ప్రధాన మంత్రి కార్యాలయం

‘ఇంటర్నేశనల్ టైగర్ డే’ నాడు వన్యప్రాణుల ప్రేమికుల కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 29 JUL 2021 10:32AM by PIB Hyderabad

వన్యప్రాణుల ను ప్రేమించే వారి కి, ప్రత్యేకించి పులుల ను సంరక్షించే విషయం లో ఎక్కువ గా మక్కువ ను కనబరచే వారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అంతర్జాతీయ పులుల దినం సందర్భం లో అభినందన లు తెలిపారు.


‘‘ #InternationalTigerDay సందర్బం లో వన్యప్రాణి ప్రేమికులకు ప్రత్యేకించి పులుల సంరక్షణ పట్ల ఎక్కువ మక్కువ కలిగినటువంటి వారికి ఇవే అభినందన లు. ప్రపంచం అంతటా ఉన్న వ్యాఘ్రాల సంతతి లో 70 శాతానికి పైగా వ్యాఘ్రాల కు భారతదేశం ఆశ్రయాన్ని ఇస్తోంది. మనం మరొక్క సారి మన పులుల కు సురక్షితమైన ప్రాకృతిక ఆవాసాలు లభించేటట్లుగా చూడడం లో, పులుల కు అనుకూలం గా ఉండేటటువంటి ఇకో-సిస్టమ్ ను ప్రోత్సహించడం లో మన నిబద్ధత ను ఈ సందర్భంలో పునరుద్ఘాటించుదాం.


భారతదేశం లో పులుల కు 51 అభయారణ్యాలు ఉన్నాయి. ఆ అభయారణ్యాలు 18 రాష్ట్రాల లో విస్తరించి ఉన్నాయి. పులుల లెక్కింపు ను కడపటి సారి గా 2018 వ సంవత్సరం లో చేపట్టడం జరిగింది. దాని ద్వారా పులుల సంఖ్య పెరుగుతోందని తేలింది. పులుల సంరక్షణ అంశం లో సెంట్ పీటర్స్ బర్గ్ ప్రకటనపత్రం లో ఖరారు చేసిన కాలపరిమితి ని దృష్టి లో పెట్టుకొని భారతదేశం పులుల సంతతి ని రెండింతలు చేసే లక్ష్యాన్ని నాలుగు సంవత్సరాలు ముందుగానే సాధించింది.


పులుల ను సంరక్షించే అంశం లో భారతదేశం అనుసరిస్తున్నటువంటి వ్యూహం లో స్థానిక సముదాయాల కు అన్నింటి కంటే అధిక ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతోంది. మనం మన ఈ ఘనమైన గ్రహాన్ని వృక్ష జంతుజాలం తో కలసి పంచుకొంటూ ఉన్నాం; అంతే కాదు, మనం వృక్ష జంతుజాలం పట్ల సామరస్య భావన తో మనుగడ ను సాగించాల్సివుందని బోధిస్తున్న శతాబ్దాల నాటి మన ప్రాచీన సంప్రదాయాన్నుంచి ప్రేరణ ను కూడా పొందుతున్నాం. ’’ అని ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో పేర్కొన్నారు.

***

DS/SH



(Release ID: 1740237) Visitor Counter : 229