మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

యునైటెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యుడిఎస్ఇ +) 2019-20 నివేదికను విడుదల చేసిన కేంద్ర విద్యా శాఖ మంత్రి


పాఠశాల విద్య, విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి, బాలికల నమోదు స్థాయిలలో స్థూల నమోదు నిష్పత్తి (జిఈఆర్ ) మెరుగైనట్టు నివేదిక వెల్లడి

Posted On: 01 JUL 2021 1:27PM by PIB Hyderabad

భారతదేశంలో పాఠశాల విద్యపై రూపొందిన యునైటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యుడిఎస్ +) 2019-20 నివేదికను కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఈ రోజు విడుదల చేశారు.

2018-19తో పోల్చి చూస్తే 2019-20లో పాఠశాల విద్య అన్ని స్థాయిలలో స్థూల నమోదు నిష్పత్తి మెరుగుపడింది.పాఠశాల విద్యారంగంలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి (పిటిఆర్) కూడా మెరుగుపడిందని నివేదిక వెల్లడించింది. 

ప్రాధమిక విద్య పూర్తిచేసుకుని ఉన్నత మాధ్యమిక విద్యలో చేరుతున్న బాలికల సంఖ్యా 2019-20లో పెరిగిందని నివేదికలో పేర్కొన్నారు. 2019-20లో ప్రాధమిక నుండి ఉన్నత మాధ్యమిక విద్య కోసం 12.50 కోట్లకు పైగా  బాలికలు  నమోదు చేసుకున్నారు.  2018-19తో పోలిస్తే  సంఖ్య గణనీయంగా 14.08 లక్షలకు పైగా పెరిగింది. 2012-13 మరియు 2019-20ల  మధ్య సెకండరీ మరియు హయ్యర్ సెకండరీ స్థాయిలలో లింగ సమానత్వ సూచిక (జిపిఐ) మెరుగుపడింది.


గత ఏడాదితో పోల్చి చూస్తే విద్యుత్ సౌకర్యంకంప్యూటర్ల లభ్యతఇంటర్నెట్ సదుపాయం కలిగిన పాఠశాలల సంఖ్య 2019-20లో గణనీయంగా పెరిగిందని యుడిఎస్ +నివేదిక వెల్లడించింది. 

 

చేతులను శుభ్రం చేసుకునే సౌకర్యం గల పాఠశాలల సంఖ్యలో  మెరుగుదల కనిపించింది.  2019-20 సంవత్సరంలో దేశంలో  90% కంటే ఎక్కువ పాఠశాలల్లో  చేతులను శుభ్రం చేసుకునే సౌకర్యం ఉంది, 2012-13లో ఇది 36.3% పాఠశాలల్లో మాత్రమే ఉంది. 

 

2012-13 నుంచి వ్యక్తిగతంగా సమాచారాన్ని సేకరించి కాగితాలపై దీనిని నింపి  విశ్లేషించిన తరువాత బ్లాక్ లేదా జిల్లా స్థాయికి పంపే వ్యవస్థ అమలులో ఉంది. దీనిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి పాఠశాలలో నుంచి ఆన్ లైన్ లో సమాచారాన్ని సేకరించడానికి 2018-19 నుంచి యుడిఎస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. 2019-20 సంవత్సరానికి సంబంధించి యుడిఎస్ విధానంలో సేకరించిన సమాచారం ఆధారంగా ప్రస్తుత నివేదికనుఁ సిద్ధం చేశారు. 

యునైటెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ ( యుడిఎస్ఇ +2019-20 నివేదిక  ముఖ్యాంశాలు: 

    * 2019-20లో పాఠశాల విద్యలో ప్రీ-ప్రైమరీ నుంచి  హయ్యర్ సెకండరీ వరకు చదువుతున్న  విద్యార్థుల సంఖ్య  26.45 కోట్లు దాటింది.  2018-19తో పోలిస్తే ఇది 42.3 లక్షలు ఎక్కువ.

        *  2018-19తో పోలిస్తే 2019-20లో పాఠశాల విద్య అన్ని స్థాయిలలో స్థూల నమోదు నిష్పత్తి మెరుగుపడింది.

