యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

పారా ఒలింపిక్స్ థీమ్ సాంగ్‌ను విడుదల చేసిన క్రీడా శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్


మీరు కల కనగలిగితే, మీరు సాధించవచ్చు: శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్

Posted On: 03 AUG 2021 4:10PM by PIB Hyderabad

ముఖ్య అంశాలు :

·         "కర్ దే కమల్ తు" పాటను దివ్యాంగ్ క్రికెట్ ప్లేయర్ సంజీవ్ సింగ్ స్వరపరిచి  పాడారు

·         ఈసారి రికార్డు స్థాయిలో   9 విభిన్న క్రీడలలో పాల్గొంటున్న 54 మంది పారా అథ్లెట్లు 

పారా ఒలింపిక్స్ భారత బృందం కోసం రూపొందించిన "కర్ దే కమల్ తు" పాటను కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ  మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈ రోజు న్యూ ఢిల్లీలో విడుదల చేశారు. కార్యక్రమంలో  కార్యదర్శి (క్రీడలు)శ్రీ రవి మిట్టల్,  సంయుక్త  సెక్రటరీ (క్రీడలు) శ్రీ ఎల్ఎస్ సింగ్, భారత పారా ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలు  డాక్టర్ దీపా మాలిక్, సెక్రటరీ జనరల్ శ్రీ గురు చరణ్ సింగ్ మరియు చీఫ్ ప్యాట్రన్  అవినాష్ రాయ్ ఖన్నా కూడా పాల్గొన్నారు.

"కర్ దే కమల్ తు" పాటను   లక్నో నివాసి అయిన దివ్యాంగ క్రికెట్ క్రీడాకారుడు సంజీవ్ సింగ్ స్వర కల్పన చేసి పాడారు.  దివ్యాంగుల సామర్ధ్యాన్ని గుర్తించి అందరికి తెలియజేయాలన్న లక్ష్యంతో భారత పారా ఒలింపిక్  సంఘం ఈ చర్య తీసుకుంది. పాట  సాహిత్యం క్రీడాకారులకు స్ఫూర్తి ఇచ్చే విధంగా ఉంది.  మాత్రమే కాకుండా, ఎలాంటి వైకల్యం కలిగి ఉన్న తాము శక్తిసామర్ద్యల్లో ఎవరికీ తక్కువగా ఉండమని తాము  అద్భుతాలను  సృష్టించగలమని ప్రతి ఒక్కరికీ తెలియజేసే విధంగా పాటకు రూపకల్పన చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ అనురాగ్ ఠాకూర్ టోక్యోలో జరగనున్న పారా ఒలింపిక్స్ కు భారత్ ఈ సారి అతి పెద్ద బృందాన్ని పంపుతున్నదని తెలిపారు. తొమ్మిది క్రీడా అంశాలలో 54 మంది పారా-క్రీడాకారులు దేశం తరఫున పాల్గొంటారని ఆయన చెప్పారు. భారత్ క్రీడాకారుల క్రీడల్లో ఇచ్చే ప్రదర్శన చూపే ప్రతిభపై దేశ ప్రజలందరూ ఆసక్తితో ఉన్నారని మంత్రి అన్నారు. ప్రతిభ కనబరుస్తున్న పారా క్రీడాకారులు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కల్పిస్తారని మంత్రి అన్నారు. 130 కోట్ల భారతీయులకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న అంశాన్ని గుర్తించి క్రీడాకారులు ప్రతిభ కనబరచాలని ఆయన కోరారు. టోక్యో పారా ఒలింపిక్స్ లో క్రీడాకారులు ప్రతిభ చూపించి దేశానికి గౌరవం తెస్తారన్న ధీమాను మంత్రి వ్యక్తం  చేశారు. క్రీడలు, క్రీడాకారుల సంక్షేమానికి  ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్న మంత్రి రియో 2016 పారా ఒలింపిక్స్ లో పాల్గొన్న క్రీడాకారులను కలుసుకున్నారని తెలిపారు. అన్ని సౌకర్యాలను కల్పించి పోటీలకు సిద్ధం కావడానికి సహకరించిన పారా ఒలింపిక్ సంఘం, సంఘం అధ్యక్షురాలు దీపా మల్లిక్ లను మంత్రి అభినందించారు. 

పాట స్వరకర్త మరియు గాయకుడు సంజీవ్ సింగ్ మాట్లాడుతూ పాట తనకు మాత్రమే కాకుండా మొత్తం సమాజానికి గర్వకారణమని అన్నారు. రియో 2016 పారా గేమ్స్‌లో  డాక్టర్ దీపా మాలిక్ సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆమెపై రాసిన ఒక కవిత పాటగా మారిందని  సంజీవ్ సింగ్ చెప్పారు. "ఈ పాట పారా అథ్లెట్లకు బాగా రాణించడానికి స్ఫూర్తినిస్తుందని నేను ఆశిస్తున్నాను. వారు ఇప్పటికే  జీవితంలో విజేతలుగా నిలిచారు.  కానీ ఒక పతకం దేశం మొత్తం వారిని గుర్తించి , దేశం గర్వపడేలా చేస్తుంది. "అని  సంజీవ్ చెప్పారు.   

భారత పారా ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు దీపా మాలిక్ మాట్లాడుతూ దేశంలో అతి తక్కువ కాలంలో పారా క్రీడలకు గుర్తింపు, ప్రాచుర్యం కలిగిందని అన్నారు.  ఈ క్రీడలను భారతదేశ  ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని అన్నారు. క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపే విధంగా థీమ్ సాంగ్ రూపొందిందని అన్నారు. పాటను ప్రతి ఒక్కరు విని, క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. 

ఈ పాట క్రీడాకారులను ప్రేరేపిస్తూ  దేశం మొత్తం తమ వెనుక ఉందన్న భావన కల్పిస్తుందని పీసీఐ సెక్రటరీ జనరల్ మిస్టర్ గురు చరణ్ సింగ్ అన్నారు. ఈ పాత ద్వారా క్రీడాకారులు స్ఫూర్తి పొంది క్రీడల్లో భారత దేశ జెండాను ఎగర వేయాలని ఆయన కోరారు. 

ఈసారి రికార్డు స్థాయిలో 54 మంది పారా అథ్లెట్లు 9 విభిన్న క్రీడల్లో పాల్గొనబోతున్నారు. చాలా మంది అథ్లెట్లు ప్రపంచ రికార్డు ప్రదర్శనతో పోటీలకు  అర్హత సాధించారు.  దీనితో పతకాలను సాధిస్తుందన్న అంచనాలతో భారత బృందం పారా ఒలింపిక్స్ బరిలోకి దిగుతున్నది.  

 

***



(Release ID: 1742041) Visitor Counter : 124