ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా 40 కోట్ల మైలురాయి దాటిన టీకా డోసుల పంపిణీ


కోలుకున్నవారి శాతం 97.31% కు పెరుగుదల

గత 24 గంటలలో 41,157 కొత్త కేసులు నమోదు
చికిత్సలో ఉన్న కేసులు 4,22,660; మొత్తం కేసుల్లో 1.36%

రోజువారీ పాజిటివిటీ 2.13%; 27 రోజులుగా 3% లోపే

Posted On: 18 JUL 2021 10:25AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 40 కోట్లు దాటింది. 50,46,387 శిబిరాల ద్వారా మొత్తం  40,49,31,715టీకా డోసుల పంపిణీ పూర్తయినట్టు ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం సూచిస్తోంది. గత 24 గంటలలో 51,01,567 టీకాలిచ్చారు.  ఆ వివరాలు ఇలా ఉన్నాయి: 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,02,69,092

రెండో డోస్

75,40,656

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,77,92,396

రెండో డోస్

1,03,48,504

18-44 వయోవర్గం

మొదటి డోస్

12,42,65,428

రెండో డోస్

48,64,609

45-59 వయోవర్గం

మొదటి డోస్

9,74,79,640

రెండో డోస్

2,90,71,946

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

7,20,87,206

రెండో డోస్

3,12,12,238

మొత్తం

40,49,31,715

 

సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్తదశ జూన్ 21న ప్రారంభమైంది. టీకాల పరిధిని విస్తరించి దేశవ్యాప్తంగా  వేగంగా అమలు  

చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి ఇప్పటిదాకా 3,02,69,796 మంది కోలుకున్నారు. గత 24 గంటలలో 42,004 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటువరకూ కోలుకున్నవారి శాతం  97.31% అయంది.

 గత 24 గంటలలో దేశవ్యాప్తంగా  41,157 కొత్త కేసులు నమోదయ్యాయి. 21 రోజులుగా కొత్త కేసులు 50 వేల లోపే ఉంటున్నాయి. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి కృషి ఫలితంగానే ఈ ధోరణి నమోదవుతోంది.

 

చికిత్సలో ఉన్న కేసుల తగ్గుదల కూడా కనబడుతోంది. ప్రస్తుత దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్నవారు 4,22,660 మంది. చికిత్సలో ఉన్న కేసులు మొత్తం పాజిటివ్ కేసులలో 1.36% మాత్రమే.

 

కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో 19,36,709 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన మొత్తం పరీక్షలు 44.39 కోట్లకు పైగా (44,39,58,663) అయ్యాయి. ఒక వైపు పరీక్షలు పెరుగుతూ ఉండగా మరోవైపు పాజిటివిటీ  తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం  2.08% కాగా రోజువారీ పాజిటివిటీ  2.13%  అయింది. వరుసగా 27రోజులుగా ఇది 3% లోపు,  41 రోజులుగా 5% లోపే ఉంటోంది

 

 

****


(Release ID: 1736565) Visitor Counter : 188