ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా 54.58 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ

97.48% గా నమోదైన కోలుకున్నవారి శాతం

గత 24 గంటల్లో 32,937 కొత్త కోవిడ్ కేసులు
ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసులు 3,81,947; మొత్తం కేసుల్లో 1.18%
రోజువారీ పాజిటివిటీ 2.79%; 21 రోజులుగా 3% లోపే

Posted On: 16 AUG 2021 10:55AM by PIB Hyderabad

భారతదేశమంతటా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 54.58  కోట్లు దాటింది. 61,54,235 శిబిరాల ద్వారా మొత్తం  54,58,57,108 టీకా డోసుల పంపిణీ పూర్తయినట్టు ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం సూచిస్తోంది. గత 24 గంటలలో 17,43,114 టీకాలిచ్చారు.  ఆ వివరాలు ఇలా ఉన్నాయి:      

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,03,50,751

రెండో డోస్

81,00,615

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,82,78,787

రెండో డోస్

1,21,73,133

18-44 వయోవర్గం

మొదటి డోస్

19,68,99,466

రెండో డోస్

1,54,10,416

45-59 వయోవర్గం

మొదటి డోస్

11,73,89,912

రెండో డోస్

4,57,91,230

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

8,11,53,834

రెండో డోస్

4,03,08,964

మొత్తం

54,58,57,108

 

సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్తదశ జూన్ 21న ప్రారంభమైంది. టీకాల పరిధిని విస్తరించి దేశవ్యాప్తంగా  వేగంగా అమలు   చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. దేశ వ్యాప్తంగా కోలుకున్నవారి శాతం గత 24 గంటల్లో 97.48 % కు చేరుకోవటం విశేషం. కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి కోలుకున్నవారి శాతం ఇదే అత్యధికం కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి ఇప్పటిదాకా  3,14,11,924 మందికోలుకున్నారు. గత 24 గంటలలో 35,909 మంది బాధితులు కోలుకున్నారు.

.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001WV5K.jpg

 

 గత 24 గంటలలో దేశవ్యాప్తంగా  32,937 కొత్త కేసులు నమోదయ్యాయి. 50  రోజులుగా కొత్త కేసులు 50 వేల లోపే ఉంటున్నాయి. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి కృషి ఫలితంగానే ఈ ధోరణి నమోదవుతోంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002FY85.jpg

ప్రస్తుత దేశవ్యాప్తంగా చికిత్సలో  ఉన్నవారు 3,81,947 మంది. చికిత్సలో ఉన్న కేసులు మొత్తం పాజిటివ్ కేసులలో 1.18% మాత్రమే

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0034J31.jpg

కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో 11,81,212 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన మొత్తం పరీక్షలు 49.48  కోట్లకు పైగా (49,48,05,652) అయ్యాయి. ఒక వైపు పరీక్షలు పెరుగుతూ ఉండగా మరోవైపు పాజిటివిటీ  తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం  2.01% కాగా రోజువారీ పాజిటివిటీ  2.79%  అయింది. వరుసగా 21  రోజులుగా 3% లోపు,  70 రోజులుగా ఇది 5% లోపే ఉంటోంది.

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0045K5M.jpg

****


(Release ID: 1746314) Visitor Counter : 251