జౌళి మంత్రిత్వ శాఖ

చేనేత వస్తువుల ఉత్పత్తి విలువ మూడేళ్లలో దాదాపు రూ. 60 వేల కోట్ల నుండి రూ .1.25 లక్షల కోట్లకు పెరగాలి: కేంద్రమంత్రి పీయుష్- గోయల్


–ప్రస్తుత ఎగుమతుల విలువ రూ. 2500 కోట్లుకాగా,దీనిని రూ. 10 వేల కోట్లకు పెంచాలని పిలుపు

–జాతీయ చేనేత దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు

–లక్ష్యాన్ని సాధించడానికి అన్ని విధాలా పురోగతిని మెరుగుపరిచేలా మార్గాలను సిఫారసు చేయడానికి చేనేత కార్మికులు, శిక్షకులు, పరికరాల తయారీదారులు, మార్కెటింగ్ నిపుణులు ఇతర వాటాదారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తారు.

–చేనేత వస్త్రాల పరిశ్రమ స్థాయి వృద్ధికి తదుపరి స్థాయికి తీసుకెళ్లాలి:- పీయుష్గోయల్

–రాష్ట్ర మద్దతుపై ఎక్కువగా ఆధారపడకుండా ఈ రంగం తగినంత బలంగా అభివృద్ధి చెందాలి:- గోయల్

–చేనేత కళల గ్రామాలను జమ్మూకశ్మీర్లోని కనిహామా, కేరళలోని కోవళం, అసోంలోని మొహపర, గోలాఘాట్ వద్ద ఏర్పాటు చేశారు.

–మంత్రులు గోయల్, దర్శనా జర్దోష్ ఏడో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తమిళనాడులోని కాంచీపురంలో డిజైన్ రిసోర్స్ సెంటర్ , ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్లో వీవర్స్ సర్వీస్ సెంటర్‌ని ప్రారంభించారు.

Posted On: 07 AUG 2021 5:13PM by PIB Hyderabad

చేనేత రంగం మార్కెట్ విలువను మూడేళ్లలో రూ. 60 వేల కోట్ల రూపాయల నుండి లక్షా 25 వేల కోట్ల రూపాయలకు పెంచడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర జౌళి, వాణిజ్యం  పరిశ్రమ, వినియోగదారుల వ్యవహారాలు & ఆహారం,  ప్రజా పంపిణీశాఖల మంత్రి పీయుష్గోయల్  చెప్పారు.  వచ్చే మూడేళ్లలో చేనేత వస్తువుల ఎగుమతులను 2,500 కోట్ల రూపాయల నుండి 10వేల కోట్ల రూపాయలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన అన్నారు. ఢిల్లీలో ఇక్కడ నిర్వహించిన 7 వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన  గోయల్, చేనేత రంగం  స్థిరమైన అభివృద్ధిని సాధించేలా చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని,  చేనేత కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేస్తే వారి హస్తకళలు దేశానికి గర్వకారణం అవుతాయని అన్నారు.

చేనేత రంగం తన  లక్ష్యాలను సాధించడానికి,  అన్ని విధాలా మెరుగుపరచడానికి మార్గాలను సిఫారసు చేయడానికి  చేనేత కార్మికులు, శిక్షకులు, పరికరాల తయారీదారులు, మార్కెటింగ్ నిపుణులు  ఇతర వాటాదారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. మన సాంస్కృతిక వారసత్వంలో చేనేత రంగానికి విశిష్ట స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు. శతాబ్దాలుగా నేతపని,  డిజైనింగ్ నైపుణ్యాల మధ్య అనుబంధం వల్ల ఇది నిలకడగా ఉందని వ్యాఖ్యానించారు.  1905 ఆగస్టులో జరిగిన కోల్‌కతా టౌన్ హాల్ సమావేశంలో దేశీయ ఉత్పత్తులు,  ఉత్పత్తి ప్రక్రియల పునరుద్ధరణ లక్ష్యంగా స్వదేశీ ఉద్యమం ప్రారంభమయిందని వివరించారు. ఈ చారిత్రక సందర్భాన్ని స్మరించుకోవడానికి  మన చేనేత సంప్రదాయాన్ని గౌరవించడానికి  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2015 లో ఆగస్టు 7 వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించారని తెలిపారు. భారతీయ చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి  “మై హ్యాండ్‌లూమ్ మై ప్రైడ్ ఎక్స్పో”ను  ప్రచారం చేశారని అన్నారు. వారి గొప్పతనాన్ని చాటిచెప్పారన్నారు.  చేనేత రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరూ కనీసం ఒక చేనేత వస్తువును కొనుగోలు చేయాలని మంత్రి  కోరారు.

