ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ సంస్థాన్ గోక‌ర్ణ్ ప‌ర్త‌గాలీ జీవోత్త‌మ్ మ‌ఠాని కి చెందిన ప‌ర‌మ ప‌విత్రులు శ్రీమద్ విద్యాధిరాజ్ తీర్థ్ శ్రీపాద‌ వ‌డేర్ స్వామీజీ క‌న్నుమూత ప‌ట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 19 JUL 2021 8:58PM by PIB Hyderabad

శ్రీ సంస్థాన్ గోక‌ర్ణ్ ప‌ర్త‌గాలి జీవోత్త‌మ్ మ‌ఠాని కి చెందిన ప‌ర‌మ ప‌విత్రులైన‌ శ్రీమద్ విద్యాధిరాజ్ తీర్థ్ శ్రీపాద‌ వ‌డేర్ స్వామీజీ క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

 ‘‘శ్రీ సంస్థాన్ గోక‌ర్ణ్ ప‌ర్త‌గాలి జీవోత్త‌మ్ మ‌ఠాని కి చెందిన ప‌ర‌మ ప‌విత్రులు శ్రీమద్ విద్యాధిరాజ్ తీర్థ్ శ్రీపాద‌ వ‌డేర్ స్వామీజీ క‌న్నుమూశారని తెలుసుకొని దుఃఖిస్తున్నాను.  ఆయ‌న ను స‌మాజాని కి ఆయన చేసిన విస్తృత సేవకు గానుమ‌రీ ముఖ్యం గా ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగాని కి ఆయన అందించినటువంటి సేవ కు గాను స్మ‌రించుకోవడం జరుగుతుంది.  అసంఖ్యాకం గా ఉన్న‌టువంటి ఆయ‌న అనుయాయుల కు ఇదే నా సంతాపం.  ఓమ్ శాంతి’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***


(Release ID: 1737092) Visitor Counter : 143