హోం మంత్రిత్వ శాఖ
ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొని ఉన్న భద్రతా పరిస్థితుల నేపథ్యంతో ఆదేశ పౌరులు ఇకపై ఈ-వీసాలతో మాత్రమే భారతదేశంలోకి అనుమతి
प्रविष्टि तिथि:
25 AUG 2021 11:56AM by PIB Hyderabad
ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుతం నెలకొని ఉన్న భద్రతా పరిస్థితుల నేపథ్యంలో.. ఈ-ఎమర్జెన్సీ ఎక్స్-ఎంఐఎస్‌సీ వీసా విధానాన్ని ప్రవేశపెట్టారు. తద్వారా వీసా ప్రక్రియ క్రమబద్ధీకరించడంతో ఇకపై ఆఫ్ఘనిస్థాన్ జాతీయులు ఈ-వీసాపై మాత్రమే భారతదేశంలోకి అనుమతించాలని నిర్ణయించారు.
ఆఫ్ఘన్ జాతీయులకు సంబంధించి గతంలో జారీ చేసిన కొన్ని పాస్‌పోర్ట్‌లు గల్లంతయ్యాయన్న నివేదికలను దృష్టిలో ఉంచుకుని.. ప్రస్తుతం భారతదేశంలో లేని ఆఫ్ఘన్ జాతీయులందరికీ గతంలో జారీ చేసిన వీసాలు తక్షణం చెల్లుబాటు కానివిగా ప్రకటించడం జరిగింది. దీంతో ఇకపై
భారతదేశానికి వెళ్లాలనుకునే ఆఫ్ఘన్ జాతీయులు www.indianvisaonline.gov.in లో ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
***
(रिलीज़ आईडी: 1748919)
आगंतुक पटल : 288
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam