ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్యప్రదేశ్‌లోని పి.ఎం.జి.కె.ఏ.వై. లబ్ధిదారులతో ఆగష్టు, 7వ తేదీన సంభాషించనున్న - ప్రధానమంత్రి
Posted On:
05 AUG 2021 6:59PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ కు చెందిన ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పి.ఎం.జి.కె.ఏ.వై) లబ్ధిదారులతో, 2021 ఆగష్టు, 7వ తేదీ ఉదయం 11 గంటలకు, దృశ్య మాధ్యమం ద్వారా సంభాషిస్తారు.
రాష్ట్రంలో అర్హులైన వ్యక్తులందరూ, ప్రయోజనం పొందే విధంగా, ఈ పథకం గురించి మరింత అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం, 2021 ఆగష్టు, 7వ తేదీని, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన దినోత్సవంగా జరుపుకుంటోంది.
మధ్యప్రదేశ్‌లో, పి.ఎం.జి.కె.ఏ.వై. పథకం కింద 4.83 కోట్ల మంది లబ్ధిదారులు 25,000 కు పైగా చవక ధరల దుకాణాల నుండి ఉచిత రేషన్ పొందుతున్నారు.
ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగు భాయ్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, త్రిపుర, హర్యానా, గోవా రాష్ట్రాల నుండి ఆహార రంగానికి సంబంధించిన మంత్రులు, అధికారులు కూడా పాల్గొననున్నారు.
*****
(Release ID: 1742956)
Visitor Counter : 233
Read this release in:
Manipuri
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam