మంత్రిమండలి
ఆరోగ్య పరిశోధన రంగం లో భారతదేశాని కి, మయన్మార్ కు మధ్య ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
30 JUN 2021 4:17PM by PIB Hyderabad
భారతదేశాని కి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ (ఐసిఎమ్ఆర్), మయన్మార్ కు చెందిన ఆరోగ్యం, క్రీడల మంత్రిత్వ శాఖ, వైద్య పరిశోధన విభాగం (డిఎమ్ఆర్) లు న్యూ ఢిల్లీ లో 2020 ఫిబ్రవరి లో సంతకాలు చేసిన ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) తాలూకు వివరాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టి కి తీసుకు రావడమైంది.
పరస్పరం పరిశోధన కు ఉద్దేశించిన అంశాల లో ఆరోగ్య పరిశోధన తాలూకు బంధాన్ని పటిష్ట పరచాలన్నది ఈ ఎమ్ఒయు ఉద్దేశ్యం గా ఉంది. దీని తాలూకు ప్రధాన ఉద్దేశ్యాలు ఏవేవంటే:
ఎ) అంటురోగాల నివారణ (ఉభయ పక్షాలు నిర్ణయించిన మేరకు);
బి) వైరల్ ఇన్‌ఫెక్శన్ లు, సరికొత్త గా ఉత్పన్నం అయ్యే ఇన్‌ఫెక్శన్ లకు సంబంధించి ఒక నెట్ వర్క్ ప్లాట్ ఫార్మ్ ను అభివృద్ధి పరచడం;
సి) పరిశోధన విధి విధానాల నిర్వహణ, వైద్యశాల స్థాయి పరీక్ష లు, నైతిక నియమావళి వగైరా అంశాల లో శిక్షణ/ సామర్ధ్యాల పెంపుదల.
డి) నియంత్రణ సంబంధిత యంత్రాంగాల మధ్య సామరస్యాన్ని కల్పించడం.
వర్క్ శాప్ లు/ సమావేశాలు, పరిశోధన సంబంధిత ప్రాజెక్టుల కు నిధుల ను సమకూర్చే అంశం అప్పటికి అందుబాటు లో ఉన్న నిధుల ను బట్టి ఎప్పటికి అప్పుడు నిర్ణయించడం జరుగుతుంది. ప్రతి ఒక్క సంస్థ నుంచి ప్రతినిధుల ను తీసుకొని రెండు పక్షాలు ఒక సంయుక్త కార్యాచరణ సమూహాన్ని (జెడబ్ల్యుజి) ఏర్పాటు చేయవలసి ఉంటుంది. జెడబ్ల్యుజి సమావేశాలను ఒకసారి భారతదేశం లోను, మరొకసారి మయన్మార్ లోను నిర్వహించవలసి ఉంటుంది. వీజ ప్రవేశం, బస, ఆరోగ్య బీమా, జెడబ్ల్యుజి సభ్యుల స్థానిక రవాణా సహా ప్రయాణానికి సంబంధించినటువంటి వ్యయాల ను వారి ని పంపించే దేశం భరించవలసి ఉంటుంది. కాగా, జెడబ్ల్యుజి సమావేశాల కు అయ్యే నిర్వహణ వ్యయాల ను ఆతిథేయి దేశం తానే భరించాలి.
(Release ID: 1731547)
Visitor Counter : 156
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam