ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ మరణాలు: అపోహలూ, వాస్తవాలూ


ఆస్పత్రులలో ఆడిట్ జరిపి లెక్కలోకి రాని మరణాలు నమోదు చేయాలని రాష్ట్రాలకు తరచూ కేంద్రం సూచనలు

కోవిడ్ మరణాల నమోదుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సులకు అనుగుణంగా ఐసిఎంఆర్ మార్గదర్శకాలు పాటిస్తున్న భారత్
కోవిడ్ మరణాల నమోదుకు భారత్ కు సమగ్రవ్యవస్థ ఉంది

Posted On: 22 JUL 2021 11:01AM by PIB Hyderabad

భారతదేశంలో కోవిడ్ మరణాల సంఖ్య భారీగా ఉండి ఉంటుందని, ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన సంఖ్య చాలా తక్కువ అని ఈ మధ్య కాలంలో కొన్ని మీడియా సంస్థలు వార్తలు వెలువరించాయి.

కొన్ని ఇటీవలి అధ్యయనాలు, అమెరికా, ఐరోపా దేశాలలో వయోవర్గాలవారీ మరణాలను వాడుకుంటూ ఈ లెక్కలు కట్టినట్టు అందులో పేర్కొన్నారు. అయితే  వైరస్ సోకిన వారిలో ఎంతమంది మరిణిస్తారనేదనేది అన్ని దేశాల్లోనూ ఒకే విధంగా ఉంటుందన్న అభిప్రాయంతో ఇలాంటి మరణాల లెక్కలు కట్టటం చాలా దారుణం. జాతి, తెగ, ప్రాంతం, ఆ జనాభా జీనోమ్ నిర్మాణం , గతంలో వ్యాధులకు లోనైన చరిత్ర, సంబంధిత రోగ నిరోధకత లాంటి అనేక అంశాలమీద ఆధారపడి వైరస్ సోకిన వారిలో మరణాలు ఆధారాపడి ఉంటాయన్న కనీస పరిజ్ఞానాన్ని మరచి అలాంటి వార్తలు వెలువరించారు.

 

పైగా సీరో ఏ మేరకు ఉన్నదనే అధ్యయనాలు కేవలం వ్యాధి దానికి అనువుగా ఉన్న జనాభాలో మరింత వ్యాప్తి చెందే అవకాశం లేకుండా తీసుకోవాల్సిన  చర్యలను సూచించటమే కాకుండా మరణాలను అంచనా వేయటానికి కూడా వాడతారు.  పైగా భవిష్యత్తులో రోగనిరోధకత తగ్గే ప్రమాదాన్ని మరణాలను ప్రభావితం చేసే అవకాశాన్ని అంచనా వేయటానికి కూడా పనికొస్తుంది. పైగా ఈ వార్తలలో అదనపు మరణాలన్నీ కోవిడ్ మరణాలేనని తేల్చారు. ఇది వాస్తవాల ప్రాతిపదికన జరిగింది కాదు. అందుకే ఆ వార్తల్లో పేర్కొన్న ఇన్ఫెక్షన్ మరణాల సంఖ్య పూర్తిగా అవాస్తవం. అన్ని కారణాలతో మరణిమ్చిన వారిని కూడా కోవిడ్ లెక్కల్లో కలపటం కేవలం ప్రజలను తప్పుదారి పట్టించటమే.

 

వైరస్ సోకిన వారి ఆనవాలు పట్టటానికి భారత్ కు సరైన వ్యూహం ఉంది. ప్రాథమికంగా సోకినవారికి  లక్షణాలు కనబడినా, కనబడకపోయినా కూడా వారందరికీ కోవిడ్ పరీక్షలు జరిగాయి. ఆర్ టి –పిసి ఆర్ పరీక్షల ద్వారా బైటపడినవారిని కచ్చితమైన బాధితులుగా గుర్తించారు. కేవలం వ్యాధిగ్రస్తులను కలిసిన వారే కాకుండా ఏ మాత్రం అనుమానం ఉన్నా స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకొవటానికి కూడా దేశవ్యాప్తంగా 2700 కు పైగా లాబ్ లు అందుబాటులో ఉన్నాయి. అవాసరానికి తగ్గట్టు చికిత్స చేయించుకోవటానికి ఆస్పత్రులు చేరువలోనే ఉన్నాయి.  