  * స్థూల నమోదు నిష్పత్తి 2019-20లో (2018-19 నుంచి)అప్పర్  ప్రాథమిక స్థాయిలో 89.7% (87.7% నుంచి)ప్రాథమిక స్థాయిలో 97.8% (96.1%  నుంచి  )సెకండరీ స్థాయిలో 77.9% (76.9%  నుంచి  ) మరియు హయ్యర్ సెకండరీ స్థాయిలో51.4% (50.1%  నుంచి  ) హయ్యర్ సెకండరీ స్థాయిలో పెరిగింది. 

  * స్థూల నమోదు నిష్పత్తి (జిఇఆర్) 2012-13 మరియు 2019-20 మధ్య సెకండరీలో దాదాపు 10% మెరుగుపడింది.  సెకండరీ విద్యలో  జిఇఆర్ 2019-20లో దాదాపు 78 శాతానికి చేరుకుంది. ఇది  2012-13లో 68.7 శాతంగా ఉంది.

      * స్థూల నమోదు నిష్పత్తి (జిఇఆర్) 2012-13 మరియు 2019-20 మధ్య హయ్యర్  సెకండరీలో 11% కంటే ఎక్కువగా మెరుగుపడింది.  హయ్యర్ సెకండరీ లో  జిఇఆర్ 2019-20లో 51.4 శాతానికి చేరుకుంది.  2012-13లో ఇది 40.1 శాతంగా ఉంది.

        *  2019-20లో 96.87 లక్షల మంది ఉపాధ్యాయులు పాఠశాల విద్యా రంగంలో పనిచేస్తున్నారు.  2018-19తో పోలిస్తే ఇది సుమారు 2.57 లక్షలు ఎక్కువ.

          *  పాఠశాల విద్య  అన్ని స్థాయిలలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి (పిటిఆర్) మెరుగుపడింది.

         * 2019-20లో ప్రైమరీ విద్యలో  పిటిఆర్ 26.5 గాఅప్పర్ ప్రైమరీ మరియు  సెకండరీలో  పిటిఆర్ 18.5 గాహయ్యర్ సెకండరీలో  పిటిఆర్ 26.1 గా ఉంది. 

       * 2019-20నాటికి  ప్రాధమిక విద్యలో  పిటిఆర్ 26.5 గా ఉంది.  ఇది 2012-13లో 34.0 గా ఉంది.  2019-20లో అప్పర్ ప్రైమరీలో  పిటిఆర్ 18.5 గా ఉంది.  2012-13లో ఇది 23.1 గా ఉంది.

        * 2019-20లో సెకండరీ విద్యలో పిటిఆర్ 18.5 గా ఉంది , 2012-13లో ఇది 29.7 గా ఉంది.

        *  2019-20లో హయ్యర్ సెకండరీ రంగంలో  పిటిఆర్ 26.1 గా ఉండగా  2012-13లో ఇది 39.2 గా ఉంది.

      * వికలాంగులకు  సార్వత్రిక  విద్యను అందుబాటులోకి తీసుకుని రావడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి.  2018-19తో పోలిస్తే దివ్యంగులైన విద్యార్థుల చేరిక  6.52% పెరిగింది.

         *   2019-20లో ప్రైమరీ నుంచి  హయ్యర్ సెకండరీ వరకు చేరిన బాలికల సంఖ్య  12.08 కోట్లకు పైగా ఉంది.  2018-19తో పోలిస్తే ఈ సంఖ్య  14.08 లక్షలకు పైగా పెరిగింది. 

     * 2019-20లో (2018-19 నుంచి ) బాలికల స్థూల నమోదు నిష్పత్తి ఎగువ ప్రాథమిక స్థాయిలో 90.5% (88.5%  నుంచి  )ఎలిమెంటరీ స్థాయిలో 98.7% (96.7%  నుంచి),సెకండరీ స్థాయిలో 77.8% (76.9% నుంచి  ) మరియు హయ్యర్  సెకండరీ స్థాయిలో 52.4% (50.8% నుండి) కి పెరిగింది. 

