ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
అత్యధికంగా ఒకరోజులోనే 88.13 లక్షల టీకా డోసుల పంపిణీ
దేశవ్యాప్తంగా 55 కోట్ల మైలురాయి దాటిన టీకా డోసుల పంపిణీ
97.51% గా నమోదైన కోలుకున్నవారి శాతం; 2020 మార్చి తరువాత అత్యధికం
గత 24 గంటల్లో 25,166 కొత్త కోవిడ్ కేసులు
ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసులు 3,69,846; 146 రోజుల అత్యల్పం
చికిత్సలో ఉన్న కేసులు, మొత్తం కేసుల్లో 1.15%. మార్చి 2020 తరువాత అత్యల్పం
రోజువారీ పాజిటివిటీ 1.61%, 22 రోజులుగా 3% లోపు
Posted On:
17 AUG 2021 10:31AM by PIB Hyderabad
గత 24 గంటలలో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 88.13 లక్షల టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇది ఒకరోజులో ఇచ్చిన అత్యధిక టీకాలు. భారతదేశమంతటా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 55 కోట్ల మైలురాయి దాటింది. 62,12,108 శిబిరాల ద్వారా మొత్తం 55,47,30,609 టీకా డోసుల పంపిణీ పూర్తయినట్టు ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం సూచిస్తోంది.
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
1,03,50,941
|
రెండో డోస్
|
81,20,754
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
1,82,86,002
|
రెండో డోస్
|
1,22,44,940
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
20,20,24,963
|
రెండో డోస్
|
1,61,02,484
|
45-59 వయోవర్గం
|
మొదటి డోస్
|
11,87,86,699
|
రెండో డోస్
|
4,64,06,915
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొదటి డోస్
|
8,17,46,204
|
రెండో డోస్
|
4,06,60,707
|
మొత్తం
|
55,47,30,609
|
సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్తదశ జూన్ 21న ప్రారంభమైంది. టీకాల పరిధిని విస్తరించి దేశవ్యాప్తంగా వేగంగా అమలు చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. దేశ వ్యాప్తంగా కోలుకున్నవారి శాతం గత 24 గంటల్లో 97.51% కు చేరుకోవటం విశేషం. కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి కోలుకున్నవారి శాతం ఇదే అత్యధికం కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి ఇప్పటిదాకా 3,14,48,754 మందికోలుకున్నారు. గత 24 గంటలలో 36,830 మంది బాధితులు కోలుకున్నారు.
గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 25,166 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది 154 రోజుల అత్యల్పం. 50 రోజులుగా కొత్త కేసులు 50 వేల లోపే ఉంటున్నాయి. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి కృషి ఫలితంగానే ఈ ధోరణి నమోదవుతోంది.
దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్నవారు 3,69,846 మంది. ఇది 146 రోజుల అత్యల్పం. చికిత్సలో ఉన్న కేసులు మొత్తం పాజిటివ్ కేసులలో 1.15% మాత్రమే
కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో 15,63,985 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన మొత్తం పరీక్షలు 49.66 కోట్లకు పైగా (49,66,29,524) అయ్యాయి. ఒక వైపు పరీక్షలు పెరుగుతూ ఉండగా మరోవైపు పాజిటివిటీ తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం 1.98% కాగా ఇది 53 రోజులుగా 3% లోపు ఉంటోంది. రోజువారీ పాజిటివిటీ 1.61% కు చేరగా వరుసగా 22 రోజులుగా 3% లోపు, 71రోజులుగా 5% లోపే ఉంటోంది.
.
****
(Release ID: 1746619)
Visitor Counter : 229
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam