ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి నాడు ఆయన కు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి

Posted On: 16 AUG 2021 9:32AM by PIB Hyderabad

పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు నివాళులు అర్పించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

 

‘‘ఆప్యాయభరితం అయినటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని మనం స్మరించుకొంటున్నాం; ఆయన స్నేహశీల స్వభావాన్ని మనం స్మరించుకొంటున్నాం; ఆయన వాక్చాతుర్యాన్ని, హాస్య ప్రియత్వాన్ని మనం స్మరించుకొంటున్నాం; మన దేశ ప్రగతి కి ఆయన అందించిన తోడ్పాటు ను మనం స్మరించుకొంటున్నాం.

 

అటల్ గారు మన పౌరుల మనసులలో, మస్తిష్కాలలో కొలువై ఉన్నారు. ఈ రోజు న ఆయన వర్ధంతి నాడు నేను సదైవ్ అటల్స్థలానికి వెళ్లి, ఆయన కు నివాళులు అర్పించాను’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH



(Release ID: 1746296) Visitor Counter : 199