భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
వాహన పరీక్షల కోసం ఆసియాలోనే పొడవైన, ప్రపంచంలో ఐదవ పొడవైన హై స్పీడ్ ట్రాక్‌ను ప్రారంభించిన భారత్
భవిష్యత్తులో, ప్రపంచ వాహన ఉత్పత్తి కేంద్రంగా అవతరించమే భారత్ లక్ష్యం: శ్రీ ప్రకాష్ జావడేకర్
Posted On:
29 JUN 2021 2:44PM by PIB Hyderabad
కేంద్ర భారీ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జావడేకర్, 'నాట్రాక్స్- ది హై స్పీడ్ ట్రాక్' (హెచ్‌ఎస్‌టీ)ను ఇండోర్‌లో ప్రారంభించారు. ఇది ఆసియాలోనే అతి పొడవైన ట్రాక్. వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో దీనిని అభివృద్ధి చేశారు. ద్విచక్ర వాహనాల నుంచి భారీ ట్రక్కుల వరకు, అన్ని రకాల వాహనాలకు అన్ని రకాల గరిష్ట వేగ పరీక్షలను ఒకేచోట చేసే కేంద్రమిది.
ప్రపంచ స్థాయిలో నిర్మించిన 11.3 కిలోమీటర్ల హై స్పీడ్ ట్రాక్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి; వాహనాలు, తయారీ, విడిభాగాల రంగంలో ప్రపంచ కేంద్రంగా అవతరించడమే భారత్ లక్ష్యంగా వివరించారు. "ఆత్మనిర్భర్ భారత్ వైపు మనం వేగంగా అడుగులేస్తున్నాం. ఆ దిశగా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన దేశం వాహన తయారీ కేంద్రంగా మారాలన్న ప్రధాని కలను నెరవేర్చడానికి మా మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. వాహన, ఉత్పాదక పరిశ్రమల అభివృద్ధి ఉద్యోగ కల్పనలో సాయం చేస్తుంది" అని చెప్పారు.
రైల్వేలు, ప్రధాన రహదారులు, జలమార్గాల్లో ఏళ్ల తరబడి నానుతున్న ప్రాజెక్టులు, తమ ప్రభుత్వ బలమైన రాజకీయ సంకల్పం వల్ల ఇప్పుడు పూర్తవుతున్నాయని మంత్రి జావడేకర్ చెప్పారు.
భారీ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్ కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. దేశ భారీ సాధికారతకు తయారీ, వాహన రంగ పరిశ్రమలు సాయం చేస్తాయి కాబట్టి, ఆ రంగాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు.
నాట్రాక్స్ కేంద్రంలో వాహనల గరిష్ట వేగం, ఆక్సిలరేషన్, స్థిరమైన వేగ ఇంధన వినియోగం, రియల్ రోడ్ డ్రైవింగ్ సిమ్యులేషన్ ద్వారా ఉద్గార పరీక్షలు, గరిష్ట వేగ నిర్వహణ, లేన్ మార్పు, అధిక వేగ మన్నిక వంటి పరీక్షల సమయంలో అధిక వేగ నిర్వహణ, స్థిరత్వ మూల్యాంకనం వంటి పరీక్షలను నిర్వహిస్తారు. 'వెహికల్ డైనమిక్స్'కు ఇది ఒక 'సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్'.
బీఎంమ్‌డబ్ల్యూ, మెర్సిడెజ్, ఆడి, ఫెరారీ, లాంబోర్ఘిని, టెస్లా వంటి ఖరీదైన కార్ల గరిష్ట వేగ సామర్థ్యాన్ని గణించడానికి హెచ్‌ఎస్‌టీని ఉపయోగిస్తారు. భారత్‌లోని మరే ట్రాక్‌లోను వీటి వేగ సామర్థ్యాన్ని కొలవలేం. మధ్యప్రదేశ్ మధ్యలో ఇది ఉన్నందున, ఎక్కువ 'ప్రధాన ఓఈఎంల'కు అందుబాటులో ఉంటుంది. భారదేశ పరిస్థితులకు అనుగుణంగా ప్రోటోటైప్ కార్ల అభివృద్ధి కోసం విదేశీ ఓఈఎంలు ఇప్పుడు నాట్రాక్స్ హెచ్‌ఎస్‌టీపై దృష్టి పెడతాయి. ప్రస్తుతం, వాహన గరిష్ట వేగ పరీక్షల కోసం విదేశాల్లో ఉన్న తమ హై స్పీడ్ ట్రాక్‌లకు విదేశీ ఓఈఎంలు వెళుతున్నాయి.
అన్ని రకాల వాహనాల గరిష్ట వేగ సామర్థ్య పరీక్షలకు ఏక కేంద్ర పరిష్కారం ఈ ట్రాక్. ప్రపంచ పొడవైన ట్రాకుల్లో ఒకటి. ద్విచక్ర వాహనాల నుంచి భారీ వాహనాల వరకు విస్తృత శ్రేణి వాహనాల అవసరాలను ఇది తీర్చగలదు. స్టీరింగ్ నియంత్రణతో, వంపుల వద్ద కూడా గరిష్టంగా 375 కిలోమీటర్ల వేగాన్ని ఈ ట్రాక్‌పై సాధించవచ్చు. ఇది ప్రపంచ స్థాయి సురక్షితమైన పరీక్ష ట్రాక్‌లలో ఒకటి.
(Release ID: 1731163)
Visitor Counter : 319