దేశంలో మరణాల నమోదుకు కూడా ఒక నిర్దిష్టమైన వ్యవస్థ, చట్టం ఉండటం వల నిబంధనలకు అనుగుణంగా పరంగా కొన్ని మరణాలు నమోదు కాకుండా పోయి ఉండవచ్చు. కానీ ఇన్ఫెక్షన్ సోకి మరణించిన వారి వివరాలు నమోదు కాకుండా ఉండే అవకాశం లేదు. కోవిడ్ మరణాల శాతం చూసినా అర్థమవుతుంది. 2020 డిసెంబర్ 31నాటికి అది 1.45% కాగా ఆ తరువాత 2021 ఏప్రిల్- మే మధ్యకాలంలో ఆకస్మికంగా పెరిగినప్పుడు 1.34% అయింది.

పైగా, రోజువారీ కొత్త కేసులు, మరణాలు కూడా దిగివ స్థాయి నుంచి తీసుకున్న లెక్కలమీదే ఆధార పడింది. జిల్లాలు రాష్ట్రాలకు, రాష్ట్రాలు కేంద్రానికి తెలియజేస్తాయి. ఇది నిరాటంకంగా జరిగే ప్రక్రియ.  2020 మే నెలలోనే మరణాల సంఖ్య విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరదించుతూ, మరణాలు నమోదు చేయాల్సిన పద్ధతిమీద భారత వైద్య పరిశోధనామండలి (ఐసిఎంఆర్) కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. ఎక్కడైనా పొరపాట్లు దొర్లితే ప్రపంచ ఆరోగ్య సంస్థ  సిఫార్సులకు అనుగుణంగా ఐసిఎమ్ ఆర్ మార్గదర్శకాలు పాటించాలని చెప్పింది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి శ్రీ మన్ సుఖ్ మాందవ్యా నిన్న రాజ్య సభలో ఒక ప్రకటన చేస్తూ, కోవిడ్ మరణాలను కప్పిపెడుతున్నట్టు వస్తున్న ఆరోపణలను ఖండించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం రాష్టాలు పంపిన సమాచారాన్ని క్రోదీకరించటానికే పరిమితమైన విషయాన్ని స్పష్టం చేశారు.

కేంద్ర అరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పదే పదే రాష్ట్రాలకు లేఖల ద్వారా, వీడియో కాన్ఫరెన్సుల ద్వారా, కేంద్ర బృందాలను పంపటం ద్వారా మార్గదర్శకాలకు అనుగుణంగా మరణాలు సక్రమంగా నమోదయ్యేలా చర్యలు తీసుకుంటూనే ఉంది. జిల్లాల వారీగా కచ్చితమైన సమాచారం తెప్పించుకొని రాష్ట స్థాయిలో సరిచూసి పంపాలని కూడా పదే పదే చెబుతూ వస్తోంది. వాటి పరిధిలోని ఆస్పత్రులలో ఆడిట్ చేపట్టటం ద్వారా సంఖ్య నిర్థారించుకోవాల్సిందిగా సూచించింది. రెండో వేవ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలో మొత్తం ఆరోగ్య వ్యవస్థ సమర్థవంతమైన చికిత్స అందించటం మీదనే దృష్టి సారించగా కొన్ని చోట ఆ హడావిడిలో సరైన నమోదు జరగనట్టు మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్ లలో గుర్తించగా ఆ తరువాత సమన్వయం చేసి సవరించారు.

ఇలా అందుకున్న సమాచారాన్ని వెలువరించటమే కాకుండా, చట్టబద్ధంగా దేశంలో జనన, మరణాల నమోదుకు సివిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తోంది. డేటా సేకరణ, సరిచూడట, ప్రచురించటం చేపడుతుంది. ఇది ఎంతో సమయం పట్టే అంశమే అయినా, కచ్చితంగా మరణాలు వదిలేయకుందా నమోదు చేసే వ్యవస్థ.  సమర్థంగా, సమగ్రంగా ఉండేలా ఈ అంకెలు ఆ తరువాత సంవత్సరం ప్రచురించటం పరిపాటి.  

 

 

*****



(Release ID: 1737730) Visitor Counter : 244