వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
పప్పు ధాన్యాల నిల్వలపై విధించిన నిల్వ పరిమితులు, కొన్ని మీడియా వర్గాలలో/ సఓషల్ మీడియాలో ప్రచారం అవుతున్న తప్పుడు సమాచారం పై స్పష్టీకరణ
Posted On:
15 JUL 2021 11:50AM by PIB Hyderabad
పప్పు ధాన్యాల నిల్వల పరిమితులను తొలిగించినట్టు వాట్సాప్ సందేశ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో 2.7.21న పప్పుధాన్యాల నిల్వల పై విధించిన పరిమితులను తొలగించలేదని, అవి అమలులో ఉన్నాయని స్పష్టం చేయడమైంది. ఈ ఉత్తర్వులను రాష్ట్రాలు ఏ విధంగా అమలు చేస్తున్నాయో ప్రభుత్వం నిశితంగా పరిశీలించి, పర్యవేక్షిస్తోంది.
వినియోగదారుల వ్యవహారాల శాఖ అభివృద్ధి చేసిన పోర్టల్ పై నిల్వదారులు ప్రకటించిన నిల్వల, పప్పు ధాన్యాల నిల్వల కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు లేదా దిగుమతిదారులు దిగుమతి చేసిన పరిమాణాల మధ్య ఉన్న అసమతుల్యతలను, అవకతవకలకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం పంచుకుంది. నిల్వ పరిమితులను ఉల్లంఘిస్తున్న అందరిపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్రాలను కోరడమైంది.
***
(Release ID: 1735801)
Visitor Counter : 179