ప్రధాన మంత్రి కార్యాలయం

టోక్యో ఒలింపిక్స్ 2020 లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు భారతదేశం పురుషుల హాకీ జట్టు ను అభినందించిన ప్రధాన మంత్రి

Posted On: 05 AUG 2021 9:46AM by PIB Hyderabad

టోక్యో ఒలింపిక్స్ 2020 లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు భారతదేశ పురుషుల హాకీ జట్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలిపారు. ఈ సాహస కృత్యం ద్వారా వారు యావత్తు దేశ ప్రజల లో, ప్రత్యేకించి మన యువత లో ఉత్సాహాన్ని నింపివేశారు అని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

 

‘‘ చరిత్రాత్మకం! ఈ రోజు భారతదేశం లో ప్రతి ఒక్కరికి సదా ఒక జ్ఞాపకం గా ఉండిపోతుంది. కాంస్య పతకాన్ని మాతృభూమి కి తీసుకు వస్తున్నందుకు మన పురుషుల హాకీ జట్టు కు ఇవే అభినందన లు. ఈ అసాధారణ కార్యాన్ని సాధించి వారు యావత్తు దేశ ప్రజల దృష్టి ని , ప్రత్యేకించి మన యువతీయువకుల దృష్టి ని వారి వైపునకు తిప్పివేసుకొన్నారు మరి వారు ఉత్సాహం పెల్లుబుకింది. మన హాకీ జట్టు ను చూసుకొని భారతదేశం గర్వపడుతూ ఉన్నది.  ’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

 

 

***

DS/SH


(Release ID: 1742698) Visitor Counter : 224