   * హయ్యర్ సెకండరీ స్థాయిలో బాలికల స్థూల నమోదు నిష్పత్తి 2012-13 మరియు 2019-20 మధ్య 13% పెరిగింది.  ఇది 2012-13లో 39.4% మరియు 2019-20లో 52.4% గా ఉంది.  బాలురతో పోల్చి చూస్తే బాలికల సంఖ్య ఎక్కువగా ఉంది.  హయ్యర్ సెకండరీలో  బాలుర జిఇఆర్ 2019-20లో 50.5%గా ఉంది , 2012-13లో ఇది 40.8%గా ఉంది.

     *  2012-13 మరియు 2019-20 మధ్య సెకండరీ మరియు హయ్యర్ సెకండరీ స్థాయిలో బాలికల జిఇఆర్ బాలుర జిఇఆర్ కంటే ఎక్కువగా పెరిగింది.

   * సెకండరీ స్థాయిలో బాలికలకు జిఇఆర్ 9.6 శాతం పెరిగి 2019-20లో 77.8 శాతానికి చేరుకుందిఇది 2012-13లో 68.2 శాతంగా ఉంది.

     *  2012-13 మరియు 2019-20 మధ్య సెకండరీ మరియు హయ్యర్ సెకండరీ స్థాయిలలో లింగ సమానత్వ సూచిక (జిపిఐ) మెరుగుపడింది.  జిపిఐ మెరుగుదల హయ్యర్ సెకండరీ స్థాయిలో ఎక్కువగా కనిపించింది.    2012-13లో 0.97గా ఉన్న ఈ సూచిక  2019-20లో 1.04 కు పెరిగింది. 

      *   2019-20నాటికి భారతదేశంలో 80% కంటే ఎక్కువ పాఠశాలలు  విద్యుత్తు సౌకర్యాన్ని  కలిగి ఉన్నాయి. 2018-19 సంవత్సరంతో పోలిస్తే  ఈ సంఖ్య 6% కి మించి పెరిగింది.

       * 2019-20లో కంప్యూటర్ సౌకర్యం ఉన్న పాఠశాలల సంఖ్య 5.2 లక్షలకు చేరింది 2018-20లో 4.7 లక్షల పాఠశాలలు కంప్యూటర్ సౌకర్యాన్ని కలిగి వున్నాయి.

    * ఇంటర్నెట్ సదుపాయం ఉన్న పాఠశాలల సంఖ్య 2019-20లో 3.36 లక్షలకు పెరిగింది. 2018-19లో వీటి సంఖ్య 2.9 లక్షలుగా ఉంది. 

     * భారతదేశంలో 90% కంటే ఎక్కువ పాఠశాలలు 2019-20లోచేతులను శుభ్రం చేసుకునే  సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి.  ఈ శాతం 2012-13లో 36.3%గా  ఉంది.

      *   2019-20నాటికి దేశంలో  83% కంటే ఎక్కువ పాఠశాలలు విద్యుత్తును కలిగి ఉన్నాయిఅంతకుముందు సంవత్సరం 2018-19తో పోలిస్తే వీటి సంఖ్య దాదాపు 7% వరకు పెరిగింది.  2012-13లో సుమారు 54.6% పాఠశాలలకు మాత్రమే విద్యుత్ ఉంది.

    * 2019-20లో 82% కి మించి పాఠశాలలు విద్యార్థులకు  వైద్య పరీక్షలను నిర్వహించాయి.  ఇది గత  సంవత్సరం  2018-19తో పోలిస్తే 4% కంటే ఎక్కువ.  2012-13లో సుమారు 61.1% పాఠశాలలు వైద్య పరీక్షలు నిర్వహించాయి.

          * భారతదేశంలో 2019-20 నాటికి  84% కి మించి  పాఠశాలలు  లైబ్రరీ / రీడింగ్ రూమ్ / రీడింగ్ కార్నర్‌ను సౌకర్యాన్ని కలిగి ఉన్నాయిఅంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 4% పెరిగింది.  2012-13లో సుమారు 69.2% పాఠశాలలు  లైబ్రరీ / రీడింగ్ రూమ్ / రీడింగ్ కార్నర్ ఉన్నాయి.

 వివరాల కోసం 

https://www.education.gov.in/hi/statistics-new?shs%20term%20node%20tid%20depth%20=394&Apply=Apply లింక్ చూడండి.

 


(Release ID: 1731947) Visitor Counter : 390