యూజియం గ్యాలరీలను కూడా ఆయన ప్రారంభిస్తారు. ఈ ప్రాంగణం నవీకరణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలు కూడా ఇక్కడ ప్రదర్శించబడతాయి.

ఇప్పటిదాకా చేపట్టిన చర్యలు

   నిరుపయోగ భవనాలతోపాటు అవసరాలకు తగినట్లు వాడనివాటిని తిరిగి వాడుకునే సానుకూల పునర్వినియోగ విధానంలో నాలుగు మ్యూజియం గ్యాలరీలను సృష్టించారు. ఆ కాలంలో పంజాబ్‌లో చోటు చేసుకున్న ఉదంతాల చారిత్రక ప్రాధాన్యాన్ని ఈ గ్యాలరీలు చాటిచెబుతాయి. ఇందుకోసం దృశ్య-శ్రవణ సమ్మేళన సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌, 3డి రెప్రంజెంటేషన్‌, శిల్ప-చిత్రరూపాలతో ఏర్పాట్లు చేశారు. అలాగే 1919 ఏప్రిల్‌ 13నాటి సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపడం కోసం ‘సౌండ్‌ అండ్‌ లైట్‌’ ప్రదర్శన కూడా ఉంటుంది.

   వేకాకుండా ఈ ప్రాంగణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టబడ్డాయి. పంజాబ్‌ స్థానిక వాస్తుశైలిలో వారసత్వ సంపద పునరుద్ధరణ పనులు కూడా విస్తృతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అమరవీరుల బావిని మరమ్మతు చేసి, వినూత్న అదనపు నిర్మాణంతో  పునరుద్ధరించారు. బాగ్‌ మధ్యలోని జ్వాల స్మారకాన్ని కూడా మరమ్మతుచేసి, పునరుద్ధరించారు. అక్కడి వనరును తామర తటాకంగా రూపుదిద్ది, రెండువైపులా దారిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దారు. అనేక కొత్త, ఆధునిక సదుపాయాలను కూడా కల్పించారు. సముచిత సూచికలతో నడక మార్గాలను కొత్తగా రూపొందించారు. వ్యూహాత్మక ప్రదేశాల్లో విద్యుత్‌ వెలుగులు ఏర్పాటు చేశారు. స్థానిక మొక్కలతో ఆ ప్రదేశం మొత్తాన్ని, కట్టడ సహితంగా తోట అంతటా శ్రవణ పరికరాలు ఏర్పాటు చేశారు. రక్షిత ప్రదేశాన్ని, అమర జ్యోతిని, జెండా వేదిక తదితరాల కోసం కొత్త ప్రదేశాలను కూడా అభివృద్ధి చేశారు.

   ప్రధానమంత్రి రాక నేపథ్యంలో కేంద్ర సాంస్కృతిక శాఖ, గృహ-పట్టణ వ్యవహారాల శాఖ మంత్రులు, సాంస్కృతిక శాఖ సహాయమంత్రి, పంజాబ్‌ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రిసహా  హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులతోపాటు పంజాబ్ నుంచి పార్లమెంటు ఉభయసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, జలియన్ వాలా బాగ్ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

 

***


(Release ID: 1749358) Visitor Counter : 230