ప్రధాన మంత్రి కార్యాలయం
ఒబిసిలకు, ఆర్థికం గా బలహీనమైన వర్గాల వారికి వైద్య కోర్సుల లో రిజర్వేషన్ నుకల్పించడానికి ప్రభుత్వం నిర్ణయించడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
29 JUL 2021 4:54PM by PIB Hyderabad
అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్/ డెంటల్ కోర్సులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్/ డెంటల్ కోర్సుల కు ఉద్దేశించిన అఖిల భారత కోటా పథకం లో ఒబిసి లకు 27 శాతం రిజర్వేషను ను, ఆర్థికం గా బలహీనమైనటువంటి వర్గాల వారికి 10 శాతం రిజర్వేషను ను వర్తమాన విద్య సంవత్సరం నుంచి కల్పించాలని ప్రభుత్వం మహత్తర నిర్ణయాన్ని తీసుకోవడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పొగడారు.
‘‘అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్/ డెంటల్ కోర్సులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్/ డెంటల్ కోర్సుల కు ఉద్దేశించిన అఖిల భారత కోటా పథకం లో ఒబిసి లకు 27 శాతం రిజర్వేషను ను, ఆర్థికం గా బలహీనమైనటువంటి వర్గాల వారికి 10 శాతం రిజర్వేషను ను వర్తమాన విద్య సంవత్సరం నుంచి కల్పించాలని మా ప్రభుత్వం మహత్తర నిర్ణయాన్ని తీసుకొంది.
ఇది మన యువతీయువకులు ప్రతి సంవత్సరం లోనూ చక్కని అవకాశాల ను పొందడం లో వారికి ఎనలేని సహాయాన్ని అందించడం తో పాటు మన దేశం లో సామాజిక న్యాయానికి సంబంధించి ఒక సరికొత్త విశిష్ట నమూనా ను కూడా ఆవిష్కరించనుంది ’’ అని ప్రధాన మంత్రి పలు ట్వీట్ లలో పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1740361)
आगंतुक पटल : 254
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam