ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని ‘ ప్ర‌ధాన‌ మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న యోజ‌న ’ ల‌బ్ధిదారుల‌ తో రేపటి రోజు న, అంటే ఆగస్టు 5 న, మాట్లాడ‌నున్న‌ ప్ర‌ధాన‌ మంత్రి

Posted On: 04 AUG 2021 9:27AM by PIB Hyderabad
ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని ‘ప్ర‌ధాన‌ మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న యోజ‌న’ ల‌బ్ధిదారుల‌ తో ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గురువారం నాడు (ఆగ‌స్టు 5 వ తేదీ న) మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌ కు  వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడ‌నున్నారు.

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ గురువారం నాడు ప్ర‌ధాన‌ మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న దినోత్స‌వాన్ని నిర్వ‌హించనుంది.  ఈ ప‌థ‌కం ప్ర‌యోజ‌నాల ను అందుకోకుండా ఏ ఒక్క‌రూ మిగిలిపోకూడదు అనే విధం గా చూడటం కోసం రాష్ట్ర వ్యాప్తం గా ఒక చైత‌న్య కార్య‌క్ర‌మాన్ని పెద్ద ఎత్తు న ప్రారంభించనున్నారు.

‘ ప్ర‌ధాన‌ మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న యోజ‌న’ ద్వారా దాదాపు గా 15 కోట్ల మంది ల‌బ్ధిదారుల‌ు రేశన్ ను ఉచితం గా అందుకొంటున్నారు.  రాష్ట్రం లో సుమారు గా 80 వేల‌ పైచిలుకు చౌక‌ ధ‌ర‌ ల దుకాణాలు ఈ పథకం ల‌బ్ధిదారుల‌ కు ఆహార‌ ధాన్యాల ను పంపిణీ చేస్తున్నాయి.

ఈ సందర్భం లో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ యోగి ఆదిత్య‌నాథ్ కూడా పాలుపంచుకోనున్నారు.



 
***

(Release ID: 1742215) Visitor Counter : 190