ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా 57.61 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ
కోలుకున్నవారు 97.54%; 2020 మార్చి తరువాత ఇదే అత్యధికం
గత 24 గంటల్లో 34,457 కొత్త కోవిడ్ కేసులు
ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసులు 3,61,340; ఇది151 రోజుల అత్యల్పం
చికిత్సలో ఉన్నవి మొత్తం కేసుల్లో 1.12%. మార్చి 2020 తరువాత అత్యల్పం
రోజువారీ పాజిటివిటీ 2.00%, 26 రోజులుగా 3% లోపు
Posted On:
21 AUG 2021 10:13AM by PIB Hyderabad
గత 24 గంటలలో 36,36,043 డోసులు ఇవ్వగా భారతదేశమంతటా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 57.61 కోట్లు దాటింది. 64,01,385 శిబిరాల ద్వారా మొత్తం 57,61,17,350 టీకా డోసుల పంపిణీ పూర్తయినట్టు ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం సూచిస్తోంది. అ వివరాలు ఇలా ఉన్నా యి:
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
1,03,52,796
|
రెండో డోస్
|
81,87,062
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
1,82,99,850
|
రెండో డోస్
|
1,24,76,020
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
21,37,85,511
|
రెండో డోస్
|
1,84,75,457
|
45-59 వయోవర్గం
|
మొదటి డోస్
|
12,18,54,173
|
రెండో డోస్
|
4,80,82,007
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొదటి డోస్
|
8,30,11,132
|
రెండో డోస్
|
4,15,93,342
|
మొత్తం
|
57,61,17,350
|
టీకాల పరిధిని విస్తరించి దేశవ్యాప్తంగా వేగంగా అమలు చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. గత 24 గంటలలో 36,347 మంది బాధితులు కోలుకోగా ఇప్పటిదాకా 3,15,97,982మందికోలుకున్నారు. దేశ వ్యాప్తంగా కోలుకున్నవారి శాతం గత 24 గంటల్లో 97.54% కు చేరుకోవటం విశేషం. 2020 మార్చి నుమకి కోలుకున్నవారి శాతం ఇదే అత్యధికం
గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 34,457 కొత్త కేసులు నమోదయ్యాయి. 55 రోజులుగా కొత్త కేసులు 50 వేల లోపే ఉంటున్నాయి. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి కృషి ఫలితంగానే ఈ ధోరణి నమోదవుతోంది.
పెద్ద సంఖ్యలో కోలుకున్నవారు నమోదవటం, కొత్త కేసులు తక్కువగా ఉండటం వలన చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుతూ 3,61,340 కి చేరింది. ఇది 151 రోజుల అత్యల్పం. మొత్తం కేసుల్లో చికిత్సలో ఉన్నవి ప్రస్తుతం 1.12% మాత్రమే. ఇది మార్చి 2020 తరువాత అత్యల్పం.
కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో 17,21,205 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన మొత్తం పరీక్షలు 50.45 కోట్లకు పైగా (50,45,76,158) అయ్యాయి. ఒక వైపు పరీక్షలు పెరుగుతూ ఉండగా మరోవైపు పాజిటివిటీ తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం 1.98% కాగా ఇది 57 రోజులుగా 3% లోపు ఉంటోంది. రోజువారీ పాజిటివిటీ 2.00 % కు చేరగా వరుసగా 26 రోజులుగా 3% లోపు, 75 రోజులుగా 5% లోపే ఉంటోంది.
****
(Release ID: 1747895)
Visitor Counter : 211
Read this release in:
Tamil
,
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Malayalam