ప్రధాన మంత్రి కార్యాలయం

టోక్యో-2020 కోసం భారతదేశ దళానికి అందిస్తునన సౌకర్యాల తాలూకు సన్నాహకాల పై సమీక్ష ను నిర్వహించిన ప్రధాన మంత్రి


ఒలింపిక్స్ కు వెళ్లబోయే క్రీడాకారుల తో జులై 13న ప్రధాన మంత్రి మాట్లాడనున్నారు; వారికి ఆయన శుభాకాంక్షలను తెలియజేస్తారు

प्रविष्टि तिथि: 09 JUL 2021 1:51PM by PIB Hyderabad

టోక్యో-2020 కోసం భారతదేశ దళానికి అందజేసే సౌకర్యాల తాలూకు సన్నాహాల పై ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సమీక్ష ను నిర్వహించారు.  ఒలింపిక్ క్రీడోత్సవాల కు వెళ్లబోయే క్రీడాకారుల తో జులై 13 న ప్రధాన మంత్రి మాట్లాడనున్నారు; వారికి ఆయన శుభాకాంక్షల ను తెలియజేస్తారు.

ప్రధాన మంత్రి తన ట్వీట్ లలో  ఇలా అన్నారు..
‘‘ @Tokyo2020 లో పాలుపంచుకొనే భారతదేశ క్రీడాకారుల దళానికి అందజేసే  సదుపాయాల తాలూకు సన్నాహాల ను సమీక్షించాను.  లాజిస్టికల్ డిటెయిల్స్, వారికి టీకామందు ను ఇప్పించడం ఎంతవరకు వచ్చింది, వారికి అనేక కోణాల లో అందిస్తున్నటువంటి సహాయాన్ని గురించి చర్చించాను.

నేను 130 కోట్ల మంది భారతీయుల పక్షాన జులై 13 న ఒలింపిక్ క్రీడల కు వెళ్లే క్రీడాకారుల తో మాట్లాడబోతున్నాను.  అలాగే వారికి శుభాకాంక్షల ను కూడా తెలియజేస్తాను.  రండి మనం అందరం కలసి #Cheer4India అని పలుకుదాం. ’’

 

***

DS/SH


(रिलीज़ आईडी: 1734339) आगंतुक पटल : 227
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam