మంత్రిమండలి

కేంద్రీయ జాబితా లోని ఇత‌ర వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల లో ఉప- వ‌ర్గీక‌ర‌ణ అంశాన్ని ప‌రిశీలించ‌డం కోసం రాజ్యాంగ 340వ అధిక‌ర‌ణం ప్రకారం ఏర్పాటు చేసిన సంఘం ప‌ద‌వీకాలాన్ని పొడిగించ‌డానికి ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 14 JUL 2021 4:05PM by PIB Hyderabad

కేంద్రీయ జాబితా లోని ఇత‌ర వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల (ఒబిసి స్) లో ఉప- వ‌ర్గీక‌ర‌ణ అంశాన్ని ప‌రిశీలించ‌డం కోసం రాజ్యాంగం 340వ అధిక‌ర‌ణం ప్రకారం ఏర్పాటు చేసిన సంఘం ప‌ద‌వీకాలాన్ని ఆరు నెల‌ల పాటు అంటే 2021 జులై 31 ని  మించి 2022 జ‌న‌వ‌రి 31 వ‌ర‌కు పొడిగించేందుకు మాన్య ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న ఈ రోజు న సమావేశమైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదాన్ని తెలిపింది.  ఈ సంఘం ప‌ద‌వీకాలాన్ని పొడిగించ‌డం ఇప్ప‌టికి ఇది పదకొండో సారి.

ప్ర‌యోజ‌నాలు

ప‌రిశీల‌న ప‌రం గా చూసిన‌ప్పుడు ప్ర‌తిపాదిత ప‌ద‌వీ కాలం విస్త‌ర‌ణ కు తోడు ఉల్లేఖన నిబంధనల లో అద‌నం గా చేర్చిన అంశం ఈ ‘‘సంఘాని కి’’ వివిధ వ‌ర్గాల ను సంప్ర‌దించిన అనంత‌రం ఒబిసి ల ఉప- వ‌ర్గీక‌ర‌ణ అంశం పై ఒక సంపూర్ణ నివేదిక ను స‌మ‌ర్పించేందుకు వీలు ను క‌ల్పిస్తాయి.

అమ‌లు కు సంబంధించిన షెడ్యూలు:
 
‘‘సంఘం’’ ప‌ద‌వీ కాలాన్ని 2021 జులై 31వ తేదీ దాటిన త‌రువాత 6 నెల‌ల పాటు, 2022 జనవరి 31 వరకు పొడిగించ‌డాని కి సంబంధించిన ఉత్త‌ర్వు ను రాష్ట్రప‌తి ఆమోదం ల‌భించిన అనంత‌రం అధికారికం గా ప్ర‌క‌టించ‌డం జ‌రుగుతుంది.



 

***



(Release ID: 1735544) Visitor Counter : 249