కోవలం, తిరువనంతపురం (కేరళ, మొహపారా గ్రామం),  గోలాఘాట్ (అస్సాం)  కనిహామా, బుద్గాం, (శ్రీనగర్‌) మూడు హస్తకళల గ్రామాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేసినందుకు ఎన్హెచ్డీసీని అభినందించారు.   దేశీయ,  అంతర్జాతీయ పర్యాటకులను ఇవి ఆకట్టుకుంటున్నాయని, కార్మికుల ఆదాయం పెంచుతాయని అన్నారు. ఈ ప్రాంతాల్లోని ప్రసిద్ధ చేనేత & హస్తకళ ఉత్పత్తులను ప్రోత్సహిస్తాయని చెప్పారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త  ఆలోచనలతో, తాజా సాంకేతిక పురోగతితో ఈ రంగాన్ని పునరుజ్జీవింపజేయాలని  గోయల్ చేనేత అభివృద్ధి సంస్థకు సూచించారు. ప్రభుత్వ సహకారం లేకుండా ఈ రంగం తన కాళ్లపై ఎలా నిలబడగలదో తెలివిగా ఆలోచించడం చాలా ముఖ్యం అని ఆయన అన్నారు. ‘మనల్ని మనం ఆత్మనిర్భరంగా మార్చుకోవడం ద్వారా భారతదేశాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చవచ్చుఅని కామెంట్ చేశారు.   మంత్రులు గోయల్, దర్శన్   ఈ సందర్భంగా తమిళనాడులోని కాంచీపురంలో డిజైన్ రిసోర్స్ సెంటర్  ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌ఘర్‌లో వీవర్స్ సర్వీస్ సెంటర్ భవనాన్ని సంయుక్తంగా ప్రారంభించారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా వర్చువల్ బయ్యర్ సెల్లర్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది.

  ఈ సందర్భంగా కేంద్ర జౌళి,  రైల్వే శాఖ మంత్రి  దర్శన జర్దోష్ మాట్లాడుతూ చేనేత రంగంలో 70శాతం మందికి కార్మికులు మహిళలే ఉంటాయని, ఇది వారి సాధికారతకు రంగం అని అన్నారు. వోకల్ ఫర్  లోకల్ కింద స్థానిక కళాకారులను ప్రోత్సహించడం మనందరి బాధ్యత అని ఆమె అన్నారు.  జౌళి మంత్రిత్వ శాఖ కార్యదర్శి  యుపి సింగ్  మాట్లాడుతూ చేనేత నేత కార్మికులు,  హస్తకళల కళాకారుల కోసం డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (ఎంఈఐటీవై కింద) సమన్వయంతో ఒక ఈ–-కామర్స్ పోర్టల్ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇది  నేత కార్మికులు, కళాకారులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి వీలు కల్పిస్తుంది. చేనేత రంగాన్ని ఆదుకోవడానికి  విస్తృత మార్కెట్‌ను ప్రారంభించడానికి,  నేత కార్మికుల కోసం  ప్రభుత్వమే ఈ–-మార్కెట్ ప్లేస్ (జీఎమ్) అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. దీనివల్ల  నేత కార్మికులు తమ ఉత్పత్తులను నేరుగా వివిధ ప్రభుత్వ శాఖలకు విక్రయించడానికి వీలవుతుంది. జీఎమ్ పోర్టల్‌లో ఇప్పటివరకు దాదాపు 1.50 లక్షల మంది నేత కార్మికులు చేరారని సింగ్ చెప్పారు.   జాతీయ చేనేత దినోత్సవానికి హాజరయ్యేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేత కార్మికులతో పీయుష్ గోయల్, దర్శన జర్దోష్ సంభాషించారు. అశోకా హోటల్లోని  కన్వెన్షన్ హాల్ లో వివిధ రకాల చేనేత ఉత్పత్తుల ఎగ్జిబిషన్ కూడా నిర్వహించడం జరిగింది.  ప్రధాన మంత్రి పిలుపు మేరకు, జాతీయ స్థాయి - “మై హ్యాండ్‌లూమ్ మై ప్రైడ్ ఎక్స్పో” ఏడో జాతీయ వేడుకలను   డిల్లీ హాట్, ఐఎన్ఎలో  నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌డిసి) 2021 ఆగస్టు 1 నుండి 20 ఆగస్టు 20 వరకు నిర్వహిస్తోంది.  చేనేత వస్తువుల కంపెనీలు, నేత కార్మికులు ఇక్కడ చేనేత ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు  ప్రదర్శిస్తున్నారు. 22 రాష్ట్రాలకు చెందిన 125కిపైగా చేనేత సంస్థలు/ జాతీయ అవార్డు గ్రహీతలు ఎక్స్పోలో పాల్గొంటున్నారు. ఎగ్జిబిషన్ ఆగష్టు 15, 2021 నుంచి పదిహేను రోజుల పాటు ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది  10 వేల మందికి పైగా ప్రజలు ఎగ్జిబిషన్‌ని సందర్శిస్తారు. భారతదేశంలోని కొన్ని దూరప్రాంతాల నుండి సేకరించిన చేనేత ఉత్పత్తులు ఇక్కడ అమ్మకానికి ఉన్నాయి. 2021 ఆగస్టు 7 నుండి 11 వరకు “మై హ్యాండ్‌లూమ్ మై ప్రైడ్ ఎక్స్పో”ను హ్యాండ్‌లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ హోటల్ లీలా ప్యాలెస్ సమీపంలోని న్యూ మోతీ బాగ్‌లోని కమ్యూనిటీ హాల్‌లో నిర్వహిస్తుంది.

***


(Release ID: 1744209) Visitor Counter : 235