యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
టోక్యో ఒలింపిక్స్ 2020 కోసం భారత జట్టు సన్నద్ధతను సమీక్షించిన శ్రీ అనురాగ్ ఠాకూర్ అధ్యక్షతన సమావేశమైన ఉన్నత స్థాయి కమిటీ
నాడు పోస్టు చేయడమైనది:
12 JUL 2021 5:05PM by PIB Hyderabad
టోక్యో ఒలింపిక్స్ 2020లో పాల్గొనడానికి భారత జట్టు చేస్తున్న సన్నాహాలను ఈ రోజు న్యూఢిల్లీలో యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ అధ్యక్షతన జరిగిన ఏడవ ఉన్నత స్థాయి సమావేశం సమీక్షించింది. యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీ నిషిత్ ప్రమానిక్ ఈ సమావేశానికి హాజరయ్యారు. క్రీడల శాఖ కార్యదర్శి శ్రీ రవి మిట్టల్, సాయ్ డిజి శ్రీ సందీప్ ప్రధాన్, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు శ్రీ నరీందర్ బాత్రా, క్రీడల శాఖ సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశంలో టోక్యో ఒలింపిక్స్‌కు ఎంపికైన క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి కల్పించవలసిన సౌకర్యాలతో సహా వివిధ అంశాలను చర్చించారు.

చీర్ ఫర్ ఇండియా కార్యక్రమ నిర్వహణతో పాటు క్రీడాకారులతో జూలై 13వ తేదీన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జరిపే సమావేశ నిర్వహణకు తీసుకోవలసిన చర్యలపై అధికారులతో శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ చర్చలు జరిపారు. క్రీడలు ప్రారంభం కాకముందే భారత క్రీడాకారులతో సమావేశమై వారిని ఉత్సాహ పరచడానికి టోక్యో ఒలింపిక్స్ కు ఎంపిక అయిన వారితో సమావేశం కావాలని ప్రధానమంత్రి నిర్ణయించారు. క్రీడాకారులతో ప్రధానమంత్రి మధ్య జరిగే సంభాషణ దూరదర్శన్ తో పాటు వివిధ ప్రభుత్వ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
***
(రిలీజ్ ఐడి: 1734863)
సందర్శకుల సూచీ సంఖ్య : : 253
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam