ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన సమావేశం అయిన జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్ఎంసీ)
ముందు నిర్ణయించిన ప్రకారం 2023 మొదటి భాగంలో రోడ్‌మ్యాప్ ప్రకారం నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (NExt) నిర్వహణకు ప్రయత్నాలు: 2022లో ప్రయోగాత్మకంగా పరీక్ష నిర్వహణ
వైద్య విద్య నాణ్యతను మెరుగు పరిచి, పారదర్శక పరీక్షా విధాన రూపకల్పన, ఆరోగ్య సేవల మెరుగుదలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: శ్రీ మన్సుఖ్ మాండవీయ
Posted On:
30 JUL 2021 3:23PM by PIB Hyderabad
ఈ రోజు కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్ఎంసీ) సమీక్షా సమావేశం జరిగింది. వైద్య విద్యకు సంబంధించిన పలు అంశాలను సమావేశంలో చర్చకు వచ్చాయి.
ముందు నిర్ణయించిన ప్రకారం 2023 మొదటి భాగంలో రోడ్‌మ్యాప్ ప్రకారం నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (NExt)ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. విధానాన్ని పరీక్షించడానికి మరియు వైద్య విద్యార్థులలో ఆందోళనను తొలగించడానికి 2022 లో ప్రయోగాత్మకంగా పరీక్షను నిర్వహించాలని నిర్ణయించామని అధికారులు వివరించారు. NExT (దశ 1 మరియు 2) ఫలితాలను
(i) క్వాలిఫైయింగ్ ఫైనల్ ఎంబీబీస్ పరీక్ష.
(ii) భారతదేశంలో ఆధునిక వైద్యం అందించడానికి లైసెన్స్ పొందడం.
(iii) బ్రాడ్ స్పెషాలిటీలలో పిజి సీట్లను మెరిట్ ఆధారంగా కేటాయించడం కోసం పరిగణనలోకి తీసుకునే అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చాయి.
ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా NExT ని ఏ విధంగా నిర్వహించాలి, దీనికోసం ఎటువంటి చర్యలు అమలు చేయాలి అన్న అంశాలపై కూడా సమావేశంలో చర్చలు జరిగాయి. భారతదేశంలో లేదా ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికీ NExT ఒకే విధంగా ఉంటుంది. విదేశీ వైద్య గ్రాడ్యుయేట్ల (ఎఫ్ఎమ్ జి) / మ్యూచువల్ రికగ్నిషన్ సమస్య దీని ద్వారా పరిష్కారం అవుతుంది.
సమావేశంలో మాట్లాడిన శ్రీ మన్సుఖ్ మాండవీయ వైద్య విద్య నాణ్యతను మెరుగు పరిచి, పారదర్శక పరీక్షా విధాన రూపకల్పన, ఆరోగ్య సేవల మెరుగుదలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ లక్ష్యాల సాధనకు సంబంధిత వర్గాలతో కలసి పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు.
నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గురించి:
నాణ్యమైన వైద్య విద్యకు అందరికీ అందుబాటులోకి తెచ్చి దేశంలోని అన్ని ప్రాంతాల్లో వైద్య నిపుణుల సేవలు లభించేలా చేసి దేశంలో అందరికి సమానమైన మరియు సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ అందించాలన్న లక్ష్యంతో పార్లమెంటు ఆమోదం తో 25.9.2020 నుండి అమల్లోకి వచ్చిన నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్, 2019 ద్వారా ఎన్ఎంసి స్థాపించబడింది.
వైద్య విద్య నాణ్యత, ప్రమాణాలను మెరుగుపరచడానికి అవసరమైన నిబంధనలను, విధానాలను రూపొందించడం, వైద్య సంస్థలు, వైద్య పరిశోధనలు మరియు వైద్య నిపుణులను నియంత్రించే విధానాలను రూపొందించడం, ఆరోగ్యం మరియు ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కోసం మానవ వనరులతో సహా ఆరోగ్య సంరక్షణలో అవసరాలను అంచనావేసి వీటిని అందుబాటులోకి ఇవ్వడానికి కార్యాచరణ సిద్ధం చేయడం, కమిషన్, అటానమస్ బోర్డులు మరియు రాష్ట్రాల వైద్య బోర్డులు సక్రమంగా పనిచేయడానికి అవసరమైన నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించి అమలు చేసే అంశాలను నేషనల్ మెడికల్ కమిషన్ పర్యవేక్షిస్తోంది. స్వయంప్రతిపత్త బోర్డుల మధ్య సమన్వయాన్ని సాధించడానికి కూడా నేషనల్ మెడికల్ కమిషన్ కృషి చేస్తుంది.
స్వయంప్రతిపత్త బోర్డులు తీసుకునే నిర్ణయాలపై నిర్ణయాలకు సంబంధించి ఎన్ఎంసి అప్పీలేట్ అధికారంతో పనిచేస్తుంది. వైద్య వృత్తిలో వృత్తిపరమైన నైతిక విలువలను పాటించడం కోసం అవసరమైన విధానాలు నిబంధనలకు రూపకల్పన చేసి వాటిని అమలు చేస్తూ వైద్య నిపుణులు సేవలు అందించే సమయంలో అనుసరించవలసిన నైతిక ప్రవర్తనా నియమావళిని ఎన్ఎంసి అమలు చేస్తుంది.
***
(Release ID: 1740770)
Visitor Counter : 222