మంత్రిమండలి

అధిక ధరల భ‌త్యం లో, డియర్‌నెస్‌ రిలీఫ్ లో పెంపుద‌ల కు ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 14 JUL 2021 4:03PM by PIB Hyderabad

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల కు ఇచ్చే  అధిక ధరల భ‌త్యాన్ని, పింఛ‌న్ దారుల‌ కు ఇచ్చే డియ‌ర్‌నెస్ రిలీఫ్ ను 2021 జులై 1వ తేదీ నుంచి పెంచి 28 శాతం చేసేందుకు మాన్య ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న గల మంత్రివ‌ర్గ సంఘం ఈ రోజు న స‌మావేశ‌మై ఆమోదాన్ని తెలిపింది.  ఇది మూల వేత‌నం/పింఛ‌న్ లో ఇప్పుడు ఉన్న 17 శాతం రేటు లో 11 శాతం వృద్ధి ని సూచిస్తున్న‌ది.

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల కు ఇచ్చేటటువంటి  అధిక ధరల భ‌త్యం (డిఎ), అలాగే పింఛ‌న్ దారుల కు ఇచ్చేటటువంటి డియ‌ర్ నెస్ రిలీఫ్ (డిఆర్‌) ల‌ మూడు అద‌న‌పు కిస్తుల ను కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి వ‌ల్ల ఉత్ప‌న్న‌మైన మునుపు కని విని ఎరుగ‌నటువంటి స్థితి ని దృష్టి లో పెట్టుకొని నిలుపుద‌ల చేయ‌డం జ‌రిగింది; ఈ మూడు అద‌న‌పు కిస్తు లు వ‌రుస గా 2020 జ‌న‌వ‌రి 1 నుంచి, 2020 జులై 1 నుంచి మరియు 2021 జ‌న‌వ‌రి 1 నుంచి చెల్లించ‌వ‌ల‌సి ఉంది.

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల కు ఇచ్చే డియ‌ర్ నెస్ అల‌వెన్సు ను, అలాగే పింఛ‌న్ దారుల కు ఇచ్చే డియ‌ర్ నెస్ రిలీఫ్ ను 2021 జులై 1వ తేదీ నుంచి అమ‌లు లోకి వ‌చ్చే విధం గా 28 శాతం చేయాలి అని ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం నిర్ణ‌యించింది.  ఇది మూల వేత‌నం/ పింఛ‌న్ లో 17 శాతం గా ఇప్పుడు ఉన్న రేటు లో 11 శాతం పెరుగుద‌ల ను సూచిస్తోంది.  ఈ వృద్ధి 2020 జనవరి 1వ తేదీ, 2020 జులై 1వ తేదీ మరియు 2021 జనవరి 1వ తేదీ లకు ఇవ్వవలసి ఉన్నటువంటి అద‌న‌పు కిస్తుల ను కూడా ప్ర‌తిబింబిస్తోంది.  2020 జ‌న‌వ‌రి 1 మొద‌లుకొని 2021 జూన్ 30 మ‌ధ్య కాలానికి గాను అధిక ధరల భ‌త్యం / డియ‌ర్ నెస్ రిలీఫ్ యొక్క రేటు 17 శాతం వ‌ద్దే య‌థాపూర్వ‌కం గా ఉంటుంది.
 


 

***


(Release ID: 1735546) Visitor Counter : 634