ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ కళ్యాణ్ సింహ్ కన్నుమూత పట్ల ప్రసార మాధ్యమాల కు ప్రధాన మంత్రి జారీ చేసిన ప్రకటన

శ్రీ కళ్యాణ్ సింహ్ కు శ్రద్ధాంజలిఘటించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


కళ్యాణ్ సింహ్ గారు.. జన కల్యాణం కోసం పాటుపడిన నేత, ఆయన ను దేశం అంతటా సదా ప్రశంసించడంజరుగుతుంది: ప్రధాన మంత్రి

Posted On: 22 AUG 2021 4:27PM by PIB Hyderabad

ఇది మనకు అందరికి ఒక దు:ఖభరిత ఘడియ. కళ్యాణ్ సింహ్ గారి తల్లితండ్రులు ఆయన కు కళ్యాణ్ సింహ్ అని పేరు పెట్టారు. ఆయన తన తల్లితండ్రులు తనకు పెట్టిన పేరు ను సార్థకం అయ్యేటటువంటి మార్గం లో తన జీవనాన్ని గడిపారు. ఆయన తన యావత్తు జీవనాన్ని ప్రజల కళ్యాణం కోసం అంకితం చేశారు; మరి ఆయన దానినే తన జీవన మంత్రం గా చేసివేసుకొన్నారు. ఆయన తనను తాను భారతీయ జనతా పార్టీ కోసం, భారతీయ జన సంఘ్ కోసం, అలాగే మరి దేశం యొక్క ఉజ్జ్వల భవిష్యత్తు కోసం సమర్పణం చేశారు.

భారతదేశం మూలమూల న కళ్యాణ్ సింహ్ గారి పేరు విశ్వాసానికి మరో పేరు గా మారిపోయింది. ఆయన నిబద్ధత కలిగినటువంటి ఒక నిర్ణేత; తన జీవన పర్యంతం ప్రజల కళ్యాణం కోసం పాటుపడుతూ వచ్చారు. ఆయన కు అప్పగించిన ఏ బాధ్యత ను నిర్వర్తించడం లో అయినా సరే.. అది ఒక శాసనసభ్యుని పదవి కావచ్చు, లేదా ప్రభుత్వం లో ఒక హోదా కావచ్చు, లేదా ఒక గవర్నరు గా కావచ్చు.. ఆయన ఇతరుల కు ఒక ప్రేరణ గా నిలచారు. సామాన్య ప్రజానీకం దృష్టి లో నమ్మకానికి ఒక గుర్తు గా ఆయన ఉండిపోయారు.

 

దేశ ప్రజలు ఒక విలువైనటువంటి వ్యక్తి ని, ఒక సమర్థుడైన నాయకుడి ని కోల్పోయారు. ఆయన ఆదర్శాల ను అనుసరించడం ద్వారా, ఆయన కలల ను సాకారం చేయడం ద్వారా ఆయన లేని లోటు ను భర్తీ చేసుకొనేందుకు మనం ప్రయత్నాలు చేయవలసివుంది. ఆయన ఆత్మ ను ఆశీర్వదించవలసిందిగా, ఆయన లేని లోటు ను తట్టుకొనే సహన శక్తి ని ఆయన కుటుంబానికి ప్రసాదించవలసిందిగా కూడాను భగవాన్ శ్రీ రాముడి ని నేను ప్రార్థిస్తున్నాను. దు:ఖిస్తున్న వారందరి తో పాటు, ఆయన విలువల పట్ల, ఆయన ఆదర్శాల పట్ల, భారతదేశం సంస్కృతి- సంప్రదాయాల పట్ల నమ్మకం కలిగిన వారి కి సైతం భగవాన్ శ్రీ రాముడు శక్తి ని ఇవ్వు గాక.

 

అస్వీకరణ: ప్రధాన మంత్రి ప్రసంగానికి ఇది ఉజ్జాయింపు అనువాదం. సిసలు ఉపన్యాసం హిందీ భాష లో సాగింది.

****

DS/VK/AK

 

 



(Release ID: 1748172) Visitor Counter : 151