యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
2017-18, 2018-19 సంవత్సరాలకు 22 మందికి అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జాతీయ యువజన అవార్డులను బహుకరించిన కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్
భారతీయ యువత ఆత్మనిర్భర్ ఆవిష్కరణలకు చోదకులు: శ్రీ అనురాగ్ ఠాకూర్
ఎస్.ఒ.ఎల్.వి.ఇ.డి ఛాలెంజ్ లో గెలుపొందిన వారికి కూడా అవార్డులు బహుకరించిన శ్రీ అనురాగ్ ఠాకూర్
2017-18 సంవత్సరం ఎన్‌వైఎ కు మొత్తం 14 అవార్డులు, 2018-19 సంవత్సరం ఎన్‌వైఎకు 8 అవార్డులు బహుకరణ
ఈ అవార్డులో భాగంగా ఒక సర్టిఫికేట్, వ్యక్తులకు అయితే లక్ష రూపాయల నగదు, సంస్థలకు రూ 3లక్షల నగదు బహుమతి ఇస్తారు.
Posted On:
12 AUG 2021 2:56PM by PIB Hyderabad
కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ 2017-18, 2018-19 సంవత్సరానికి నేషనల్ యూత్ అవార్డులను ఈరోజు విజ్ఞాన్ భవన్‌లో అందజేశారు. 2021 అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటూ, వ్యవసయార ఎంటర్‌ప్రైజ్ ఛాలెంజ్ ఎస్.ఒ.ఎల్.బి.ఇ.డి 2021 కి సంబంధించినపది మంది యువ పారిశ్రామకవేత్త ల బృందాన్ని సత్కరించారు. క్రిడల మంత్రిత్వశాకకు చెందిన కార్యదర్శి, శ్రీమతి ఉషాశర్మ, యుఎన్ రెసిడెంట్ కోర్డినేటర్ డీర్డే బాయ్‌డాండ్, జాయింట్ సెక్రటరీ యువజన వ్యవహారాలుశ్రీ అసిత్ సింగ్ లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ శ్రీ అనురాగ్ ఠాకూర్, “ఈ రోజు అంతర్జాతీయ యువజన దినోత్సవం. ఐక్యరాజ్యసమితి దీనిని ప్రకటించింది. అంతర్జాతీయ యువజన దినోత్సవం అనేది కేలండర్‌లో కేవలం మరో రోజు లాంటిది కాదు
భారతదేశ యువత, భారత దేశ భవిష్యత్తు, ముఖ్యంగా భారతదేశ వర్తమానం కూడా. వీరు ప్రస్తుత కృత్రిమ మేధ ఆవిష్కరణల ఆత్మనిర్భర ఆవిష్కరణల కాలంలో వినూత్న ఆలోచనలు ఆవిష్కరణలకు చోదకశక్తి వంటి వారు ” అని ఆయన అన్నారు.
ఈ సంవత్సరం అంతర్జాతీయ యువజనదినోత్సవ థీమ్ ఆహార వ్యవస్థల పరివర్తనపై దృష్టిపెడుతోంది. ఈ పరివర్తనకు యువత కీలకం. యువత నేతృత్వంలోని అగ్రిటెక్ ఆవిష్కరణలు ఈ రంగంలో నూతన ధోరణులకు చోదకశక్తిగా ఉంటున్నాయి. ఇలాంటి అంతర్జాతీయ కృషి యువత అర్ధవంతమైన భాగస్వామ్యం లేకుండా సాధించడం కుదరదు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మొదీ నాయకత్వంలో ప్రభుత్వం వృత్తి విద్య, నైపుణ్యాభివృద్ధి, యువత సారధ్యం వహించే స్టార్టప్‌లకు ఫండింగ్, వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తున్నది. ప్రపంచంలోనే అతి పెద్ద సంఖ్యలో నైపుణ్యాలు కలిగిన వారిగా భారతీయయువతను తీర్చిదిద్దేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ యువజన అవార్డులను గెలుచుకున్న వారిని అభినందించారు. ఆయా రంగాలో యువత అత్యంత ప్రతిభ కనబరచేందుకు ప్రోత్సహించడానికి ప్రేరణగా ఈ అవార్డులు పనికి వస్తాయని ఆయన అన్నారు.
ఈ సందర్బంగా శ్రీమతి డీర్డే బాయ్డ్ మాట్లాడుతూ ప్రపంచంతో భాగస్వామ్యం వహించడానికి ఇండియాకు ఎంతో ఉందని అన్నారు. ఇండియాలో ఎంతోమంది నైపుణ్యం కల యువకులు ఉన్నారన్నారు. యువత మార్పును ప్రభావితం చేయగలరని, దేశ ప్రగతికి వినూత్న ఆలోచనలు చేయగలరని అన్నారు. సుస్థిరాభివృద్ధికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువత కీలకపాత్ర పోషించగలదని అన్నారు.
యువజనవ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీమతి ఉషా శర్మ మాట్లాడుతూ మార్పుతీసుకువచ్చేవారుగా భారతీయ యువత బహుముఖపాత్ర పోషిస్తున్నారని అన్నారు. యువ ఎంటర్‌ప్రెన్యుయర్లు, నిస్వార్ధ వాలంటీర్లు కమ్యూనిటీ ప్రయోజనాలను కాపాడుతున్నారన్నారు.
మొత్తం 22 జాతీయ యువజన అవార్డులను వ్యక్తిగత స్థాయిలో, సంస్థాగత స్థాయిలో అందజేశారు. మొత్తం 14 అవార్డులను ఎన్‌వైఎ 2017-18 కు సంబంధించి అందజేశారు. ఇందులో 10 అవార్డులు వ్యక్తిగత కేటగిరీలో,4 అవార్డులు సంస్థాగత కేటగిరీలో ఉన్నాయి. 2018-19 నేషనల్ యూత్ అవార్డ్స్ (ఎన్ వై ఎ) కింద ఏడు అవార్డులు వ్యక్తిగత కేటగిరీలో, 1 అవార్డు సంస్థాగత కేటగిరీలో అందజేయడం జరిగింది. వ్యక్తిగత అవార్డు కింద ఒక పతకం, సర్టిఫికేట్,నగదు బహుమతి గా లక్ష రూపాయలు , సంస్థాగత కేటగిరీలో రూ 3,00,000 నగదు బహుమతి అందజేస్తారు.
టేబుల్ వ్యక్తిగత
అవార్డులు గెలుపొందిన వారి వివరాలు
NYA 2017-18
క్రమ
సంఖ్య
|
పేరు
|
రాష్ట్రం
|
వ్యక్తిగత
|
-
|
శ్రీమతి సౌరభ్న వన్‌డే |
మహారాష్ట్ర
|
-
|
శ్రీహిమాంన్షు కుమార్ గుప్త
|
మధ్యప్రదేశ్
|
-
|
శ్రీ అనిల్ ప్రధాన్
|
ఒడిషా
|
-
|
శ్రీమతి దేవిక మాలిక్
|
హర్యానా
|
-
|
శ్రీమతి నేహాకుష్వాహా
|
ఉత్తరప్రదేశ్
|
-
|
శ్రీచేతన్ మహడు పర్‌దేశి
|
మహరాష్ట్ర
|
-
|
శ్రీ రంజిత్ సింగ్ సంజయ్‌సింగ్ రాజ్‌పుత్
|
మహరాష్ట్ర
|
-
|
శ్రీ మహమ్మద్ అజమ్
|
తెలంగాణ
|
-
|
శ్రీ మనిష్ కుమార్‌దవే
|
రాజస్థాన్
|
-
|
శ్రీపరదీప్ మహకలా
|
హర్యానా
|
ఆర్గనైజేషన్
|
-
|
మన ఊరు మన బాధ్యత,
|
ఆంధ్రప్రదేశ్
|
-
|
యువదీక్షా కేంద్ర
|
గుజరాత్
|
-
|
తోజహన్
|
తమిళనాడు
|
-
|
సినర్జీ సంస్థాన్
|
మధ్యప్రదేశ్ |
NYA 2018-19
క్రమ
సంఖ్య
|
పేరు
|
రాష్ట్రం
|
వ్యక్తిగత
|
-
|
శ్రీ సుభం చౌహాన్,
|
మధ్యప్రదేశ్
|
-
|
శ్రీ గుణజీ మండ్రేకర్
|
గోవా
|
-
|
శ్రీ అజయ్ ఒలి
|
ఉత్తరాఖండ్
|
-
|
శ్రీ సిద్దార్థ్‌రాయ్
|
మహారాష్ట్ర
|
-
|
శ్రీప్రహర్ష్ మోహన్‌లాల్ పటేల్
|
గుజరాత్
|
-
|
శ్రీమతి దివ్యకుమారి జైన్
|
రాజస్థాన్
|
-
|
శ్రీయశ్వీర్ గోయల్
|
పంజాబ్
|
ఆర్గనైజేషన్
|
-
|
లాడ్లి ఫౌండేషన్ ట్రస్్ట,
|
న్యూఢిల్లీ
|
నేషనల్ యూత్ అవార్డు పొందినవారికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.,..
,యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ, యువజన వ్యవహారాల విభాగం నేషనల్ యువజన అవార్డులను (ఎన్‌వైఎ) వ్యక్తిగత స్థాయిలో (15 నుంచి 29 సంవత్సరాల మధ్య), అభివృద్ధి, సామాజిక సేవ , ఆరోగ్యం, మానవహక్కుల ప్రోత్సాహం, క్రియాశీల పౌర కార్యకలాపాలు, కమ్యూనిటీ సర్వీసు వంటి పలు రంగాలలో విశేష కృషి చేసిన సంస్థలకు జాతీయ యువజన అవార్డులు అందజేస్తుంది.
జాతీయ అభివృద్ధికి సంబంధించి వివిధ రంగాలలో యువతకు ప్రేరణ కలిగించేందుకు , యువతకు కమ్యూనిటీపట్ల బాధ్యతను పెంపొందించేందుకు వారిని ఈ దిశగా ప్రోత్సహించేందుకు ఉత్తమ పౌరులుగా వారి వ్యక్తిగత శక్తిసామర్ద్యాలను పెంచేందుకు , వారు చేసిన విశేషకృషికి తగిన గుర్తింపునిచ్చేందుకు , యువజనులతో కలిసి స్వచ్ఛంద కార్యకలాపాలు నిర్వహిస్తూ సామాజిక సేవ, జాతీయ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలను ప్రోత్సహించడం ఈ అవార్డుల లక్ష్యం.
ఎస్.ఒ.ఎల్.వి.ఇ.డి చాలెంజ్ అవార్డు పొందిన వారిని కింద పేర్కొనడం జరిగింది.
క్రమ
సంఖ్య
|
పేరు
|
|
1
|
హెచ్. నిక్కి కుమార్ ఝా
|
|
2
|
. ఉత్కర్ష్ వత్స
|
|
3
|
దివ్యరాజ్‌సింహ్‌జల
|
|
4
|
వినోజ్ పి ఎ రాజ్
|
|
5
|
కిరణ్ త్రిపాఠి
|
|
6
|
వినోద్ కుమార్ సాహు
|
|
7
|
హలక్ విశాల్ షా
|
|
8
|
బుడ్డల రుషికేశ్
|
|
9
|
అహమెర్ బషిర్ షా
|
|
10
|
అమన్ జైన్
|
----
యువజన వ్యవహారాలు ,క్రీడల మంత్రిత్వశాఖ ఐక్యరాజ్యసమితి వలంటీర్లు, ఐక్యరాజ్య సమితి డవలప్‌మెంట్ ప్రోగ్రాంతో కలిసి ఎస్.ఒ.ఎల్ .వి.ఇ.డి ఛాలెంజ్‌ను డిసెంబర్ 2020లో ప్రారంభించింది. ఇది గ్రామీణ, సబ్ అర్బన్, అర్బన్ ప్రాంతాలలో వినూత్న ఆవిష్కరణలను అగ్రి ఫుడ్ చెయిన్‌లో యువజనుల నాయకత్వంలోని ఎంటర్‌ప్రెన్యుయర్ పరిష్కారాలను గుర్తించడం. ఇందుకు సంబంధింఇచ 850 మందికి పైగా యువత దేశవ్యాప్తంగా దరఖాస్తుచేసుకున్నారు. పలు రౌండ్లలో పోటీలు, శిశ్రీణ అనంతరం జమ్ముకాశ్మీర్, బీహార్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, కర్ణాటక,గుజరాత్ రాష్ట్రాల నుంచి 10 మంది విజేతలు గా నిలిచారు.
ఎస్.ఒ.ఎల్.వి.ఇ.డి చాలెంజ్ అవార్డు పొందిన వారికి సంబంధించి మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి..
(Release ID: 1745365)
Visitor Counter : 269
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam